కడుపులో కణితులకు ఈ ఆయుర్వేద థెరపీ ప్రయత్నించండి

మహిళలకు ప్రతీది సమస్య. పుట్టే పుట్టుక నుంచి చావు అంచులదాకా అడుగడుగునా ఆటంకాలే. అందులో మధ్య వయసులో వచ్చే ఇబ్బందులు.

కడుపులో కణితులకు ఈ ఆయుర్వేద థెరపీ ప్రయత్నించండి
Stomach Cancer


మహిళలకు ప్రతీది సమస్య. పుట్టే పుట్టుక నుంచి చావు అంచులదాకా అడుగడుగునా ఆటంకాలే. అందులో మధ్య వయసులో వచ్చే ఇబ్బందులు....ప్రాణం పోయే వరకు వదలవు. ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా....వచ్చే ఆటంకాలను ఆపలేం.

అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి...గర్భాశయ సమస్యలు. అసలీ గర్భాశయ సమస్యలు ఇప్పుడు మరీ ఎక్కువైపోయాయి. అప్పట్లో గర్భం దాల్చాక పిల్లలు కూడా ఎదిగాక ఆడవాళ్లకు గర్బాశయ సమస్యలు వచ్చేవి. కానీ ఇప్పుడు రజస్వల కాకముందే వచ్చేస్తున్నాయి.

చిన్నవయసులోనే గర్భాశయంలో కణితులు ఏర్పడిపోతున్నాయి. ఈ కణితులను ఫ్రైబ్రాయిడ్స్‌ అంటారు. చిన్న చిన్న నీటితిత్తుల్లా ఉంటాయి. ఒక్కోసారి సెంటీమీటర్ల వరకు పెరిగే ఛాన్స్‌ కూడా ఉంది. సాధారణంగా ఈ కణితులు...30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న మహిళల్లో కనిపిస్తాయి. ఇవి ఎందుకు ఏర్పడతాయన్నది...ఇప్పటికీ శాస్త్రీయమైన ఆధారాలు లేవు.

మహిళలకు హార్మోన్ల సమస్య చాలా పెద్ద విషయం. ఏమాత్రం జీవనవిధానంలో గాడి తప్పినా ఆ ప్రభావం హార్మోన్లపై పడుతుంది. మహిళల్లో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ స్థాయుల్లో అసమతుల్యత తలెత్తితే కణితులు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కణితులు అనేవి వంశపారంపర్యంగా కూడా వస్తాయి. పోషకాహార లోపం, ఊబకాయం, తినే తిండి, ఒత్తిడి వీటి కారణంగానూ వస్తాయి. అందుకే మహిళలు జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలు కనబడకుండా కూడా ఫైబ్రాయిడ్స్ ఉండవచ్చు.

ఈ కణితులు ఉంటే నెలసరిలో రక్తస్రావం ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల శరీరంలో ఉండే రక్తమంతా బయటకు వచ్చేయడం వల్ల కడుపునొప్పి, నడుపునొప్పి విపరీతంగా ఇబ్బంది పెట్టేస్తాయి. పెద్దపేగుపైన ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాకుండా ప్రతిసారీ మూత్రం వస్తుంది. దానివల్ల రక్తహీనత ఏర్పడుతుంది.

అయితే ఈ సమస్యను సకాలంలో గుర్తిస్తే...నయం చేయోచ్చు. దీనికి శస్త్రచికిత్సలు ఉంటాయి. అన్నింటికన్నా ఆయుర్వేద చికిత్స మంచిది. ఇందులో పంచకర్మ థెరపీ చాలా బాగా పనిచేస్తుంది. ఈ థెరపీతో కొన్ని మూలికలు తీసుకుంటే ఫలితం ఉంటుంది. మూలికల్లో త్రిఫల, ఉసిరి, కచ్నార్ గుగ్గుల్, తిప్పతీగ,  పసుపు..ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. త్రిఫల పొడి, త్రిఫల డికాక్షన్‌లాగా తీసుకున్నా మంచిది. తిప్పతీగను ఆయుర్వేదంలో ఎన్నో చికిత్సలకు ఉపయోగిస్తారు. తిప్పతీగ టీ తీసుకుంటే మంచిది.

ఉసిరికాయ గురించి ఇంక చెప్పనక్కర్లేదు. చాలా మంచి లక్షణాలున్నాయి. గర్భాశయ క్యానర్‌ నుంచి రక్షిస్తుంది. ఫైబ్రాయిడ్ల సమస్యకు ఉసిరి జ్యూస్ బెటర్.
పసుపులో కర్కుమిన్ అనే పాలీఫెనాల్ ఉంటుంది. కణతి కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. కచ్నార్ గుగ్గుల్ హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడంలో సహాయపడుతుంది.

మహిళ ఎదిగే క్రమంలో శారీరకంగా వచ్చే మార్పులు, మానసికంగా వచ్చే మార్పులు మరింత కుంగదీస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవనవిధానాన్ని ఆరోగ్యంగా మార్చుకోవాలి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.