Face Pack Instant Glow : ఈ ఫేస్‌ ప్యాక్‌లతో ఇన్‌స్టంట్‌ గ్లో.. మొదటిసారే మైమరపించే రిజల్ట్..!

Face Pack Instant Glow : ఆరోగ్యం కంటే.. అందం మీద చాలా మందికి శ్రద్ధ ఉంటుంది..ఏజ్‌ పెరగడం వల్ల ముడతలను కూడా సహించలేకపోతున్నారు.. ఇంక యంగ్‌గా ఉన్నప్పుడు వచ్చే..మొటమలు, మచ్చలను వదులుతారా.. ఛాన్సే లేదు.. ఏదో

Face Pack Instant Glow : ఈ ఫేస్‌ ప్యాక్‌లతో ఇన్‌స్టంట్‌ గ్లో.. మొదటిసారే మైమరపించే రిజల్ట్..!


Face Pack Instant Glow : ఆరోగ్యం కంటే.. అందం మీద చాలా మందికి శ్రద్ధ ఉంటుంది..ఏజ్‌ పెరగడం వల్ల ముడతలను కూడా సహించలేకపోతున్నారు.. ఇంక యంగ్‌గా ఉన్నప్పుడు వచ్చే..మొటమలు, మచ్చలను వదులుతారా.. ఛాన్సే లేదు.. ఏదో ఒకటిచేస్తూనే ఉంటారు. ఖర్చులేకుండా చేసే కొన్ని ఇంటి చిట్కాల గురించి మనం ఇప్పటికే చాలా మాట్లాడుకున్నాం.. అలాంటిదే ఇది కూడా..! స‌హ‌జ సిద్ధ ప‌దార్థాల‌తో ముఖాన్ని అందంగా మార్చే 3 ర‌కాల ఫేషియ‌ల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దీనికోసం మ‌నం రోజ్ వాట‌ర్‌ను, పాలు, కందిప‌ప్పు, ప‌సుపును ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకోవాలి. అందులో కందిప‌ప్పును వేసి రాత్రంతా నాన‌బెట్టండి.. మ‌రుస‌టి రోజూ ఆ కందిప‌ప్పును పేస్ట్‌గా చేయాలి. త‌రువాత ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ కందిప‌ప్పు పేస్ట్ ను, ఒక టేబుల్ స్పూన్ పాల‌ను, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాట‌ర్ ను, కొద్దిగా ప‌సుపును వేసి క‌ల‌పాలి. త‌రువాత ముఖాన్ని శుభ్రంగా క‌డిగి ఈ మిశ్ర‌మంతో ఫేస్ ఫ్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాల త‌రువాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్ర‌ప‌రుచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల 20 నిమిషాల్లోనే ముఖం తెల్ల‌గా మారుతుంది. బ‌య‌ట‌కు వెళ్లాలి అనుకున్న‌ప్పుడు ఈ ఫేస్ ఫ్యాక్‌ను వాడ‌డం వ‌ల్ల మీ ఫేస్‌ మంచి గ్లోయింగ్‌ ఉంటుంది. అలాగే ఈ చిట్కాను త‌ర‌చూ వాడ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు త‌గ్గి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది. 
ఇక రెండు ఫేస్‌ ప్యాక్‌ ..దీనికోసం మ‌నం ముల్తానీ మట్టిని, ట‌మాట ర‌సాన్ని, పాల‌ను, రోజు వాట‌ర్‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డానికి ఒక గిన్నెలో పైన తెలిపిన ప‌దార్థాలను ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుని బాగా క‌ల‌పండి...ఈ పేస్ట్ చేత్తో కానీ, బ్ర‌ష్‌తో కానీ ముఖానికి రాసుకుని ఆరే వ‌ర‌కు ఉంచండి.. త‌రువాత చ‌ల్ల‌టి నీటితో క‌డుక్కోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం పై ఉండే జిడ్డు తొల‌గిపోతుంది. ఆయిల్ స్కిన్ ఉన్న వారికి ఈ ఫ్యాక్ బాగా ఉప‌యోగ‌పడుతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం పై ఉండే జిడ్డు పోవ‌డంతో పాటు ముఖం కాంతివంతంగా త‌యార‌వుతుంది. 
మూడవ ఫేస్ ఫ్యాక్ ఏంటంటే.. దీని కోసం మ‌నం మైదా పిండిని, శ‌న‌గ‌పిండిని, బియ్యం పిండిని, నిమ్మ‌ర‌సాన్ని, పాల‌ను ఉప‌యోగించాలి. ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి పైన తెలిపిన ప‌దార్థాలను ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి. త‌రువాత ముఖాన్ని శుభ్రంగా క‌డుక్కుని ఈ పేస్ట్‌ను ముఖానికి రాయండి... ఆరిన త‌రువాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని క‌డుక్కోవాలి. ఈ ఫ్యాక్‌ను వాడ‌డం వ‌ల్ల చ‌ర్మం పై ఉండే మృత‌కణాలు తొల‌గిపోతాయి. వారానికి రెండుసార్లు ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల ముఖం మెరిసిపోతుంది. ఈ ఫేస్ ఫ్యాక్ ల‌ను వాడ‌డం వ‌ల్ల ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుంది. అన్ని ఇంట్లో ఉండేవే.. కాబట్టి.. టైమ్‌ ఉన్నప్పుడు ఊకే ఫోన్‌ చూస్తూ ఉండిపోకుండా.. కాస్త టైమ్‌ మీ ముఖంపై శ్రద్ధపెట్టండి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.