ఎప్పుడూ ఒంటరిగానే ఉండాలనిపిస్తుందా ఇలా అయితే పలు సమస్యలకు స్వాగతం పలికినట్టే!

చాలామంది ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మంచి కుటుంబం, ఆహ్లాదకరమైన వాతావరణ ఉన్నప్పటికీ ఒంటరిగా ఉంటే ఏదో తెలియని ఆనందానికి లోనవుతూ ఉంటారు. అయితే

ఎప్పుడూ ఒంటరిగానే ఉండాలనిపిస్తుందా ఇలా అయితే పలు సమస్యలకు స్వాగతం పలికినట్టే!


Being Alone : చాలామంది ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మంచి కుటుంబం, ఆహ్లాదకరమైన వాతావరణ ఉన్నప్పటికీ ఒంటరిగా ఉంటే ఏదో తెలియని ఆనందానికి లోనవుతూ ఉంటారు. అయితే ఇలా ఎక్కువ కాలం పాటు ఒంటరిగా ఉంటే జీవితంలో ఎన్నో సమస్యలు చుట్టుముట్టి మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయని తెలుస్తుంది.
Free Alone Boy Wallpaper Downloads, [200+] Alone Boy Wallpapers for FREE |  Wallpapers.com
ఒంటరితనం వేరు ఏకాంతం వేరు అనే విషయాన్ని కచ్చితంగా గుర్తించాలి. ఏకాంతంలో ఒక మనిషి తనతో తాను ఆనందంగా గడుపుతాడు. ఈ సమయం కొంతకాలం పాటు మాత్రమే కొనసాగుతుంది. విహారయాత్రలకు ఒంటరిగా వెళ్లడం, ప్రయాణాలు ఒంటరిగా చేయడం వేరు. కానీ కొన్నిసార్లు కుటుంబానికి దూరంగా ఒంటరిగా గడుపుతూ ఉంటారు. ఇలా చేస్తుంటే మనిషిలో ఎన్నో రకాల హార్మోన్స్ గతి తప్పి పలు రకాల సమస్యలకు దారి తీస్తాయి.
ఒంటరితనం కొంతకాలం పాటు బాగా అనిపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం డిప్రెషన్, నిరాశ, నిస్సృహ వంటి సమస్యలకు దారితీస్తుంది. తాము ఎవరికోసం బతకాలి అనే ఆలోచనలోకి వెళ్ళిపోతారు. ఒంటరితనంతో శరీరంలో స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. తమకే తెలియకుండా తాము ఒక రకమైన బందీ జీవితానికి అలవాటు పడిపోతారు. సమయానికి తినకపోవడం, క్రమశిక్షణ లేని జీవితానికి అలవాటు పడుతూ ఉంటారు.
అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండటం, ఉదయం లేటుగా లేవటం, సరైన సమయానికి పనులు చేయకపోవడం, పక్కన ఎవరూ కనిపించకపోవడంతో ఎప్పుడు చిరాకుగా నిరాశగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి తీవ్రమైన డిప్రెషన్కు దారి తీసి చివరికి మనిషి ఆత్మహత్య చేసుకునే వరకు కూడా ఉసిగొల్పుతాయి.
మనిషి ఒంటరితనంలో ఉన్నప్పుడు తన జీవితంలో పడిన బాధలు అన్నిటిని గుర్తు తెచ్చుకుంటాడు. రాత్రి సమయం నిద్ర పట్టకపోవడంతో పలు రకాల విషయాలు పదేపదే గుర్తుకు వచ్చి మనిషిని వేధించే అవకాశం ఉంది.
డయాబెటిస్, అధిక రక్తపోటు, స్ట్రెస్ వంటి సమస్యలకు ఈ ఒంటరితనం దారితీస్తుంది. అందుకే వీలైనంతవరకు మనిషి ఒంటరిగా ఉండకపోవడమే మేలు.
ఒకవేళ ఏమైనా కారణాలతో ఒంటరిగా ఉండాల్సి వస్తే కచ్చితంగా తనని తాను ఒక క్రమశిక్షణ వాతావరణ కి అలవాటు చేసుకోవాలి. రోజు వ్యాయామం చేయటం, యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవాలి. తనని తాను ఎక్కువగా ప్రేమించుకోవాలి. సమయానికి ఆహారం తీసుకోవడం, నిద్ర పోవడం వంటివి చేస్తూ ఏదైనా ఒక వ్యాపకాన్ని కల్పించుకోవాలి. ఖాళీగా ఉన్నవారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరి జీవితానికి అలవాటు పడకూడదు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.