Hibiscus flower oil : మందార పువ్వుల నూనె ఇలా చేసి జుట్టు రాస్తే ఎదుగుదల మాములుగా ఉండదు..

Hibiscus flower oil : మార్కెట్‌లో ఖరీదైన ఆయిల్స్‌ అన్నీ..నాచురల్‌, ఆయుర్వేదిక్‌ అని ఆడ్వర్ట్‌జ్‌ చేసుకుంటాయి. వాటిపైన కామన్‌గా ఉండేవి..కుంకుడికాయలు, ఉసిరికాయలు, బాదం ఇమేజ్‌స్.. ఇవి జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

Hibiscus flower oil : మందార పువ్వుల నూనె ఇలా చేసి జుట్టు రాస్తే ఎదుగుదల మాములుగా ఉండదు..
Hibiscus flower oil for hair growth


Hibiscus flower oil : మార్కెట్‌లో ఖరీదైన ఆయిల్స్‌ అన్నీ..నాచురల్‌, ఆయుర్వేదిక్‌ అని ఆడ్వర్ట్‌జ్‌ చేసుకుంటాయి. వాటిపైన కామన్‌గా ఉండేవి..కుంకుడికాయలు, ఉసిరికాయలు, బాదం ఇమేజ్‌స్.. ఇవి జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. జుట్టుకు అప్లై చేస్తే మంచి పోషణ అందుతుంది. జుట్టు రాలకుండా, దృఢంగా ఉండాలంటే..మనం పెట్టే ఆయిల్‌ కూడా ముఖ్యమే.. మీరు జుట్టు ఏ ఆయిల్ రాస్తున్నారు, ఎలా రాస్తున్నారు అన్నది చాలా ముఖ్యం. జుట్టుకు మందారపువ్వుల నూనె బాగా హెల్ప్‌ అవుతుంది. ఇంట్లోనే ఈ ఆయిల్‌ను సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బ‌రినూనె, ఆముదం, బాదంనూనెల‌ను ఒక్కోటి రెండు పెద్ద టీస్పూన్ల చొప్పున తీసుకోవాలి. అన్నింటినీ క‌లిపి అందులో విట‌మిన్ ఇ ట్యాబ్లెట్ల నుంచి తీసిన ద్ర‌వాన్ని వేయాలి. అలాగే అందులో గుప్పెడు మందార పువ్వుల ముద్ద‌ను కూడా వేయాలి.

త‌రువాత మొత్తం మిశ్ర‌మాన్ని బాగా క‌లిపి ప‌క్క‌న పెట్టాలి. దీన్ని రాత్రంతా అలాగే ఉంచాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యం వ‌డ‌బోయాలి. దీంతో మందార పువ్వుల సారం ఆ మిశ్ర‌మంలోకి వ‌చ్చి చేరుతుంది. ఇలా మందార పువ్వుల నూనె త‌యార‌వుతుంది. దీన్ని జుట్టుకు రాయండి.

పైన తెలిపిన విధంగా మందార పువ్వుల నూనెను త‌యారు చేసుకుని జుట్టుకు బాగా రాయాలి. కుదుళ్ల‌కు త‌గిలేలా నూనెను బాగా త‌ల‌కు ప‌ట్టించాలి. త‌రువాత 1 గంట సేపు ఆగి త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారంలో కనీసం 2 సార్లు చేయాలి. దీంతో ఎలాంటి జుట్టు స‌మ‌స్య అయినా స‌రే త‌గ్గుతుంది. జుట్టు రాల‌డం ఆగి జుట్టు పెరుగుతుంది. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. చుండ్రు సమస్యను కూడా ఈ ఆయిల్‌ తగ్గిస్తుంది. జుట్టు అందంగా మారి కాంతివంతంగా కనిపిస్తుంది.

అలాగే ఈ ఆయిల్‌ను రాస్తే సరిపోదు.. కుదుళ్లకు పట్టేలా బాగా మర్దనా చేసుకోవాలి. ఏ ఆయిల్‌ రాసినా స్కల్‌కు బాగా మసాజ్‌ చేయాలి. అప్పుడే రక్తప్రసరణ అవుతుంది. జుట్టుకు బ్లడ్‌ సర్క్యూలేషన్‌ బాగా అయితేనే అది బాగా పెరుగుతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.