గుమ్మడికాయ విత్తనాలు పురుషులు తినొచ్చా..?

ఆరోగ్యకరమైన విత్తనాలు అంటే.. అందరూ నట్స్‌ గురించే అనుకుంటారు. బాదంపప్పు, జీడిపప్పు , పిస్తా పప్పు ఇవే కాదు..వీటిల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయో...మీకు గుమ్మడి, పొద్దుతిరుగుడు, పుచ్చకాయల విత్తనాల్లో కూడా అవే

గుమ్మడికాయ విత్తనాలు పురుషులు తినొచ్చా..?


ఆరోగ్యకరమైన విత్తనాలు అంటే.. అందరూ నట్స్‌ గురించే అనుకుంటారు. బాదంపప్పు, జీడిపప్పు , పిస్తా పప్పు ఇవే కాదు..వీటిల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయో...మీకు గుమ్మడి, పొద్దుతిరుగుడు, పుచ్చకాయల విత్తనాల్లో కూడా అవే పోషకాలు ఉంటాయి.. కానీ చాలామందికి వీటి గురించి పెద్దగా తెలియదు. గుమ్మడి విత్తనాలను స్వీట్స్‌ తయారీలో ఎక్కువగా వాడతారు. కానీ వీటిని డైలీ తినడం వల్ల మీ ఆరోగ్యం ఎంత బాగుంటుందో తెలుసా..?

గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. వీటిల్లో ఉండే విట‌మిన్ ఏ రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డ‌మే కాకుండా కంటి చూపును మెరుగుప‌రుస్తుంది. అలాగే ఈ విత్త‌నాల్లో ఉండే పొటాషియం బీపీని త‌గ్గిస్తుంది. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫరాను మెరుగు ప‌రుస్తుంది. దీంతో గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ఈ విత్త‌నాల‌ను తిన‌డం వ‌ల్ల షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ తగ్గుతాయి. ర‌క్తంలో తెల్ల ర‌క్త‌క‌ణాల సంఖ్య పెరుగుతుంది. దీంతో ఇన్‌ఫెక్ష‌న్ల‌పై పోరాడే శ‌క్తి శ‌రీరానికి ల‌భిస్తుంది. దీని వ‌ల్ల వ్యాధులు త‌గ్గుతాయి.

పురుషులకు ఇంకా ఉపయోగం..

పురుషులు ఈ విత్త‌నాల‌ను తింటే వీటిలో ఉండే జింక్ వ‌ల్ల వీర్యం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. ఇది సంతానం క‌లిగే అవ‌కాశాల‌ను పెంచుతుంది. ఇక గుమ్మ‌డి కాయ విత్తనాల‌ను పురుషులు అయితే ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తింటే మంచిది. లేదా బ్రేక్‌ఫాస్ట్‌తో అయినా స‌రే తిన‌వ‌చ్చు. 

మిగిలిన ఎవ‌రైనా స‌రే.. సాయంత్రం వీటిని స్నాక్స్ రూపంలో తిన‌వ‌చ్చు. ఆ స‌మ‌యంలో తినే చిరుతిళ్ల‌కు బ‌దులుగా గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను తింటే ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను రోజుకు గుప్పెడు మోతాదులో తినాలి. అంతకు మించితే జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. గుప్పెడు మోతాదులో తింటే పైన తెలిపిన ప్ర‌యోజ‌నాలు అన్నింటినీ పొంద‌వ‌చ్చు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.