అండాశయ ఆరోగ్యనికి ఇవి తప్పనిసరి.. !

అండాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎన్నో రకాల వ్యాయామాలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా దీనికి సంబంధించిన ఆహారం సైతం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అందరూ ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు స్త్రీ అండాశయాన్ని, ఆ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి అవి ఏంటంటే.. 

అండాశయ ఆరోగ్యనికి ఇవి తప్పనిసరి.. !


అండాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎన్నో రకాల వ్యాయామాలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా దీనికి సంబంధించిన ఆహారం సైతం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అందరూ ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు స్త్రీ అండాశయాన్ని, ఆ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి అవి ఏంటంటే.. 
3 Tips for Ovarian Health | Shermie Cadabona, DACM, LAc

పోషకాహారం.. 

అవకాడో.. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అవకాడోలో మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్‌ అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు.. ఎగ్‌ హెల్త్‌ మెరుగుపరచడానికి, పునరుత్పత్తి వ్యవస్థను కాపాడటానికి సహాయపడుతాయి. దీన్ని స్మీతీగా, సలాడ్స్‌లో తీసుకోవచ్చు.
మెంతులు..ఋతుస్రావం సమయంలో తీవ్రంగా వేధించే నొప్పిని కంట్రోల్ చేయాలంటే... మెంతుల్ని వినియోగించాలి. అండాశయ ఆరోగ్యానికి కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి వివిధ రకాల ఉదర సమస్యల్ని నివారించడంలో మెంతి విత్తనాల్ని వినియోగిస్తుంటారు. వీటిలోని ఔషధ గుణాల వల్ల కడుపు, కడుపులోని పేగుల్లోని మలినాల్ని మెంతులు శుభ్రపరుస్తాయి.
సీ ఫుడ్.. సి ఫుడ్ లో ఉండే పోషకాలు అండాశయ ఆరోగ్యాన్ని ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా చేపల్లో నియాసిన్, బయోటిక్, థయామిన్ పుష్కలంగా ఉంటాయి. మెరైన్ ఫిష్ కాలేయంలో విటమిన్ ఎ, డి, ఇ ఈ వ్యవస్థను మెరుగుపరచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. 
అలాగే విటమిన్ ఏ పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలు అండాశయ క్యాన్సర్‌కు రాకుండా అడ్డుకుంటాయి. క్యారెట్లు, పాలు, గుమ్మడికాయ, చిలగడదుంపలు, బచ్చలికూర, గుడ్లు, కాడ్ లివర్ ఆయిల్ వంటి పోషకాలు నిండిన ఆహారం తీసుకోవాలి. ఇంకా సెలీనియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని ఎదుర్కొనడంలో సహాయపడుతుంది. 
శారీరక శ్రమ తో కూడిన ఏరోబిక్స్, స్విమ్మింగ్, డ్యాన్స్ లేదా యోగా వంటి సాధారణ శారీరక కార్యకలాపాలు రోగనిరోధక, యాంటీఆక్సిడెంట్ వ్యవస్థలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అండాశయ క్యాన్సర్ ను నిరోధించడానికి అవసరమైన సామర్థ్యం ఇస్తుంది.
గర్భ నియంత్రణ మాత్రల వాడుక, పిల్లలు పుట్టడానికి ఉపయోగించే అనేక రకాల మందులు సైతం గర్భాశయంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి అందుకే వీటిని వాడే విషయంలో తగిన జాగ్రత్తలు పాటించడం మధ్య అవసరం
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.