Childhood Falls : పిల్లలు కింద పడినా వారికి దెబ్బలు తగలకపోవడానికి అసలైన కారణం ఇదే

చిన్నపిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి childhood falls ముఖ్యంగా ఊహ తెలియని వయసులో ఉన్నప్పుడు పిల్లలు ఏదో ఒక అల్లరి చేస్తూనే ఉంటారు..

Childhood Falls :  పిల్లలు కింద పడినా వారికి దెబ్బలు తగలకపోవడానికి అసలైన కారణం ఇదే
childhood falls


చిన్నపిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఊహ తెలియని వయసులో ఉన్నప్పుడు పిల్లలు ఏదో ఒక అల్లరి చేస్తూనే ఉంటారు.. ఈ సమయంలో తల్లితండ్రికి అస్సలు తీరిక ఉండదు ప్రతిక్షణం వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి వస్తుంది. అయితే ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కొన్నిసార్లు వాళ్ళు కింద పడిపోతూ ఉంటారు అయితే ఈ సమయంలో వారికి పెద్దగా దెబ్బలు తగలకుండా అసలు కారణమేంటో తాజాగా జరిగిన అధ్యయనంలో తేలింది..

పిల్లలు ఎప్పుడూ అటు ఇటు ఎంత లేస్తూనే ఉంటారు మంచాలు టైపులో పైనుంచి కింద పడిపోతూ ఉంటారు కొంత వయసు వచ్చేంతవరకు వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సి ఉంటుంది.. ముఖ్యంగా వారి తలకి ఎలాంటి దెబ్బలు అయినా తగిలితే అవి జీవితకాలం ప్రభావం చూపిస్తాయని భయపడుతూ ఉంటారు..

అయితే కొన్నిసార్లు మాత్రం పిల్లలు కింద పడిన వారి తలకి మాత్రం ఎలాంటి దెబ్బలు తగలదు.. దేనికి అసలు కారణం పిల్లలకు రెండేళ్లు వచ్చే అంతవరకు తలకు ఎలాంటి దెబ్బలు తగిలిన పెద్ద సమస్య ఉండదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు..  ఈ సమయంలో వారి పుర్రె చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుందని ఎటువంటి దెబ్బలు నైనా ఓర్చుకోగలుగుతుందని తెలుస్తోంది.. అయితే బాగా ఎత్తునుంచి పడినప్పుడు మాత్రం గాయాలు అయ్యే ప్రమాదం లేకపోలేదని ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.. అలాగే చిన్న చిన్న దెబ్బలు విషయంలో పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని..  కానీ పిల్లలకు ముక్కు నుంచి రక్తం వచ్చినా..  తరచూ వాంతులు అవుతున్న..  నీరసంగా కనిపిస్తున్న.. ఫిట్స్ వంటి సమస్య ఏదైనా వస్తే వారి తలకు ఏమైనా పెద్ద దెబ్బ తగిలిందా అని తెలుసుకోవడానికి మాత్రం తప్పనిసరిగా వైద్యుని సంప్రదించాలి అవసరమైతే స్కానింగ్ వంటివి తీయించి పూర్తిగా నిర్ధారణ చేసుకోవాలి..

అలాగే చిన్న పిల్లలు కండరాలు, ఎముకలు సైతం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందవు. అందుకే పెద్దవారు కింద పడగానే కాళ్లు, చేతులు విరిగినట్టు చిన్న పిల్లలకు విరగవు.. ఒకవేళ ఎత్తుల నుంచి కిందపడి ఎముకలు విరగ్గొట్టుకుంటే చాలా తేలికగా సాధారణ స్థితికి వచ్చేస్తాయి. అంతేకాకుండా ఒక వయసు వచ్చిన తర్వాత సైతం ఎలాంటి ఇబ్బంది ఉండదు. కనీసం వారికి దెబ్బ తగిలింది అనే విషయం సైతం తెలియనంతగా అవయవాలు సాధారణ స్థితికి మారిపోతాయి. అందుకే చిన్న పిల్లలు కింద పడే విషయంలో ఎలాంటి భయం అవసరం లేకుండా ప్రశాంతంగా ఉండవచ్చు.. అయితే పిల్లల విషయంలో అజాగ్రత్త పనికిరాదు. నీళ్ల ప్రదేశాలు, విద్యుత్కు సంబంధించిన పరికరాలు, కత్తెరలు, చాకులు వంటగది సామాన్లు వంటి వాటిని పిల్లలకు వీలైనంత దూరంగా ఉంచాలి.. అలాగే మెట్ల మీద ఆడే విషయంలో బండిమీద ప్రయాణించేటప్పుడు అజాగ్రత్త పనికిరాదు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.