వాతావరణం మార్పులతో శరీరంపై దద్దుర్లు వేధిస్తున్నాయా.. కాస్త జాగ్రత్త పడితే సమస్య నుంచి గట్టెక్కటం తేలికే!

వాతావరణ మార్పులు కారణంగానో, కొన్ని రకాల కీటకాల వల్ల మన చర్మంపై అప్పుడప్పుడు దద్దుర్లు వస్తూ ఉంటాయి. సమస్య చిన్నదైనా ఈ దద్దుర్లు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. చిన్న పిల్లలకైతే మరింత ఆందోళన

వాతావరణం మార్పులతో శరీరంపై దద్దుర్లు వేధిస్తున్నాయా.. కాస్త జాగ్రత్త పడితే సమస్య నుంచి గట్టెక్కటం తేలికే!


వాతావరణ మార్పులు కారణంగానో, కొన్ని రకాల కీటకాల వల్ల మన చర్మంపై అప్పుడప్పుడు దద్దుర్లు వస్తూ ఉంటాయి. సమస్య చిన్నదైనా ఈ దద్దుర్లు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. చిన్న పిల్లలకైతే మరింత ఆందోళన చెందుతుంటారు తల్లిదండ్రులు. అయితే ఈ సమస్యకు పరిష్కరించుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

కొబ్బరి నూనె

ఆర్గానిక్ కొబ్బరినూనెను తీసుకొని దద్దుర్లు ఏర్పడిన ప్రాంతంలో మర్దనా చేయాలి. ఇలా చేశాక కొన్ని గంటల పాటు అలాగే వదిలేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనె సహజమైన స్కిన్ మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. ఇది దురదను తగ్గించి దద్దుర్లు మంటను అరికడుతుంది. అంతేకాకుండా కొబ్బరినూనెకు యాంటీ మైక్రోబియల్ గుణాలున్నాయి. అవి చర్మాన్ని బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. ఐతే ఎట్టి పరిస్థితుల్లోనూ రిఫైన్డ్ కొబ్బరినూనెను వాడకూడదు. 

ఓట్ మీల్

2 లేదా 3 కప్పుల ఓట్ మీల్ ను చల్లని నీళ్లలో వేసి 10-15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఈ నీళ్లతో రోజుకు ఒకసారి స్నానం చేస్తే దురద నుంచి ఉపశమనం కలుగుతుంది. చల్లని నీరు చర్మానికి స్వాంతన కలిగిస్తుంది. చల్లటి నీటికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఓట్ మీల్ లో బీటా గ్లూకాన్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని కాపాడతాయి.

బేకింగ్ సోడా

కొద్దిగా బేకింగ్ సోడాకు నీళ్లు జతచేసి మెత్తని పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని దద్దుర్లు ఏర్పడిన ప్రాంతంపై రాసి ఆరబెట్టాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే దద్దుర్లు తగ్గుతాయా. బేకింగ్ సోడాలోని క్షార గుణం చర్మానికి సాంత్వన కలిగిస్తుంది. దురద, మంట లేకుండా చేస్తుంది. 

అలోవెరా జెల్తా

జా కలబంద రసాన్ని తీసుకొని దద్దుర్లు ఏర్పడిన చోట పూయాలి. అలా 20-30 నిమిషాల పాటు ఉంచి చల్లని నీటితో కడిగేయాలి,. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే చర్మoపై దద్దుర్లు తగ్గుముఖం పడతాయి. కలబందసహజంగానే మాయిశ్చరైజింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. అందుకే అలోవెరా దద్దుర్లకు మంచి ఇంటి చిట్కా అని చెప్పవచ్చు.

పసుపు

పసుపును పేస్టులా చేసుకొని కూడా ర్యాషెస్ ఏర్పడిన ప్రదేశంలో రాయవచ్చు. పసుపులో కర్కుమిన్ అనే ఒక పదార్థం వల్ల దీనికి యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ హిస్టమైన్ గునాలు వచ్చాయి. సహజసిద్ధంగా దురద, మంటను తగ్గించేందుకు పసుపు చక్కని మార్గం.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.