ఈ ఐదు జాగ్రత్తలతో కంటి ఆరోగ్యం పదిలం..!

ఇంతకు ముందు వృద్ధుల్లోనే కంటి చూపు సమస్యలు కనిపిస్తుండేవి. చిన్న, మధ్య వయసు పిల్లల్లో ఎవరికీ కంటి సమస్యలు సాధారణంగా వస్తుండేవి కాదు. కానీ... మారిన పరిస్థితుల్లో ఫోన్ల వాడకం, కంప్యూటర్ తెరల్ని ఎక్కువగా చూస్తుండడం సహా ఆహారపు అలవాట్లు వంటి వివిధ కారణాల వల్ల చిన్న వయసులోనే కళ్లజోళ్లు తప్పనిసరి అయిపోయాయి. అవి మాత్రమే కాదు... కళ్లను తేలికగా తీసుకోవడమూ

ఈ ఐదు జాగ్రత్తలతో కంటి ఆరోగ్యం పదిలం..!


ఇంతకు ముందు వృద్ధుల్లోనే కంటి చూపు సమస్యలు కనిపిస్తుండేవి. చిన్న, మధ్య వయసు పిల్లల్లో ఎవరికీ కంటి సమస్యలు సాధారణంగా వస్తుండేవి కాదు. కానీ... మారిన పరిస్థితుల్లో ఫోన్ల వాడకం, కంప్యూటర్ తెరల్ని ఎక్కువగా చూస్తుండడం సహా ఆహారపు అలవాట్లు వంటి వివిధ కారణాల వల్ల చిన్న వయసులోనే కళ్లజోళ్లు తప్పనిసరి అయిపోయాయి. అవి మాత్రమే కాదు... కళ్లను తేలికగా తీసుకోవడమూ కంటి సమస్యలకు ప్రధాన కారణం. పైగా కళ్ల విషయంలో ఎన్నెన్నో తప్పులు చేస్తుంటాం. ఫలితంగా... ఏదైనా సమస్య మొదలయ్యాక గానీ అసలు విషయాన్ని గ్రహించం. పరిస్థితి అంతవరకూ రాకముందే కళ్ల విషయంలో చేసే తప్పులేంటో తెలుసుకోవడం మంచిది.. 
5 truths about protecting your eyes - Harvard Health
కంటి పరీక్షలు: మన కళ్లు ఏ తీరుగా ఉన్నాయి. వాటి పని తీరులో ఏమైనా తేడాలు ఉన్నాయా..? సమీపంలో ఏవైనా సమస్యలు తలెత్తనున్నాయా..? వంటి విషయాలు తెలుసుకోవాలంటే కంటి పరీక్షలు తప్పనిసరి. ఏటా కనీసం ఓసారైనా నిపుణులైన కంటి వైద్యుల్ని సంప్రదించాలి. 40 ఏళ్లు పైబడిన వారికిది మరింత ముఖ్యం. చూపు సమస్యలతో పాటు నీటికాసులు వంటి పరీక్షలు నిర్వహించుకోవాలి. 
కంటి దురద: కళ్లు కానీ... వాటి చుట్టూ ఉండే చర్మంపై దురద వస్తుంటే.. వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. కంటి నుంచి నీరు కారటం, దురద, మంట వంటి అలర్జీ లక్షణాలకు ఇన్ఫెక్షన్లూ కారణం కావచ్చు. కాబట్టి...ఈ లక్షణాలు కనిపిస్తే అసలు నిర్లక్ష్యం పనికి రాదు. ముఖ్యంగా నొప్పి, గరగర వంటివి ఉంటే మరింత జాగ్రత్త తప్పనిసరి. 
కంటికి తగిలే దెబ్బలు : కంటికి ఎలాంటి దెబ్బ తగిలినా వీలైనంత త్వరగా దాన్ని వైద్యుల్ని సంప్రదించాలి. చూపు మసకబారినా, కళ్లు తెరవలేకపోతున్నా, తెల్లగుడ్డు మీద రక్తం చారలు కనిపించినా, కన్ను కదలికలు సరిగా లేకున్నా, కంటిపాప ఆకారం మారినట్లు ఉన్నా ఆలస్యం చేయవద్దు.
 చలువ అద్దాలు: అధికంగా ఎండులు కాస్తున్న సమయాల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా చలువ కళ్లద్దాలు వినియోగించాలి. కాంతిలోని అతినీలలోహిత కిరణాలు కళ్లను దెబ్బతీస్తాయి. దీంతో శుక్లాలు, రెటీనా మధ్యభాగం దెబ్బతినటం వంటివి తలెత్తుతాయి. కాబట్టి.. బయటకు వెళ్తే చలువ అడ్డాలు ధరించటం మంచిది.
 
కళ్లను రుద్దటం: చాలా మంది చేసే పొరపాటు ఇది. అదేపనిగా రుద్దితే కళ్లు చికాకుకు గురవుతాయి. రక్తనాళాలు దెబ్బతింటాయి. ఇవి కళ్లను దెబ్బతీస్తాయి. అంతే కాదు.. అతిగా గ్యాడ్జెట్ల వాడకం కళ్ల సమస్యలకు ప్రధాన కారణం. అదే పనిగా స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు వంటి వాటి వంకే చూస్తూ ఉంటే కంటి కండరాలు దెబ్బతింటాయి. కళ్లు అలసిపోతాయి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.