Health : ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం తొలగించే అద్భుతమైన చిట్కా..!

Health : వర్షాలు మొదలయ్యాయి.. ఇక చాలా మందిలో దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా మెల్లగా స్టాట్‌ అవుతాయి. ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోయి చాలా మంది ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు.

Health : ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం తొలగించే అద్భుతమైన చిట్కా..!


Health : వర్షాలు మొదలయ్యాయి.. ఇక చాలా మందిలో దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా మెల్లగా స్టాట్‌ అవుతాయి. ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోయి చాలా మంది ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. ఊపిరితిత్తుల్లో, శ్వాస నాళాల్లో పేరుకుపోయిన క‌ఫం పూర్తిగా తొలగిపోవడానికి ఎలాంటి సిరఫ్‌లు, మందులు వాడుకుండా.. కేవలం ఇంట్లో ఉండి మీ ఊపిరితిత్తులను క్లీన్‌ చేసుకోవచ్చు తెలుసా..? కొంతమందికి ఏడాది పొడవునా దగ్గు బాధిస్తుంది. అలాంటి వారు ఎన్ని మాత్రలు వేసుకున్నా అప్పటిమందమే ఉంటుంది. ఒక చిన్న చిట్కాను ఉప‌యోగించి ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస సంబంధిత స‌మస్య‌ల‌ నుంచి బ‌య‌ట‌ప‌డ‌డంతో పాటు ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన క‌ఫమంతా తొల‌గిపోతుంది.

Healing hearts and lungs | UNC-Chapel Hill

క‌ఫాన్ని తొల‌గించే ఈ చిట్కాను ఎలా త‌యారు చేసుకోవాలంటే..రెండు చిన్న ఎర్ర ఉల్లిపాయ‌ల‌ను అలాగే ఒక ఇంచు అల్లం ముక్క‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. వీటిని విడివిడిగా పేస్ట్ లాగా చేసి నీరు క‌ల‌ప‌కుండా వాటి నుండి ర‌సాన్ని తీసుకోవాలి. త‌రువాత వీటిని క‌లిపి ఒకే గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మంలో ఒక టీ స్పూన్ తుల‌సి ఆకుల ర‌సాన్ని వేసి క‌ల‌పండి.. త‌రువాత ఇందులో ఒక చిటికెడు ప‌సుపును వేసి క‌ల‌పండి. త‌రువాత ఇందులో పావు టీ స్పూన్ మిరియాల పొడిని, ఒక టీ స్పూన్ తేనెను వేసి క‌ల‌పండి.. ఉల్లిపాయ‌లో యాంటీ బ్యాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి. 

ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన క‌ఫాన్ని తొల‌గించ‌డంలో, గొంతులో మంట‌ను త‌గ్గించ‌డంలో ఉల్లిపాయ మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. అలాగే ఈ ఉల్లిపాయ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి ద‌గ్గు, జ‌లుబు వంటి వాటితో పాటు ఇత‌ర వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్‌లు కూడా మ‌న ద‌రి చేర‌కుండా చేస్తాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తాయి. అదే విధంగా అల్లం కూడా శ్వాస నాళాల్లో ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన క‌ఫాన్నితొల‌గించి శ్వాసక్రియ సాఫీగా సాగేలా చేయ‌డంలో మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది.దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు మ‌న‌ల్ని ఇన్ ఫెక్ష‌న్‌ల బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. 

తుల‌సి ఆకుల ర‌సం ద‌గ్గు, జ‌లుబు, ఆస్థ‌మా వంటి వాటితో పాటు ఇత‌ర శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌న్నింటిని త‌గ్గించే దివ్యౌష‌ధంగా ప‌ని చేస్తుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో కూడా తుల‌సి ఆకుల ర‌సం మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. ప‌సుపు స‌హ‌జ‌సిద్ద యాంటీ బ‌యాటిక్ గా ప‌ని చేస్తుంది. మిరియాల్లో ఉండే ఔష‌ధ గుణాలు గొంతులో పేరుకుపోయిన క‌ఫాన్ని తొల‌గించ‌డంలో అలాగే శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెండ‌చంలో తోడ్ప‌డ‌తాయి. శ్వాస మార్గంలో పేరుకుపోయిన క‌ఫాన్ని క‌రిగించ‌డంలో తేనె మ‌న‌కు చ‌క్క‌టి ఔష‌ధంలా ప‌ని చేస్తుంది.

తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ప్లామేట‌రీ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి వైర‌స్, బ్యాక్టీరియాల వ‌ల్ల క‌లిగే ఇన్పెక్ష‌న్‌ల‌ను త‌గ్గించ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఎవ‌రైనా ఉప‌యోగించ‌వ‌చ్చు. 

ఈ మిశ్ర‌మాన్ని రోజుకు రెండు పూట‌లా పూట‌కు అర టీ స్పూన్ మోతాదులో పిల్ల‌ల‌కు ఇవ్వాలి. ఇది ఘాటుగా ఉంటుంది కాబట్టి... పిల్ల‌ల‌కు గోరు వెచ్చని పాల‌ల్లో క‌లిపి దీనిని ఇవ్వ‌వ‌చ్చు. ఇక పెద్ద‌లు పూట‌కు ఒక టీ స్పూన్ మోతాదులో మూడు పూట‌లా తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌లు తగ్గ‌డంతో పాటు శ్వాస నాళాలు, గొంతు, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన క‌ఫం అంతా తొల‌గిపోతుంది. ఎప్పటి నుంచో దగ్గు సమస్యతో బాధపడే వాళ్లు ఒక్కసారి ఈ చిట్కా ట్రై చేసి చూడండి..!

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.