దూసర తీగతో డయబెటిస్‌, అధిక బరువు తగ్గించుకోవచ్చు..!

ఊర్లల్లో ఉండే వాళ్లకు దూసర తీగ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పొలాల గట్లమీద ఆగం ఆగంగా ఇది పాకుతుంది. పంటకు కలుపు రూపంలో ఉంటుంది. ఇది ఒక పిచ్చితీగ అని మనం దాన్ని కట్‌ చేస్తాం.. కానీ మీకు దూసర తీగ గురించి తెలియని కొన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి

దూసర తీగతో డయబెటిస్‌, అధిక బరువు తగ్గించుకోవచ్చు..!


ఊర్లల్లో ఉండే వాళ్లకు దూసర తీగ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పొలాల గట్లమీద ఆగం ఆగంగా ఇది పాకుతుంది. పంటకు కలుపు రూపంలో ఉంటుంది. ఇది ఒక పిచ్చితీగ అని మనం దాన్ని కట్‌ చేస్తాం.. కానీ మీకు దూసర తీగ గురించి తెలియని కొన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి. మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.
దూసర తీగ వల్ల లాభాలు..
కంటి సమస్యలకు..
క‌ళ్ల స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ మొక్క‌ను ఉప‌యోగించి క‌ళ్లు మ‌స‌క‌గా క‌నిపించ‌డం, క‌ళ్లు ఎర్ర‌గా మార‌డం, కంటిలో మంట‌లు, క‌ళ్ల నుంచి నీరు కార‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ఈ మొక్క ఆకుల‌ను మెత్త‌గా నూరి ర‌సాన్ని తీసి ప‌డుకునే ముందు క‌ళ్ల రెప్ప‌ల‌పై రాసుకుని ప‌డుకోవాలి. ఉద‌యాన్నే చ‌ల్ల‌టి నీటితో క‌ళ్ల‌ను క‌డుక్కోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.
దురదలకు..
 
దూస‌ర తీగ ఆకులను ఉప‌యోగించి చ‌ర్మంపై వ‌చ్చే దుర‌ద‌ల‌ను, ద‌ద్దుర్ల‌ను, మొటిమ‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఈ మొక్క ఆకుల ర‌సాన్ని తీసి ఆ ర‌సానికి కొద్దిగా నీటిని క‌లిపి చ‌ర్మంపై రాసుకోవ‌డం వ‌ల్ల దుర‌ద‌లు, ద‌ద్దుర్లు, మొటిమ‌లు త‌గ్గుతాయి.
నరాల బలహీనతకు..
న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలోనూ ఈ మొక్క ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ఈ మొక్క ఆకుల‌ రసాన్ని 2 టీ స్పూన్ల చొప్పున తీసుకుని ఒక గ్లాస్ నీటిలో క‌లిపి రోజూ ప‌ర‌గ‌డుపున తాగుతూ ఉండ‌డం వ‌ల్ల న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది.
అధిక వేడి..
మ‌న‌లో చాలా మంది ఒళ్లు బాగా వేడిగా ఉంటుంది. శరీరంలో వేడిని త‌గ్గించ‌డంలో కూడా ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ మొక్క ఆకుల‌ను తీసుకుని క‌చ్చా ప‌చ్చాగా దంచి నీటిలో వేసి 2 గంట‌ల పాటు ఉంచాలి. ఇలా ఉంచ‌డం వ‌ల్ల నీరు కొద్దిగా జెల్‌లా మారుతుంది. దీని నుండి ఒక టీ స్పూన్ జెల్‌ను తీసుకుని దానికి కండ చ‌క్కెర క‌లుపుకుని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో వేడి త‌గ్గుతుంది.
డయబెటిస్‌కు..
షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు కూడా దూస‌ర తీగ మొక్క ఆకులు ఎంత‌గానో మేలు చేస్తాయి. ఒక గుప్పెడు దూస‌ర తీగ మొక్క ఆకుల‌ను తీసుకుని నీటిలో వేసి బాగా మ‌రిగించి వ‌డ‌క‌ట్టాలి. ఇలా వ‌డ‌క‌ట్ట‌గా వ‌చ్చిన నీటిని రోజూ ఒక గ్లాస్ చొప్పున తాగుతూ ఉండ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య నుంచి కూడా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణక్రియకు..
జీర్ణసంబంధ‌మైన స‌మ‌స్య‌ల‌ను కూడా ఈ మొక్క తగ్గిస్తుంది.. ఈ మొక్క ఆకుల‌ను రెండింటిని తీసుకుని శుభ్రంగా క‌డిగి నోట్లో వేసుకుని బాగా న‌మిలి మింగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల గ్యాస్, అజీర్తి వంటి జీర్ణ సంబంధ‌మైన స‌మ‌స్య‌లు త‌గ్గుతాయ‌ని నిపుణులు అంటున్నారు.

దూసర తీగతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..?
ఈ మొక్క ఆకుల‌ను రెండింటిని తీసుకుని శుభ్రంగా క‌డిగి నోట్లో వేసుకుని బాగా న‌మిలి మింగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల గ్యాస్, అజీర్తి వంటి జీర్ణ సంబంధ‌మైన స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.
ఒక గుప్పెడు దూస‌ర తీగ మొక్క ఆకుల‌ను తీసుకుని నీటిలో వేసి బాగా మ‌రిగించి వ‌డ‌క‌ట్టాలి. ఇలా వ‌డ‌క‌ట్ట‌గా వ‌చ్చిన నీటిని రోజూ ఒక గ్లాస్ చొప్పున తాగుతూ ఉండ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది.
శరీరంలో వేడిని తగ్గించడంలోనూ ఈ మొక్క బాగా పనిచేస్తుంది.
దూస‌ర తీగ ఆకులను ఉప‌యోగించి చ‌ర్మంపై వ‌చ్చే దుర‌ద‌ల‌ను, ద‌ద్దుర్ల‌ను, మొటిమ‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.