ఈ ముద్రలు వేయడం వల్ల షుగర్‌ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి..! 

ఈరోజుల్లో మధుమేహం లేని ఇళ్లు ఉండటం లేదు.. అలా వ్యాపించింది ఈ రోగం.. వయసు మీద పడే కొద్దీ.. బీపీ, షుగర్‌ రావడం ఆనవాయితీగా మారింది ఏంటో.. మధుమేహం ఉంటే.. మందులు వాడాల్సిందే.. లేదంటే.. షుగర్‌ లెవల్స్‌ పెరిగిపోతాయి.. ఆయుర్వేదం ద్వారా కూడా డయబెటీస్‌ను కంట్రోల్‌ చేసుకోవచ్చు.. అలాగే మీరు ఎలాంటి పద్ధతి పాటించినా.. యోగాలో కొన్ని ముద్రలు వేయడం వల్ల

ఈ ముద్రలు వేయడం వల్ల షుగర్‌ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి..! 


ఈరోజుల్లో మధుమేహం లేని ఇళ్లు ఉండటం లేదు.. అలా వ్యాపించింది ఈ రోగం.. వయసు మీద పడే కొద్దీ.. బీపీ, షుగర్‌ రావడం ఆనవాయితీగా మారింది ఏంటో.. మధుమేహం ఉంటే.. మందులు వాడాల్సిందే.. లేదంటే.. షుగర్‌ లెవల్స్‌ పెరిగిపోతాయి.. ఆయుర్వేదం ద్వారా కూడా డయబెటీస్‌ను కంట్రోల్‌ చేసుకోవచ్చు.. అలాగే మీరు ఎలాంటి పద్ధతి పాటించినా.. యోగాలో కొన్ని ముద్రలు వేయడం వల్ల మీరు షుగర్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. అవేంటంటే.. 

షుగ‌ర్ స‌మ‌స్య ఉన్న‌వారు ఆహారంలో అనేక మార్పులు చేసుకోవాలి. తాజా పండ్లు, కూర‌గాయ‌లు, ఆకుకూర‌ల‌తోపాటు ఫైబ‌ర్ అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. న‌ట్స్‌ను ఎక్కువ‌గా తినాలి. రోజూ త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్ర‌పోవాలి. వేళ‌కు భోజ‌నం చేయాలి. రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.
షుగ‌ర్ స‌మ‌స్య ఉన్న‌వారు కింద తెలిపిన విధంగా ప‌లు ముద్ర‌ల‌ను రోజూ వేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఒక్కో ముద్ర‌ను క‌నీసం 10 నిమిషాల పాటు వేయాలి. రోజూ ఈ అన్ని ముద్రల‌ను వేయాలి. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ధ్యానం చేసే భంగిమ‌లో ప‌ద్మాస‌నం వేసి కూర్చుని రెండు చేతి వేళ్ల‌తో ఈ ముద్ర‌ల‌ను వేయాల్సి ఉంటుంది. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకోవ‌చ్చు. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. ఆ ముద్రలు ఏంటంటే..
ఆపాన ముద్ర‌, లింగ ముద్ర‌, ప్రాణ ముద్ర‌, సూర్య ముద్ర‌, జ్ఞాన ముద్ర‌.. అని ఈ ముద్ర‌ల‌ను రోజూ వేస్తే డ‌యాబెటిస్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఈ ముద్ర‌ల‌ను వేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ద‌గ్గు, జ‌లుబు త‌గ్గిపోతాయి. శ‌రీరంలో ఉండే క‌ఫం త‌గ్గుతుంది. మెట‌బాలిజం పెరిగి క్యాల‌రీలు ఖ‌ర్చ‌వుతాయి. కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. నాసికా రంధ్రాల్లో ఉండే అడ్డంకులు పోయి శ్వాస స‌రిగ్గా ఆడుతుంది.
మన చేతి వేళ్లకు అపారమైన శక్తి ఉంటుంది.. ఇది డైరెక్టుగా మెదడు వరకూ కనక్షన్‌తో ఉంటుంది. అందుకే.. చేతి వేళ్లతో వేసే ఈ ముద్రలు కచ్చితంగా ప్రభావం చూపిస్తాయి.. వీటిని వేయడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు.. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వేయండి.. అయితే ఉదయం పూట వేయడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.