Hemoglobin : హిమోగ్లోబిన్ పెరగాలా.. ఈ ఆహారం తీసుకోవల్సిందే!

Hemoglobin : రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే పలు రకాల సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా రక్తంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి. ఇది లేనప్పుడు శరీరానికి నీరసం ఆవహిస్తుంది. అలాగే రక్తహీనత ఎదురవుతుంది

Hemoglobin  : హిమోగ్లోబిన్ పెరగాలా.. ఈ ఆహారం తీసుకోవల్సిందే!


Hemoglobin  : రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే పలు రకాల సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా రక్తంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి. ఇది లేనప్పుడు శరీరానికి నీరసం ఆవహిస్తుంది. అలాగే రక్తహీనత ఎదురవుతుంది. అందుకే శరీరంలో హిమాగ్లోబిన్ పెంచే ఆహార పదార్థాలు తీసుకోవడం మేలు.

హిమోగ్లోబిన్ లోపిస్తే ఏం జరుగుతుంది అంటే..

హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఎర్రరక్తకణాల్లో కనిపిస్తుంది. ఈ కణాలు శరీరమంతా ఆక్సిజన్ ను తీసుకెళ్లడానికి కారణమవుతాయి. ఆక్సిజన్ ను రవాణా చేయడంతో పాటు హిమోగ్లోబిన్ కార్బన్ డై ఆక్సైడ్ ను ఎర్రరక్త కణాల నుంచి ఊపిరితిత్తుల్లోకి తీసుకువెళ్తుంది. ఊపిరి పీల్చుకున్నప్పుడు కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. తక్కువ హిమోగ్లోబిన్ కలిగి ఉండటం వల్ల శరీరానికి విధులు నిర్వహించడానికి కష్టమవుతుంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు పలు రకాల సమస్యలు వేధిస్తాయి.

అధికంగా ఉండే ఆహార పదార్థాలు..

ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అందులో ముఖ్యంగా తోటకూరలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో పొటాషియం సైతం ఉండటంతో ఇది  శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలో పెంచుతుంది. అలాగే పాలకూరలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది.
ఖర్జూరాన్ని రోజు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తహీనత దూరమవుతుంది. శరీరంలో ఐరన్ స్థాయిలు మెరుగుపడతాయి. రోజు వీటిని తీసుకుంటే నీరసం దరి చేరదు.
మునగాకు, మునక్కాయలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇవి ఎముకలని దృఢంగా మార్చడంతో పాటు శరీరంలో రక్తం స్థాయిలను పెంచుతాయి.
ప్రతిరోజు దానిమ్మ పండును తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య దరిచేరదు. ఇవి శరీరంలో రక్తం స్థాయిలను పెంచుతాయి.
బీట్రూట్లో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని ఏ రూపంలో తీసుకున్న శరీరానికి మేలు జరుగుతుంది.
నువ్వుల్లో ఐరన్, జింక్, పొటాషియం, సెలీనియం వంటివన్నీ ఉంటాయి ఇవి శరీరానికి కావలసిన ఐరన్ ను అందిస్తాయి. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలకు నువ్వులు ఇవ్వటం వల్ల వారిలో రక్తహీనత దరిచేరదు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.