అర్జునా ఆకు తెలుసా.. ఈ చెట్టు బెరడును పాలతో కాచి ఉదయాన్నే తాగితే గుండె సమస్యలన్నీ దూరం.. !

అర్జున ఆకును ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా వినియోగిస్తుంటారు. దీనినే మద్ది ఆకు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆకులు తెలుపు, ఎరుపు రంగులో లభిస్తుంటాయి. ఈ చెట్టు గుబురుచెట్టుగా పెరుగుతుంది. ఈ అర్జున బెరడులో కాల్షియం అధికంగా ఉంటుంది. అల్యూమినియం, మెగ్నీషియం కూడా మెండుగా ఉంటాయి. తెలుపు, ఎరుపు రంగుల్లోని ఏదెైనా ఒకదాని బెరడున తీసుకుని

అర్జునా ఆకు తెలుసా.. ఈ చెట్టు బెరడును పాలతో కాచి ఉదయాన్నే తాగితే గుండె సమస్యలన్నీ దూరం.. !


అర్జున ఆకును ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా వినియోగిస్తుంటారు. దీనినే మద్ది ఆకు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆకులు తెలుపు, ఎరుపు రంగులో లభిస్తుంటాయి. ఈ చెట్టు గుబురుచెట్టుగా పెరుగుతుంది. ఈ అర్జున బెరడులో కాల్షియం అధికంగా ఉంటుంది. అల్యూమినియం, మెగ్నీషియం కూడా మెండుగా ఉంటాయి. తెలుపు, ఎరుపు రంగుల్లోని ఏదెైనా ఒకదాని బెరడున తీసుకుని.. మెత్తగా నూరి దానిని పుండు ఉన్న చోట కడితే... ఎలాంటి పుండ్లు అయినా తక్షణమే తగ్గిపోతాయి. అర్జున చెట్టు బెరడు అధిక రక్తపోటు, గుండె నొప్పి మొదలైన దీవివిధ రకాలైన గుండె జబ్బులలో బాగా ఉపయోగపడుతుంది. ఆధునిక పరిశోధనల్లో సైతం..దీనిని కార్డియాక్ టానిక్" గా పిలుస్తారు. 

అర్జున బెరడుని పాలలో కాచి వచ్చిన డికాక్షన్ ను ఉదయం పూట పరగడుపున తాగితే గుండె జబ్బులున్న వారికి ఉపశమనం లభిస్తుంటుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఆకును ఆయుర్వేదం గంటకు సంబంధించిన పలు సమస్యలని నియంత్రించడానికి ఉపయోగిస్తుంది.

ఈ బెరడు నుంచి తయారు చేసిన చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. అర్జునలో ఉన్న నేచురల్ కాల్షియం వల్ల స్త్రీలలో వచ్చే ఆస్టియో ప్లోరోసిస్ అనే సమస్యను  నివారించుకోవచ్చు. అలాగే... ఈ చెట్టు బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే వీర్య కణాల సంఖ్య పెరగడంతో పాటు.. ఎముకల పుష్టి, బీపీ, గుండెజబ్బులు, కొలెస్ట్రాల్ వంటివి తగ్గుతాయి. 

అర్జునని ఆస్తమా ఉన్నవారిలో బెరడును బాగా మెత్తగా నూరి చూర్ణంగా చేసి పాయసంలో పైన 10 గ్రాములు చల్లి, దానిని  మంచుకు పెట్టి తింటే ఆస్తమా తగ్గుతుంది. మద్ది చెట్టు బెరడు  చూర్ణాన్ని తేనెలో కలిపి ముఖంపై మొటిమలు వచ్చే చోట రాసుకుంటే త్వరగా తగ్గుతాయి. అర్జున బెరడు కషాయంతో కాలిన గాయాలు, పుళ్లు తగ్గుతాయి

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.