Trouble Breathing : ఆయాసం వేధిస్తుందా.. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుందా!

Trouble Breathing : శ్వాసక్రియ శరీరం నిర్వర్తించే ప్రక్రియలలో ఎంతో ముఖ్యమైనది. ఇది క్రమం తప్పకుండా మన శరీరంలో జరుగుతున్నప్పటికీ ఆ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉండదు. కానీ బలవంతంగా కానీ మన ప్రయత్నం

Trouble Breathing : ఆయాసం వేధిస్తుందా.. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుందా!


Trouble Breathing : శ్వాసక్రియ శరీరం నిర్వర్తించే ప్రక్రియలలో ఎంతో ముఖ్యమైనది. ఇది క్రమం తప్పకుండా మన శరీరంలో జరుగుతున్నప్పటికీ ఆ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉండదు. కానీ బలవంతంగా కానీ మన ప్రయత్నం తోటి కానీ శ్వాస తీసుకోవడం వినడం జరుగుతూ ఉంటే దాన్నే ఆయాసం అంటారు. ఈ సమయంలో గాలి తీసుకోవటం కష్టమవుతుంది. ఇలాంటి సమయంలో మనిషి ఉక్కిరిబిక్కిరయ్యి ఇబ్బందిగా అనిపిస్తుంది.
ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఏర్పడితే మనిషి కూర్చోలేక పడుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. సాధారణంగా ఆయాసం రావడానికి చాలా కారణాలు ఉంటాయి 
What Causes Shortness of Breath and What Does It Feel Like?

ఆయాసాన్ని ఎలా గుర్తించాలి అంటే..

కాస్త దూరం నడిచిన, ఆయాసం వచ్చి కూర్చున్న, విశ్రాంతి తీసుకున్న ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటే గుండెకు సంబంధించిన ఆయాసంగా గుర్తించాలి. ఇలాంటివారు ఎట్టి పరిస్థితుల్లోనే వెల్లకిలా పడుకోకూడదు.
అలాగే ఆస్తమా ఉన్నవారు హఠాత్తుగా ఆయాసం ఆరంభమై పిల్లికూతలు వంటి శబ్దం వస్తూ ఉంటుంది.
అసలు ఎందుకు వస్తుంది అంటే..
శ్వాస వ్యవస్థలో ఏవైనా ఇబ్బందులు ఏర్పడటం వల్ల ఆయాసం వస్తుంది.
గాలి పీల్చుకుని వదిలే మార్గాలు కుంచించుకుపోయినా వీటిలో ఏవైనా అడ్డంకులు ఏర్పడిన..
ఊపిరితిత్తుల్లో ఉన్న పొరలు ఏ కారణం చేతైనా ఇబ్బందికి గురవటం వల్ల.. ఈ పొరలు కుంచించుకుపోయి ఉండటంవల్ల..
ముక్కు, గొంతు కి సంబంధించిన ఏవైనా వ్యాధులు రావడం వల్ల..
కొన్ని రకాల వాతావరణం వాసనలు పడకపోవడం వల్ల..
ఎలా తగ్గించుకోవాలంటే..
ఆయాసం ఉన్నవారు చల్లటి పదార్థాలు, కూల్డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ వంటి వాటిని తీసుకోకపోవడం మంచిది. అలాగే చామదుంప, పెరుగు, కొబ్బరి వంటి వాటిని తీసుకోకూడదు. చేపలు ఎక్కువగా తినకూడదు. సొరకాయ, దుంప కూరలు వంటి వాటికీ దూరంగా ఉండాలి. పుల్లటి పదార్థాలను తీసుకోకపోవడం మంచిది. బెండకాయ, బచ్చలి కూర కూడా దూరంగా ఉండాలి.
ముల్లంగి, తేనే, వెల్లులి, గోధుమలు వంటి వాటిని తీసుకోవచ్చు. అలాగే వేడి నీళ్లు తాగడం ఉత్తమం.
వేడి టీ డికాషన్ లో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే ఉబ్బసం వ్యాధి ఉన్నవారికి ఉపశమనంగా ఉంటుంది.
వామును వేయించి పల్చని గుడ్డలో కట్టి వీపు భాగంలో పక్కలలో కాసేపు కాపడం పెట్టడం వల్ల శ్వాసలో ఇబ్బందులు తగ్గుతాయి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.