Prostate cancer : పురుషుల్లో వచ్చే వివిధ రకాల క్యాన్సర్లను ఇలా ముందే కనిపెట్టొచ్చు..!

Prostate Cancer : ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది బాధపడుతున్న రోగాల్లో క్యాన్సర్‌ కూడా ఒకటి. కారణాలేమున్నా క్యాన్సర్ సోకితే దాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేస్తే అందుకు తగ్గ ఫలితం ఉంటుంది. లేదంటే అది ప్రాణాంతకంగా మారుతుంది.

Prostate cancer : పురుషుల్లో వచ్చే వివిధ రకాల క్యాన్సర్లను ఇలా ముందే కనిపెట్టొచ్చు..!


Prostate Cancer : ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది బాధపడుతున్న రోగాల్లో క్యాన్సర్‌ కూడా ఒకటి. కారణాలేమున్నా క్యాన్సర్ సోకితే దాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేస్తే అందుకు తగ్గ ఫలితం ఉంటుంది. లేదంటే అది ప్రాణాంతకంగా మారుతుంది. అయితే సమస్య అంతా ఎక్కడ వస్తుందిరా అంటే.. క్యాన్సర్‌ లక్షణాలను గుర్తించడంలోనే అందరూ లేట్‌ అవుతున్నారు. ఆ లక్షణాలు ముదిరి బయటపడ్డాకే మనం మేల్కుంటున్నాం.. ముఖ్యంగా మగవారిలో వచ్చే కొన్ని మార్పులనే లక్షణాలుగా ఉంటాయి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే..

చర్మంలో అకస్మాత్తు మార్పులు, రక్తస్రావం అవడం, మచ్చల వంటివి ఎక్కువ కాలంగా ఉంటే ప్రమాదకరంగా మారవచ్చు. అంతే కాదు ఇవి చర్మ క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉంటుంది. 
అలసట, ఆయాసం ఎక్కువగా, ఎక్కువ సేపు ఉంటే అది పెద్దపేగు లేదా పొట్టకు సంబంధించిన క్యాన్సర్ అయి ఉండొచ్చు. 
మగవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ దాని లక్షణాలను పరిశీలించాల్సిందే. ఛాతి చుట్టూ ఎరుపుదనం, నిపుల్స్ నుంచి డిశ్చార్జి వంటి లక్షణాలు ఉంటే దాన్ని బ్రెస్ట్ క్యాన్సర్‌గా పరిగణించాలి.
నోట్లో లేదా నాలుకపై తెల్లని ప్యాచ్‌లు ఎక్కువ కాలం పాటు ఉంటే అది ప్రమాదకరమైన ఓరల్ క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉంటుంది. 
ఎక్కువగా జ్వరం వచ్చి అది అలాగే కొద్ది నెలల పాటు ఉంటే దాన్ని బ్లడ్ క్యాన్సర్‌కు సూచనగా భావించాలి. 
కడుపులో ఎల్లప్పుడూ నొప్పిగా ఉండడంతోపాటు, ఎప్పుడూ డిప్రెషన్‌లో ఉంటే దాన్ని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌గా అనుమానించాలి. 
ఆహారాన్ని మింగడంలో ఎల్లప్పుడూ ఇబ్బందిగా ఉంటే అది గ్యాస్ట్రో ఇంటెస్టయినల్ క్యాన్సర్ కావచ్చు.
లింఫ్ గ్రంథులు లేదా గొంతు-మెడభాగంలో ఎల్లప్పుడూ ఉబ్బి ఉన్నా దాన్ని గొంతు క్యాన్సర్‌గా అనుమానించాలి. 
వృషణాల సైజ్‌లో మార్పు, వాపు, భారంగా ఉండడం వంటి లక్షణాలు ఉంటే దాన్ని వృషణాల క్యాన్సర్‌గా భావించాలి. 
మ్యూకస్ లేదా ఉమ్మిలో రక్తం వస్తుంటే దాన్ని ఊపిరితిత్తులు లేదా ఓరల్ క్యాన్సర్‌గా భావించాలి. 
మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తున్నా ఆ పరిస్థితిని ప్రోస్టేట్ క్యాన్సర్‌గా అనుమానించాలి. 
ఇలా ప‌లు ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి పురుషులు క్యాన్స‌ర్ వ‌స్తుందో రాదో ముందుగానే తెలుసుకోవ‌చ్చు. అయితే ఈ ల‌క్ష‌ణాలు ఉంటే నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి ప‌రీక్ష‌లు చేయించుకోవాలి..
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.