కీళ్లనొప్పులని ఈ కూరగాయలను దూరం పెడుతున్నారా?

ఈ మధ్య కాలంలో కీళ్ల నొప్పులు 30, 40 ఏళ్ల వయస్సు వారికి వచ్చేస్తున్నాయి. పూర్వం రోజుల్లో వయసు దాటాకే వచ్చేవి. కీళ్ల నొప్పులకు పత్యం అనేది చాలా అవసరం. చాలా మంది అంటూ ఉంటారు.....వాతం చేయడం వల్లే కీళ్ల నొప్పులు వస్తున్నాయని

కీళ్లనొప్పులని ఈ కూరగాయలను దూరం పెడుతున్నారా?


ఈ మధ్య కాలంలో కీళ్ల నొప్పులు 30, 40 ఏళ్ల వయస్సు వారికి వచ్చేస్తున్నాయి. పూర్వం రోజుల్లో వయసు దాటాకే వచ్చేవి. కీళ్ల నొప్పులకు పత్యం అనేది చాలా అవసరం. చాలా మంది అంటూ ఉంటారు.....వాతం చేయడం వల్లే కీళ్ల నొప్పులు వస్తున్నాయని. వాతం పెంచే కూరగాయలు తినొద్దని చెప్తూ ఉంటారు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు......వైద్యుల్ని సంప్రదిస్తే...వాళ్లు కూడా అదే చెప్తారు దుంప కూరలు తినొద్దు అని. వాతం పెంచే కూరల్లో ముఖ్యంగా చెప్పుకునేవి వంకాయ, బంగాళాదుంప, కంద, పెండ్లం, గుమ్మడికాయ, చేమ. ఇవన్నీ వాతాన్ని పెంచే కూరగాయాలు. ఇవి తింటే వాతం వస్తుందని చెప్తుంటారు.  

Arthritis pain: Prevent symptoms with broccoli in your diet | Express.co.uk

కానీ కొన్ని కూరగాయల్ని ఎలా పడితే అలా వండేస్తూ ఉంటారు. అలా చేయడం అసలు మంచిది కాదు. దానివల్ల ఫుడ్‌ పాయిజన్‌ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు కూరల్లో ఉండే విటమిన్లు నశిస్తాయి. కాబట్టి కొంచెం చూసుకుని వండుకోవాలి.

ఇండియాలో ఏ వైద్యుడి దగ్గరికి వెళ్లినా.....ఈ కూరగాయాలే తినొద్దని తింటారు. కానీ  
ఈ కూరగాయలు తినడం వల్ల నొప్పులు రావు. అవి వండే విధానం వల్ల నొప్పులు వస్తాయి. ఇది యధార్థం. మీరు తెలుసుకోవాల్సిన నిజమిది. వాస్తవమేమిటంటే ఇవి తినడం వల్ల ఎలాంటి నష్టం లేదు.

ఇప్పుడు మామూలుగా అయితే బీరకాయ, సొరకాయ, దోసకాయ వంటి వాటిని పాలు, పెరుగు పోసి వండుకుంటాం. మరీ ఈ వాతం పెంచుతుందనుకుంటున్న కూరగాయాల్లో పాలు, పెరుగు పోసి వండుకుంటారా.... అదేంటీ అలా వండుకుంటారా అని ఆశ్చర్యపడక్కర్లే. అలా వండుకుని ఎన్నో లాభాలు ఉన్నాయి. కీళ్ల నొప్పులు రావు సరికదా....ఉన్న కీళ్ల నొప్పులు కాస్త పారా హుషార్‌. మరీ ఎలా వండుకోవాలో...ఎలా తినాలో తెలుసుకుందాం.

సాధారణంగా ఈ వంకాయ, బంగాళదుంప, చామగడ్డలు, గుమ్మడికాయ, కంద, పెండ్లం వీటిన్నింటిని రుచి కోసం పులుసులు పెట్టుకుంటాం. పులుసు అంటే ముఖ్యంగా ఉండేది...చింతపండు. కాకపోతే ఈ చింతపండు పులుపు ఒక్కటే సరిపోదు. దానికి అనుగుణంగా కారం, ఉప్పు, మసాలాలు మామూలు కూరల కంటే ఈ పులుసుల్లో రెట్టింపు వేసేస్తాం. పులుపును డామినేట్‌ చేయడానికి ఉప్పు ఎక్కువగా వేసేస్తాం. రుచులకు రారాజు ఉప్పు. కూరలకంటే పులుసుల్లో గుప్పెడంత ఉప్పు వేయాల్సిందే. లేకపోతే పులుపుగా ఉండటం వల్ల తినలేం కాబట్టి.

ఎప్పుడైనా గమనించారా...పులుసు కూరలు తిన్నప్పుడు మరుసటి రోజు శరీరం ఉబ్బరంగా అనిపిస్తుంది. అందుకే మనం సాంబార్‌ తినగానే పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. దానికి కారణం కూడా పులుపు, ఉప్పు ఉండటమే.

అందుకే అవి వండుకునేటప్పుడు పులుపునకు బదులు పాలు, పెరుగు వేసుకుని వండుకోండి తేడా మీకే తెలుస్తుంది. పులుసులు తిన్న ప్రతిసారి నొప్పులుగా అనిపిస్తాయి. కాబట్టి అవి తినడం వల్లే నొప్పులు వస్తున్నాయని అనుకుని ఈ నింద ఆ కూరగాయలపై పడేస్తాం. కానీ అసలు దొంగ ఉప్పు అని తెలుసుకోరు.

కాబట్టి ఉప్పు లేకుండా వండుకుని తింటే లాభం మీకే తెలుస్తుంది. అసలు దొంగ కూరగాయలు కాదు...చింతపండు, దాని కోసం వేసే ఉప్పు. మీరు మానాల్సింది ఉప్పు...కూరగాయలు కాదు. ఈ కూరగాయలు బ్రహ్మాండంగా తినొచ్చు. ఒకసారి వండుకుని తినండి...ఎలాంటి హానీ జరగదు. దీనిపై అవగాహన పెంచుకోండి. అన్ని కూరగాయలు ఆరోగ్యంగా వండుకోండి. హాయిగా ఉండండి.

Source By

Dr Manthena Satyanarayana Raju

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.