Thyroid problem : ఈ జ్యూస్‌ను తాగడం వల్ల థైరాయిడ్‌ సమస్య తగ్గుతుంది

Thyroid problem : మన శరీరంలో ఉండే ప్రతి అవయవం, కణం, గ్రంధులు అన్ని ముఖ్యమైనవే.. అలాంటి గ్రంధుల్లో ఒకటి థైరాయిడ్‌ గ్రంధి ఒకటి.. మెడ ముందు భాగంలో సీతాకోక‌చిలుక ఆకారంలో ఉంటుంది. శారీర‌క ఎదుగుద‌ల‌లో ఈ గ్రంథి ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది

Thyroid problem : ఈ జ్యూస్‌ను తాగడం వల్ల థైరాయిడ్‌ సమస్య తగ్గుతుంది


Thyroid problem : మన శరీరంలో ఉండే ప్రతి అవయవం, కణం, గ్రంధులు అన్ని ముఖ్యమైనవే.. అలాంటి గ్రంధుల్లో ఒకటి థైరాయిడ్‌ గ్రంధి ఒకటి.. మెడ ముందు భాగంలో సీతాకోక‌చిలుక ఆకారంలో ఉంటుంది. శారీర‌క ఎదుగుద‌ల‌లో ఈ గ్రంథి ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి స‌రిగ్గా ప‌ని చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల హైప‌ర్ థైరాయిడిజం, హైపో థైరాయిడిజంతోపాటు ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ప్ర‌స్తుత కాలంలో ఈ థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు అధిక‌మ‌వుతున్నారు. ఈ స‌మ‌స్య బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిందే. ఈ థైరాయిడ్ స‌మ‌స్య‌ను ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి కూడా నివారించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.ఇంట్లోనే ఒక ర‌క‌మైన జ్యూస్‌ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల థైరాయిడ్‌ని త‌రిమికొట్ట‌వ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. థైరాయిడ్‌ను నివారించే జ్యూస్‌ను ఎలా త‌యారు చేసుకోవాలంటే..
ఈ జ్యూస్‌ను త‌యారు చేసుకోవ‌డానికి ఒక కీర‌దోస‌ను, కొత్తిమీర‌ను, ఒక క‌ప్పు నీటిని, రెండు క్యారెట్‌ల‌ను, ఒక నిమ్మ‌కాయ‌ను, చిన్న అల్లం ముక్క‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. కీర‌దోస‌లో విట‌మిన్ బి అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే అయోడిన్ థైరాయిడ్‌ను నివారించ‌డంలో ప్ర‌ముఖ పాత్ర పోషిస్తుంది. అదే విధంగా క్యారెట్‌లో విట‌మిన్ ఏ, బీటా కెరోటిన్‌లు అధికంగా ఉంటాయి. ఒకవేళ శ‌రీరంలో విట‌మిన్ ఎ త‌క్కువ‌గా ఉంటే టిఎస్‌హెచ్ అనే థైరాయిడ్ హార్మోన్ అధికంగా విడుద‌ల అవుతుంది. థైరాయిడ్ గ్రంథి స‌రిగ్గా ప‌ని చేయాలంటే బి కాంప్లెక్స్ విట‌మిన్స్ అవ‌స‌ర‌మ‌వుతాయి. 
ఈ పదార్థాలతో జ్యూస్‌ను త‌యారు చేసుకోవ‌డానికి గాను ఒక జార్‌లో కీర‌దోస ముక్క‌ల‌ను, క్యారెట్ ముక్క‌ల‌ను, అల్లం ముక్క‌ల‌ను, త‌రిగిన కొత్తిమీర‌ను, నీళ్ల‌ను, నిమ్మ‌ర‌సాన్ని వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ జ్యూస్‌ను వ‌డ‌క‌ట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా త‌యారు చేసిన జ్యూస్‌ను ప్ర‌తిరోజూ ఉద‌యం పూట తాగ‌డం వ‌ల్ల థైరాయిడ్ స‌మ‌స్య‌ను నివారించుకోవ‌చ్చు.
 
ధ‌నియాల‌తో చేసిన నీటిని తాగ‌డం వ‌ల్ల కూడా థైరాయిడ్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక రెండు టేబుల్ స్పూన్ల ధ‌నియాలు వేసి మూత పెట్టి చిన్న మంట‌పై 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత ఈ నీటిని వ‌డక‌ట్టి ఒక గ్లాస్‌లోకి తీసుకోవాలి. రుచి కోసం ఆ నీటిలో తేనెను క‌లిపి తాగాలి. ఈ ధ‌నియాల నీటిని ప్ర‌తిరోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల హైపో థైరాయిడిజంను త‌గ్గించుకోవ‌చ్చు. ఈ ధ‌నియాల నీటిని తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.