శరీరంలో ఈ నొప్పులు మీకు తెలుసా?

శరీరంలో అనేక రకాల నొప్పులు వస్తుంటాయి. దానికి బోల్డెన్నీ కారణాలుంటాయి. ఎందుకంటే రోజూ చేసే పనులు, మనం కూర్చోనే విధానం, ఆహారంలో మార్పులు ఇవన్నీ కారణం

శరీరంలో ఈ నొప్పులు మీకు తెలుసా?


శరీరంలో అనేక రకాల నొప్పులు వస్తుంటాయి. దానికి బోల్డెన్నీ కారణాలుంటాయి. ఎందుకంటే రోజూ చేసే పనులు, మనం కూర్చోనే విధానం, ఆహారంలో మార్పులు ఇవన్నీ కారణం అవ్వొచ్చు.

మనం అనుసరించే జీవన విధానం అనేక రకాల సమస్యలకు నిలయంగా మారుతోంది. అవి పట్టించుకోకపోతే చాలా ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి వాటి గురించి ముందే మేల్కోవాలి. అయితే కొన్ని శరీరభాగాలు విపరీతంగా నొప్పిగా ఉన్నప్పటికీ పట్టించుకోకపోతే అవి మరింత ప్రమాదకరంగా మారి, అనారోగ్యాలను కలిగించే అవకాశం ఉంది. కాబట్టి వాటి గురించి ముందే పసిగట్టాలి. అందులో ముఖ్యమైన నొప్పులు గురించి తెలుసుకోవాలి.

అవేంటంటే.....కండరాల నొప్పి, నడుం నొప్పి, పిరుదుల నొప్పి, కడుపు నొప్పి, ఛాతీనొప్పి. ఇందులో ఛాతీనొప్పి గురించి అందరికీ తెలిసిందే. మిగతా నొప్పుల గురించి మాత్రం పట్టించుకోం. ఎందుకంటే ఇవి సాధారణ నొప్పులే కదా అని తీసే పడేస్తాం.

కండరాల నొప్పికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ల లోపం వల్ల కూడా వస్తుందని తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అప్పటికీ తగ్గకపోతే.... వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సలహా మేరకు మెడిసిన్‌ వాడాలి.

ఇంక దాని తర్వాత చెప్పుకోవల్సింది కడుపు నొప్పి. ఈ నొప్పికి ఎన్నో కారణాలున్నాయి. పీరియడ్స్‌, సరిగ్గా తినకపోయినా, విరోచాల వల్ల, ఎండవేడిమికి, యూరిన్‌ సరిగ్గా అవ్వకపోయినా కడుపునొప్పి వస్తుంది. ఎలా వచ్చిన కడుపునొప్పిపై అశ్రద్ధ చేయకూడదు.
కొంతమంది నొప్పి కోసం ఫెయిన్‌ కిల్లర్లు వేసుకుంటారు. కానీ అది మంచిది కాదు. ఆ సమయానికి నొప్పి తగ్గినా ఒక్కోసారి అదేపనిగా వస్తుంటుంది. పదేపదే వస్తే అది మూత్రనాళ ఇన్ఫెక్షన్ కి కానీ, జీర్ణాశయ రుగ్మతలకు కానీ, పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించి సమస్య కావచ్చు.

నడుం నొప్పి, పిరుదుల నొప్పి. ఇంతకు ముందు ఈ సమస్య వృద్ధాప్యంలో ఉన్న వాళ్లకు మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. చాలా మంది యువత కూడా నడుమునొప్పి, పిరుదుల నొప్పితో తెగ బాధపడుతున్నారు. అయితే రోజు వచ్చే నొప్పే కదా అని నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్లి చికిత్స తీసుకోవాలి.

రోజంతా ఆఫీసుల్లో పని, ఇంట్లో పని వల్ల నడుం నొప్పి వస్తుంది. రోజంతా కూర్చోవడం వల్ల పిరుదుల నొప్పి సరేసరి. వీటి కోసం వ్యాయామాలు చేస్తూ ఉండాలి. లేకపోతే గంట గంటకు లేస్తూ ఉండాలి. నీళ్లు తాగుతూ ఉండాలి. నడుముకు సంబంధించి ఎక్సర్‌సైజ్‌లు చేయాలి.

అయితే ఈ నొప్పులు ఏదో విధంగా అయినా తగ్గించవచ్చు. కానీ ఛాతీనొప్పి చాలా డేంజర్‌. చాలామంది ఛాతిలో నొప్పిగా ఉంటే పెద్దగా పట్టించుకోరు. ఛాతీలో నొప్పి ఎడమవైపున వస్తే అది మరింత డేంజర్ అని చెబుతున్నారు. ఇది ముందు ముందు గుండెజబ్బులకు కూడా కారణం కావచ్చు అని, అందుకే ఛాతి నొప్పి ఉన్నప్పుడు, తరచుగా నొప్పిగా ఉంటున్నప్పుడు వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.