టాయిలెట్‌కు వెళ్లి వచ్చిన వెంటనే వాటర్‌ తాగేస్తున్నారా..?

ఇంటిని క్లీన్‌గా ఉంచుకోకపోతే చాలా చిరాకుగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండదు. ఒక గంట లేట్‌ అయినా ఇళ్లును అందరూ శుభ్రపరుచుకుంటారు. వీక్‌ఆఫ్‌లు వచ్చినప్పుడు అయితే ఎక్కువ టైమ్‌ రూమ్‌ క్లీనింగ్‌కే కేటాయిస్తారు.

టాయిలెట్‌కు వెళ్లి వచ్చిన వెంటనే వాటర్‌ తాగేస్తున్నారా..?


ఇంటిని క్లీన్‌గా ఉంచుకోకపోతే చాలా చిరాకుగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండదు. ఒక గంట లేట్‌ అయినా ఇళ్లును అందరూ శుభ్రపరుచుకుంటారు. వీక్‌ఆఫ్‌లు వచ్చినప్పుడు అయితే ఎక్కువ టైమ్‌ రూమ్‌ క్లీనింగ్‌కే కేటాయిస్తారు. ఇంట్లో కాస్త చెత్త ఉంటేనే ఊరుకోలేకపోతున్నామే...మరీ బాడీలో ఎంత చెత్త ఉందో మీకు తెలుసా..? అది కనిపించే మార్గం లేదు కానీ.. అసలు కనిపిస్తే.. మీ శరీరం మీద మీకే అసహ్యం వస్తుంది.
Can toilet seats give you a UTI? A doctor decodes | The Times of India
శరీరంలో అవయవాలు నిరంతరం మనం తిన్న ఆహారంలో ఉన్న వ్యర్థాలను ఫిల్టర్‌ చేసి బయటకు పంపుతూ ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా..అవి రెడీ అయి బయటకు వెళ్లాల్సినప్పుడు టాయిలెట్‌కు వెళ్లడం. మనం ఏంట్రా అంటే మూత్రవిసర్జనప్పుడు కొన్ని తప్పులు చేసి లేనిపోని రోగాలను కొనితెచ్చుకుంటాం. చాలామంది కామన్‌గా మూత్రవిసర్జన సమయంలో చేసే తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..!
కొంద‌రు మూత్రాన్ని పూర్తిగా విస‌ర్జించ‌రు. కాస్త మూత్రం మిగిలి ఉండ‌గానే ఆపేస్తారు. ఇలా చేయ‌డం వ‌ల్ల మూత్రాశ‌య ఇన్‌ఫెక్ష‌న్లు వ‌స్తాయి. మూత్రాశ‌యం సైజు అసాధార‌ణంగా అవుతుంది. దీంతోపాటు మూత్రాశ‌యం వ‌ద్ద కండ‌రాలు సాగిన‌ట్లు అవుతాయి. ఇది ప్రోస్టేట్ స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది. అలాగే మూత్రం లీక‌వుతుంది. మాటిమాటికీ వ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంది. మూత్రం వ‌స్తే పూర్తిగా విస‌ర్జించాలి. మూత్రాశ‌యంలో మిగల్చ‌కూడ‌దు.
70+ Toilet Bowl Toilet Side View Bathroom Stock Photos, Pictures &  Royalty-Free Images - iStock
కొంద‌రు మూత్రాన్ని గంట‌ల త‌ర‌బ‌డి అలాగే ఆపుకుంటారు. ఇలా చేయ‌డం ఏమాత్రం మంచిది కాదు. ఇది కిడ్నీ స్టోన్ల‌కు దారి తీస్తుంది. మూత్రాశ‌య ఇన్‌ఫెక్ష‌న్ల‌ను క‌ల‌గజేస్తుంది. మూత్రం వ‌చ్చిన వెంట‌నే విస‌ర్జించాలి. 
కొంతమంది అవ‌స‌రం లేకున్నా మూత్రాన్ని బాగా ఫోర్స్‌తో విస‌ర్జిస్తారు. ఇలా చేస్తే మూత్రాశ‌యంపై ఒత్తిడి ప‌డుతుంది. 
చాలా మంది మూత్ర విస‌ర్జ‌న చేసిన వెంట‌నే నీళ్ల‌ను తాగుతుంటారు. లోపల వాటర్‌ అంతాపోయి.. మనకు టాయిలెట్‌కు వెళ్లగానే వాటర్‌ తాగాలనిపిస్తుంది. గొంతు దాహంతో ఎండిపోయిన ఫీల్‌ కలిగి టాయిలెట్‌కు వెళ్లి వచ్చిన వెంటనే వాటర్‌ తాగేస్తారు. ఇలా చేయ‌రాదు. కాస్త గ్యాప్ ఇవ్వాలి. ఓ 5 నిమిషాలు ఆగి త‌రువాత నీళ్ల‌ను తాగాలి. లేదంటే కిడ్నీల‌పై భారం ప‌డుతుంది. 
రాత్రి నిద్ర‌కు ముందు త‌ప్ప‌నిస‌రిగా మూత్ర విస‌ర్జ‌న చేయాలి. దీంతోపాటు భోజ‌నం చేసిన వెంట‌నే మూత్ర విస‌ర్జ‌న చేయ‌డం వ‌ల్ల కూడా కిడ్నీల‌పై భారం ప‌డ‌కుండా ఉంటుంది. ఇక మూత్రం పోసే స‌మ‌యంలో నొప్పి, మంట అనిపించినా, మూత్రం రంగు మారి వ‌చ్చినా, మూత్రంలో నురుగు క‌నిపించినా.. ఏమాత్రం ఆల‌స్యం చేయకుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. కిడ్నీలు, మూత్రాశ‌యంను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.