fatty liver 14 రోజుల్లోనే మ‌టాష్‌.. గోంగూర పువ్వులతో డికాషన్.. ఇదే సూప‌ర్‌ ప్రికాషన్..!  

గోగుపువ్వులను మరిగించి డికాషన్ గా తీసుకుని ఒక కప్పు త్రాగితే 14రోజుల్లోనే మన శరీరంలో హాని కలిగించే ఫ్రీరాడికల్స్ ను 92శాతం నిర్మూలించేస్తుందని పరిశోధనలు చేసి ఇచ్చారు. 12 వారాల పాటు గోగుపువ్వుల డికాషన్ తాగితే fatty liver

fatty liver 14 రోజుల్లోనే  మ‌టాష్‌.. గోంగూర పువ్వులతో డికాషన్..  ఇదే సూప‌ర్‌ ప్రికాషన్..!  


గోంగూర రుచిని ఇష్టపడిని తెలుగువారంటూ ఉండరు. అసలు గోంగూర తింటే స్పెషల్ గా ఎలాంటి లభాలు వస్తాయి అనేది మనం పెద్దగా ఆలోచించం..రుచిగా ఉంటుంది, ఆకుకూర ఇంకే కావాలి.. వాడేస్తాం..చికెన్, మటన్ లో కూడా గోంగూరతో స్పెషల్ వంటకాలు చేస్తుంటాం. గోంగూర చెట్టుకు వచ్చే పువ్వులను మీరు చూసే ఉంటారు కదా. గోగుపువ్వులను మరిగించి డికాషన్ గా తీసుకుని ఒక కప్పు త్రాగితే 14రోజుల్లోనే మన శరీరంలో హాని కలిగించే ఫ్రీరాడికల్స్ ను 92శాతం నిర్మూలించేస్తుందని పరిశోధనలు చేసి ఇచ్చారు. 12 వారాల పాటు గోగుపువ్వుల డికాషన్ తాగితే ఫ్యాటి లివర్ ( fatty liver ) తో బాధపడేవారికి 65శాతం తగ్గుతుందని కూడా నిరూపించారు.. ఎలా తీసుకోవాలి, ఫ్రీ రాడికల్స్ ఏంటి, ఈ పువ్వుల డీటాక్సిఫికేషన్ గా ఎలా ఉపయోగపుడుతున్నాయి ఇవన్నీ ఈరోజు చూద్దాం.

గోంగూర చెట్టు ముదిరే కొద్ది పూతరావడం, కాయలు రావడం ఆ తర్వాత పువ్వులు రావడం మనం చూసే ఉంటాం. ఆ పువ్వులను తీసుకుని నీళ్లలో వేసి మరిగించి..వడకట్టి డికాషన్ చేసి..ఎలుకలకు ఇచ్చి పరిశోధన చేశారు. ఇందులో యాంతోసైనిన్ (Anthocyanin) అనే కెమికల్స్ చాలా హైడోస్ లో ఉన్నాయట. ఇవి మన శరీరంలోకి వెళ్లే సరికి..మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ను నిర్మూలించడానికి.. మన శరీరంలో ఉత్పత్తయ్యే మూడు ఎంజైమ్స్ ను పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది..ఆ ఎంజైమ్స్ ఏంటి అంటే..ట్వినోన్, గ్లుటాథియోన్, ఆక్సిడోరిడక్టేస్..ఈ మూడు ఎంజైమ్స్ ఉత్పత్తిని ఈ డికాషన్ బాగా పెంచుతుందట. 

ఇంకా ఎంజైమ్స్ వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయంటే..మన శరీరంలో హానికలిగించే..దీర్ఘరోగాలకు కారణమయ్యే కాన్సర్ రావడానికి ప్రేరరణకలిగించే ఫ్రీ రాడికల్స్ను నిర్మూలించడడానికి బాగా ఉపయగపడుతుందని పరిశోధనలో తెలియజేశారు. 

అసలు ఈ ఫ్రీరాడికల్స్ అంటే ఏంటి?

మనం తినే ఆహార పదార్థాల్లో..వండే విధానం వల్ల ఈ ఫ్రీరాడికల్స్ ఫామ్ అవుతాయి. నూనె మరిగించిన తర్వాత మరిగిన నూనెలో దేవిన పదార్థాలో ఇవి ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. మాడినవి, అతిగా వేడిచేసినవి, హీట్ కు ఒవెన్ లో పెట్టినవి, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వల్ల, స్వీట్స్, హాట్స్, బేకరీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు బాడీలో ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ పెంచుతాయి. అలాంటి ఫ్రీ రాడికల్స్ ను నిర్మూలించడానికి ఈ గోగుపూవు డికాషన్ పనికొస్తుందని 2011 వ సంవత్సరంలో యూనివర్శిటి ఆఫ్ ఐలోరిన్ (University Of ilorin- Nigeria) వారు పరిశోధన చేసి ఇచ్చారు.

ఒబిసిటి వచ్చినవారిలో ఫ్యాటిలివర్ ఎక్కువగా ఉంటుంది. లివర్ అంతా కొవ్వుపట్టేసి..లివర్ కణాలు సోమరిగా అయిపోతాయి. భవిష్యత్తులో దీర్ఘరోగాలు రావడానికి, లివర్ ఫెయిల్ దెబ్బతినాడికి కారణం అవుతుంది. లివ‌ర్‌లో ఎక్కువ‌గా కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య వ‌స్తుంటుంది. ఇందులో రెండు ర‌కాలు ఉన్నాయి. ఒక‌టి నాన్ ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ డిసీజ్, రెండోది ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ వ్యాధి. మొద‌టిది ఆల్క‌హాల్ తీసుకోన‌ప్ప‌టికీ ఇత‌ర కార‌ణాల వ‌ల్ల వ‌స్తుంది. రెండోది ఆల్క‌హాల్ ఎక్కువ‌గా సేవించ‌డం వ‌ల్ల వ‌స్తుంది. ఈ గోగుపువ్వు డికాషన్ ను 12వారాల పాటు..రోజు ఒక కప్పు తీసుకోవడం వల్ల65 శాతం లివర్ డీటాక్సిఫికేష్ జరిగి నార్మల్ అవుతుందని పరిశోధన చేసి ఇచ్చారు. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కూడా త‌గ్గిస్తుంది

పల్లెటూర్లలో ఉండేవారు ఇళ్లలో గోంగూర పెంచుకుంటూ ఉంటారు. గోగుపువ్వులను ఇలా వాడుకోవచ్చు. నాలుగు మూడు పువ్వులు తీసి..క్లీన్ చేసి 100ML నీళ్లలో మరిగించి..వడకట్టి కాస్త తేనె కలుపుకుని తాగేయొచ్చు. బయట ఫుడ్స్ బాగా తినేవారు ఇలా చేస్తుంటే మంచిది. పువ్వులను తీసేసి ఎండపెట్టి పొడిచేసుకుని పెట్టుకోవచ్చు. 10గ్రామలుు చొప్పున వాడుకుంటే సరిపోతుంది.

సిటీలో ఉండేవారికి గోగుపువ్వులు దొరకడం కష్టం. మార్కెట్లో గోంగూర కట్టలు కట్టలు అమ్ముతారు..వేళ్లతో సహా ఉంటాయి. అవి కొనుక్కోని..కుండీల్లో పాతితే..మంచిగా పువ్వులు వస్తాయి.

ఇలా సమస్యలు ఉన్నవారు..ఈ పువ్వులను వాడుకోవచ్చు. ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య ఉన్నవారు ఈ ఆహారాల‌ను రెగ్యుల‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌వ‌చ్చు.

గమనిక : ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. ఆరోగ్యపరమైన సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించగలరు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.