Diabetes : షుగర్ వ్యాధి ఉంటే కంటిలో శుక్లాలు వస్తాయా.. ఈ విషయంలో ఎలా జాగ్రత్త పడాలంటే..

Diabetes : వయసు పెరుగుతున్న కొలది చాలామందిలో కంటికి సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా 60 ఏళ్లు దాటాక ఈ వ్యాధి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. దాదాపు 70 ఏళ్ళు దాటిన వారిలో 80 శాతం మందికి కంటికి సంబంధించి ఏదో ఒక సమస్య ఉంటుందని తెలుస్తోంది.

Diabetes : షుగర్ వ్యాధి ఉంటే కంటిలో శుక్లాలు వస్తాయా.. ఈ విషయంలో ఎలా జాగ్రత్త పడాలంటే..
Do diabetes causes cataracts in your eyes


Eye cataracts : వయసు పెరుగుతున్న కొలది చాలామందిలో కంటికి సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా 60 ఏళ్లు దాటాక ఈ వ్యాధి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. దాదాపు 70 ఏళ్ళు దాటిన వారిలో 80 శాతం మందికి కంటికి సంబంధించి ఏదో ఒక సమస్య ఉంటుందని తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కంటి శుక్లాలు.

కంటిలో వచ్చే శుక్లాలు కన్ను లోపల ఎన్నో మార్పులు తీసుకువచ్చి క్రమంగా చూపుని తగ్గించేస్తాయి. కంటి లోపల ఉండే భాగాలు చెడిపోయి చూపు మబ్బుగా కనిపిస్తూ ఉంటుంది. చాలా వరకు కంటిలో శుక్లాలు వంశపారపర్యంగా వస్తాయి. మరికొందరిలో పుట్టుకతోనే ఈ వ్యాధి ఉంటుంది. ఇంకొన్నిసార్లు కంటికి సంబంధించి ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు, ఎక్కువ కాంతిని చూసినప్పుడు, షుగర్ వ్యాధి స్టెరాయిడ్స్ వల్ల కంటిలో శుక్లాలు ఏర్పడతాయి. కారణం ఏదైనా వీటిని అజాగ్రత్త చేయకూడదు.

సాధారణంగా కంటిలో శుక్లాలు రెండు రకాలుగా ఉంటాయి. పుట్టుకతో వచ్చే వాటిని కంగేనిటల్ క్యాటరాక్ట్ అంటారు. మధ్యలో ఏదైనా కారణాల ఏర్పడితే న్యూక్లియర్ క్యాటరాక్ట్ అంటారు. కంటి లోపల ఉండే పట్టకం వెలుపల శుక్లం ఏర్పడితే దాన్ని లెన్స్ కాటరాక్ట్ అంటారు. ఈ కాటరాక్ట్ కంటిలో ఎక్కడ ఏర్పడిన వచ్చే ఫలితం ఒక్కటే. చూపు అనేది క్రమంగా తగ్గిపోతుంది.

ఒక్కోసారి కంటిచూపు అల్లుకుపోయినట్టు, మబ్బులు కమ్మినట్టు, బూజు పట్టినట్టు కనిపిస్తున్న లేదా వాహనాన్ని నడుపుతున్నప్పుడు ఎదురుగా ఉన్న కాంతి సరిగా కనిపించకపోవడం వంటివన్నీ సబ్కాప్సులర్ క్యాటరాక్ట్ కిందకి వస్తాయి. ఇది చాలా తొందరగా పెరగడమే కాకుండా చూపుని నాశనం చేస్తుంది.

కొన్నిసార్లు వైద్యులు క్యాటరాక్ట్ కి సంబంధించి కచ్చితంగా వైద్యం తీసుకోవాలని చెబుతారు. ఈ విషయంలో అజాగ్రత్త వహిస్తే క్రమంగా చూపు తగ్గిపోయి ఎన్నో సమస్యలు వస్తాయి. శుక్లం ఏర్పడిన మొదటి రోజుల్లో క్రమంగా చూపు తగ్గుతుంది. ఇలాంటి సమయంలోనే జాగ్రత్త తీసుకోవాలి. అజాగ్రత్త చేస్తే పూర్తిగా చూపు కోల్పోయే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఈ వ్యాధి వయసును అనుసరించే వస్తుంది. అందుకే 60 ఏళ్ళు దాటాక కనీసం ఆరు నెలలకు ఒకసారి అయినా కంటికి సంబంధించిన అన్ని పరీక్షలు చేసుకోవడం ఎంతో మంచిది.

అయితే షుగర్ వ్యాధి ఉన్నవారికి కంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అవసరం. ఈ వ్యాధి ఉన్నవారికి కంటి శుక్లాలతో పాటు మరిన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తరచూ వాడే మందులు శరీరం మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విటమిన్ ఏ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వయసు పెరుగుతున్న వాళ్లు ఎక్కువగా ఎండకి కాంతికి ఎదురుగా వెళ్లకపోవడమే మంచిది. కంటికి సంబంధించి ఏ సమస్యలు వచ్చినా సొంత వైద్యం కాకుండా నేరుగా వైద్యున్ని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.