ఇయర్‌ఫోన్స్‌ అదే పనిగా వాడుతున్నారా? అయితే ఒకసారి ఇది తెలుసుకోండి.

తినడానికి తిండి లేకపోయిన పర్లేదు. పీల్చడానికి గాలి లేకపోయినా పర్లేదు. ఉండటానికి ఇల్లు లేకపోయినా చాలు. కానీ చేతిలో ఫోన్‌ లేనిదే మనిషి జీవితం సంపూర్ణం కాదు. అలా ఉంది నేటి సాధారాణ మనిషి జీవితం కూడానూ. అంతేందుకు రోడ్డు

ఇయర్‌ఫోన్స్‌ అదే పనిగా వాడుతున్నారా? అయితే ఒకసారి ఇది తెలుసుకోండి.


తినడానికి తిండి లేకపోయిన పర్లేదు. పీల్చడానికి గాలి లేకపోయినా పర్లేదు. ఉండటానికి ఇల్లు లేకపోయినా చాలు. కానీ చేతిలో ఫోన్‌ లేనిదే మనిషి జీవితం సంపూర్ణం కాదు. అలా ఉంది నేటి సాధారాణ మనిషి జీవితం కూడానూ. అంతేందుకు రోడ్డుపై అడుక్కునే వాళ్ల దగ్గర కూడా ఫోన్‌ ఉంటోందంటే.... వినడానికే అతిశయోక్తిగా లేదు.

Healthy headphone use: How loud and how long? - Harvard Health

అప్పట్లో మనిషికి నిత్యవసర వస్తువులు కూడు, గూడు, గుడ్డ. కానీ ఇప్పటి మానవుడి నిత్యవసరాల్లో ఇవేమీ లేకపోయినా.....ఫోన్‌ అనే ఒక జాడ్యం చేరిపోయింది. ఇంక ఫోన్‌ అనేది లేకపోతే......జీవితమే శూన్యం అనే స్థాయికి చేరిపోయారు నేటి జనాలు.

టెక్నాలజీ పేరుతో ఫోన్‌ను విపరీతంగా వాడుతున్నాం. కానీ దానివల్ల ఎన్ని అనర్థాలు కోరి తెచ్చుకుంటున్నామో. అలా అని ఫోన్‌ వాడటం తప్పు అని చెప్పట్లేదు. ఎందుకంటే ముందే చెప్పుకున్నాంగా....ఫోన్‌ అనేది నిత్యవసర వస్తువు అయిపోయిందని. ఒక మనిషి గురించి తెలుసుకోవాలన్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియలన్నా, మన విశ్వం గురించి తెలుసుకోవాలన్నా ఫోన్‌ అనేది ముఖ్యమైన ప్రాధాన్యత అంశం. కాబట్టి ఉండాల్సిందే. అయితే అది ఎంతవరకు?...

The best headset for working at home in 2023 | Creative Bloq

ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంటోంది. చాలామంది ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ మొబైల్‌కి కనెక్ట్ చేసి పాటలు వింటుంటారు. ఇంకొందరు మాట్లాడటానికీ వీటినే వాడుతారు. ఫోన్‌ అదే పనిగా చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడటం వల్ల రేడియోషన్‌ ఎక్కువగా ఉంటుందని...ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ వాడుతున్నారు. అలా అని దాన్ని కూడా అదే పనిగా వాడితే.... ఎన్నో సమస్యలు ఉంటున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అవెంటో ఇప్పుడు చూద్దాం.

ఇయర్ ఫోన్, ఇయర్ బడ్, ఎయిర్ ప్యాడ్, బ్లూటూత్ ఆపరేటింగ్ ఇయర్ ఫోన్.. ఇవన్నీ ఒకే కోవకు చెందినవే. కానీ రోజంతా వీటిని పెట్టుకుంటే చాలా ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేయాల్సి ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండాలని.....పాటలు వింటాం. రోజూ అదే పని చేస్తే.....మనసు ప్రశాంతత పక్కన పెట్టండి.....వినికిడి సమస్యలు చుట్టుముడతాయి. కర్ణబేరికి దగ్గరగా పెట్టుకోవడం వల్ల ఫంగస్, బ్యాక్టీరియాలు పేరుకుపోతాయి. దానివల్ల దురద, నొప్పి, చెవిలో చీము కారడం, చెవిపోటు, ఏదో గాలి బ్లాక్‌ అయినట్లు అనిపిస్తుంది. ఇలాంటి బాధలు చాలామందికి వస్తుంటాయి. కానీ పట్టించుకోరు.

ఇయర్ ఫోన్ల వల్ల చెవిలోకి గాలి వెళ్లే అవకాశం తగ్గుతుంది. ఇంక లోపల ఫంగస్ పెరుగుతుంది. చివరకు వినికిడి సమస్యకు దారితీస్తుంది. ఇయర్‌ఫోన్లు చెవికి దగ్గరగా ఉంటాయి కాబట్టి సమస్య. అదే హెడ్‌ఫోన్స్‌ వాడుకుంటే కొంచెం సమస్య తగ్గుతుంది. ఎందుకంటే హెడ్‌ఫోన్స్‌ చెవిలోపలకు వెళ్లలేవు, బయటే ఒక మూతలా పట్టుకుంటుంది. కాబట్టి కర్ణభేరికి దూరంగా ఉంటుంది. తద్వారా చెవిపై అంతగా ప్రభావం చూపవు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.