Custard apple leaves : సీతాఫలం ఆకులతో షుగర్‌ నుంచి హార్ట్‌ వరకూ అన్ని సమస్యలకు పరిష్కారం..

Diabetes కి జామ ఆకులు బాగా పనిచేస్తాయని మనకు తెలుసు.. Custard apple leaves  కూడా పనిచేస్తాయని మీరు విన్నారా..? ఒక్క డయబెటిస్‌కే కాదు.. Custard apple leaves తో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు.

Custard apple leaves : సీతాఫలం ఆకులతో షుగర్‌ నుంచి హార్ట్‌ వరకూ అన్ని సమస్యలకు పరిష్కారం..
Benefits of custard apple leaves


Diabetes కు ట్యాబ్లెట్స్‌ కంటే.. ఆయుర్వేదం ప్రకారం చికిత్స చేయించుకుంటే.. మంచి రిజల్ట్ ఉంటుంది చాలా మంది నుమ్ముతారు. మన వంటిల్లే వైద్యశాల.. ఎన్నో రోగాలకు మందులు మన వంటగదిలో ఉన్నాయి.. ఒకప్పుడు జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, ఇంకా ఎంత పెద్ద సమస్య అయినా.. మూలికలతోనే తగ్గించేవారు.. కాలం మారింది.. చిన్న సమస్యకైనా..మందుబిల్ల పడాల్సిందే..! మధుమేహానికి జామ ఆకులు బాగా పనిచేస్తాయని మనకు తెలుసు.. Custard apple leaves  కూడా పనిచేస్తాయని మీరు విన్నారా..? ఒక్క డయబెటిస్‌కే కాదు.. Custard apple leaves తో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అందుకు గాను వాటిని ఎలా ఉప‌యోగించాలో చూద్దామా..!

సీతాఫ‌లం ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి సూర్యుని నుంచి వ‌చ్చే అతినీల‌లోహిత కిర‌ణాల బారి నుంచి చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. చ‌ర్మాన్ని ముడ‌త‌లు ప‌డ‌కుండా చూస్తాయి. ఈ ఆకుల‌ను వేసి మ‌రిగించిన నీటిని తాగుతుంటే చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.
సీతాఫ‌లం ఆకుల్లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా మెరుగ్గా చేస్తుంది. అందువ‌ల్ల ఈ ఆకుల‌తో త‌యారు చేసిన నీటిని రోజూ తాగాలి. దీంతో గుండె జ‌బ్బులు.. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌లు రాకుండా జాగ్రత్తపడొచ్చు..
డ‌యాబెటిస్ స‌మ‌స్య ఉన్న‌వారికి సీతాఫ‌లం ఆకులు చ‌క్క‌గా ప‌నిచేస్తాయి. ఈ ఆకుల‌ను 2-3 తీసుకుని నీటిలో మ‌రిగించి ఆ నీటిని రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగాలి.. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.
సీతాఫ‌లం ఆకుల‌ను వేసి మ‌రిగించిన నీటిని తాగుతే.. శరీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. ఇమ్యునిటీ పవర్‌ పెరగడం వల్ల వైరస్లు,ఫ్లూలు, ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చు.
కాలిన గాయాలు, పుండ్ల‌ను త్వ‌ర‌గా మానేలా చేసే శక్తి సీతాఫ‌లం ఆకులకు ఉంది. వీటిని 3-4 తీసుకుని పేస్ట్‌లా చేసి ఆ మిశ్ర‌మాన్ని గాయాలు, పుండ్ల‌పై రాస్తే.. ఎలాంటి గాయాలైనా త్వ‌ర‌గా మానుతాయి.
చూశారుగా.. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. సాధారణంగా ఏ పండ్లు చెట్లు అయినా.. అన్ని విధాలుగా మనకు ఉపయోగపడతాయి.. జామ చెట్టు తీసుకుంటే.. ఆకుల్లో ఎన్నో ఔషధగుణాలు.. అరటి చెట్టు కూడా అంతే..!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.