Over weight : అధిక బరువు తగ్గించడమెలా ....అయితే ఇవి పాటించండి

Over weight .....ఈ రోజుల్లో బాగా వినిపిస్తున్న సమస్య. చిన్న చిన్న పిల్లలు కూడా Over weight సమస్యతో బాధపడుతున్నారు. మన ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే.....బరువు అదుపువలో ఉండాలి. బరువు ఎక్కువైనా ప్రమాదమే, అదే బరువు తక్కువైతే..... శరీరంలో ఏదో తెలియని వ్యాధి సోకిందని అర్థం చేసుకోవాలి. 

Over weight : అధిక బరువు తగ్గించడమెలా ....అయితే ఇవి పాటించండి
How to lose excess weight


Over weight .....ఈ రోజుల్లో బాగా వినిపిస్తున్న సమస్య. చిన్న చిన్న పిల్లలు కూడా Over weight సమస్యతో బాధపడుతున్నారు. మన ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే.....బరువు అదుపువలో ఉండాలి. బరువు ఎక్కువైనా ప్రమాదమే, అదే బరువు తక్కువైతే..... శరీరంలో ఏదో తెలియని వ్యాధి సోకిందని అర్థం చేసుకోవాలి. 

బరువు పెరిగింది కదా అని భోజనం మానేయడం అసలు మంచిదికాదు. పోనీ ఓకేసారి భారీగా వ్యాయామాలు చేయడమూ ప్రమాదమే. అతి వ్యాయామం చేయడం వల్ల గుండెపోటు కూడా రావొచ్చు. మనం రోజు తీసుకునే డైట్ లో కెలరీలు ఎక్కువగా ఉండటం, సరైన వ్యాయామం చేయకపోవడం వల్ల......బరువు సులువుగా పెరిగిపోతుంది. 

అధిక బరువు కంట్రోల్ చేయలేకపోతే....సమస్యలు కొని తెచ్చుకున్నట్లే. ఏదో ఒక దగ్గర కూర్చుని పనిచేస్తున్నామా అనే అనుకుంటారు గానీ....మన శరీరం ఎలా ఉందో పట్టించుకోం, రోజుకింత తినడం, పడుకోవడం అంతే. కానీ పల్లెల్లో శారీరక శ్రమ చేస్తున్నారు కాబట్టే....వాళ్ల ఆరోగ్యం పుష్టిగా ఉంటుంది. పట్టణాల్లో ఎక్కడో నూటికో కోటికో కొందరే వ్యాయామాలు చేస్తూ మంచి ఆహారాన్ని తీసుకుంటున్నారు. సరైన నిద్ర లేకపోయినా బరువుపెరిగే సూచనలు దండిగా ఉన్నాయి. 

ఒబెసిటీతో బాధపడేవాళ్లకు...హై కొలస్ట్రాల్ సమస్య వస్తుంది. మందు తాగడం, జంక్ ఫుడ్, వయసు పెరగడం, రక్తపోటు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. శరీరంలో రకరకాల క్యాన్యర్ కణాలు ఏర్పడటానికి ఒబెసిటీ ఒకరకంగా కారణమవుతుంది. బరువు అధికమైతే శరీరంలో జీర్ణక్రియ పనిచేయడం మందగిస్తుంది. మెదడు కూడా మొద్దుబారిపోతుంది.

బరువు తగ్గాక మనలో ఉత్సాహంగా ఉంటాం, శరీరం, మనసు చక్కగా తేలికపడుతుంది. ఎలాంటి పనుల్లో అయినా చురుగ్గా పాల్గొంటాం.

అధిక బరువు వల్ల వచ్చే సమస్యలు

  • మధుమేహం
  • కోవ్వు పేరుకుపోవడం 
  • రక్తపోటు(BLOOD PRESSURE)
  • గుండెపోటు
  • బద్ధకం
  • స్ర్తీలలో నెలసరి తప్పడం, సంతానలేమి

అధిక బరువు తగ్గించడమెలా

రోజు ఉదయం పూట లేవగానే పులుపు తక్కువగా ఉండేలా నిమ్మరసం తీసుకుని దానిలో తేనే కలుపుకుని తాగాలి
కచ్చితంగా ఉదయంపూటే కాలకృత్యాలు తీర్చుకోవాలి
టిఫిన్ మానేయడం అసలు మంచిది కాదు......ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే అల్పాహారం తినాలి
రాగి ఇడ్లీలు, జొన్నల జావ, మిల్లెట్ దోశెలు లాంటివి ప్రయత్నిస్తే కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపిస్తుంది...ఆకలిని కంట్రోల్ చేసుకోవచ్చు, ఓట్స్ దోశెలు చేసుకుంటే మరీ లాభం
మధ్యాహ్నం కార్బోహైడ్రోట్స్ ఉండే రైస్ కు బదులు బ్రౌన్ రైస్, చపాతీలు, రాజ్మా, పప్పు వంటివి తీసుకోవాలి, పెరుగుకు బదులు మజ్జిగను చేర్చుకుంటే మంచిది
రాత్రి మాత్రం చపాతీలు తింటే మంచిది....లేకపోతే పాలు, పళ్లు పెట్టుకుంటే ప్రయోజనం ఉంటుంది. 
రాత్రి పూట మాత్రం అసలు భోజనం మానొద్దు. అదికూడా త్వరగా పడుకోవడానికి 2 గంటల ముందే పూర్తి చేసుకోవాలి. 
కచ్చితంగా వ్యాయామాన్ని మన రెగ్యులర్ పనిగా పెట్టుకోవాలి.. తిన్నాక అలానే కూర్చోకుండా కాస్త నడవాలి.
ఏదో ఒక పని పెట్టుకుని నడకను అలవాటు చేసుకోవాలి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.