వానల్లో తడుస్తున్నారా...అయితే రోగాలకు బ్లాంక్ చెక్ ఇచ్చినట్లే

మొన్నటివరకు ఎండలు చావగొట్టేశాయి.  వానాకాలం వచ్చింది. ఇప్పుడే తెలుగురాష్ట్రాల్లోకి రుతుపవనాలు కూడా వచ్చేశాయి. ఎండలతో అల్లాడిన ప్రజలు కొంచెం రిలాక్స్ అవుతున్నారు. తొలకరి జల్లుల వాతావరణాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇదిగో ఇక ప్రమాదం

వానల్లో తడుస్తున్నారా...అయితే రోగాలకు బ్లాంక్ చెక్ ఇచ్చినట్లే


మొన్నటివరకు ఎండలు చావగొట్టేశాయి.  వానాకాలం వచ్చింది. ఇప్పుడే తెలుగురాష్ట్రాల్లోకి రుతుపవనాలు కూడా వచ్చేశాయి. ఎండలతో అల్లాడిన ప్రజలు......కొంచెం రిలాక్స్ అవుతున్నారు. తొలకరి జల్లుల వాతావరణాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇదిగో ఇక ప్రమాదం మొదలైనట్లే. వర్షం పడుతుంది కదా బయటకు వెళ్తే..కోరి అనారోగ్యాలు తెచ్చుకున్నట్లే. ఎండల వాతావరణం నుంచి బయటపడుతున్నాం కనుక..ఈ వానాకాలం మన జీవనశైలిలో చాలా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో దోమలు, ఈగల బెడద ఎక్కువగా ఉంటుంది. త్వరగా జబ్బుల బారిన పడే ప్రమాదముంది. తినే ఆహారంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Weather Forecast: హై అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షాలు.. ముఖ్యంగా ఈ  ప్రాంతాల్లో.. - Telugu News | Weather Forecast Chance Heavy Rains in  Telangana Districts Includes Hyderabad Know the Details | TV9 Telugu


ఈ సీజన్ లో ఆకు కూరలపై బాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఎంత నాణ్యమైనది అనుకున్నా.....ఎంతోకొంత బొజ్జ లోపలికి పోవాల్సిందే. కాబట్టి వీటి జోలికి వెళ్లకపోవడమే బెటర్. సీజనల్ కూరగాయలు ఫ్రెష్ గా ఉంటాయి. అనేక పోషక విలువలు ఉంటాయి. అవి మన ఇమ్యూనిటీని పెంచుతాయి.

సొర కాయలో ఉన్న ఫైబర్ జీర్ణకోశాన్ని శుభ్రంగా ఉంచుతుంది. అరుగుదలని పెంచుతుంది. ఇందులో కాలరీలు తక్కువ. దానితో పొట్ట నిండుగా ఉంటుంది కానీ హెవీగా అనిపించదు.

ఈ సీజన్ లో మాత్రమే దొరికే కూరగాయల్లో ఆకాకరకాయ. చూడటానికి బాగా కనిపించకపోయినా....దీని మేలు అంతాఇంతా కాదు. ఇందులో ఐరన్, ఫైబర్ తో పాటూ ప్రోటీన్స్ ఉంటాయి.

పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న దానిమ్మ పండు అనారోగ్యాలను నివారిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ బి ఎర్రరక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది, రక్త ప్రసరణను సులభతరం చేస్తుంది.

ఆపిల్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాలానుగుణంగా వచ్చే మార్పులు, వ్యాధులు పోరాడడానికి శరీరానికి సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. గుండె వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

కాచి చల్లార్చిన నీళ్లు తాగుతుండాలి. ఫ్రిజ్‌లో దాచి పెట్టిన ఆహార పదార్థాలను వేడి చేసుకుని తినే అలవాటును మార్చుకోవాలి. తినే పదార్థాలపై మూతలు పెట్టాలి. ఇంట్లో చెత్తని ఎప్పటికప్పుడు పారేస్తుండాలి.

అయితే కొన్ని తినకూడనివి ఉన్నాయి. అవేటంటే....ఎక్కువ నూనెతో తయారయ్యే వంటలు, ఉప్పుగా ఉండే పదార్థాలు, ఊరగాయలు, వేపుళ్లు, వేరుశనగ, చింతపండు
పన్నీర్, రైతా, నిల్వ పదార్థాలు, లస్సీ, పుచ్చపండు వంటివి తీసుకోకూదు.

ఇంకొక విషయమేమిటంటే అధిక శ్రమతో కూడిన ఎక్సర్‌సైజ్ అసలే చేయకూడదు. ఇది శరీరంలోని వేడిని పెంచుతుంది. దానివల్ల తలనొప్పి, ఒళ్లునొప్పులకి దారితీసే అవకాశం ఉంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.