అరటి పువ్వు చేసే మేలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.. పది రోజుల్లోనే ఆ వ్యాధులన్నీ అదుపులోకి!

అరటిపండు లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే దీనిలో విటమిన్స్ ఫైబర్ అధికంగా ఉంటుంది బరువు పెరగాలి అనుకునే వారికి శరీరంలో నీరసం ఆవహించిన వారికి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది అయితే అరటి పండుతో పాటు అరటి పువ్వులో సైతం ఎన్నో రకాల పోషకాలు ఉంటాయని దీని సరస్సు

అరటి పువ్వు చేసే మేలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.. పది రోజుల్లోనే ఆ వ్యాధులన్నీ అదుపులోకి!


అరటిపండు లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే దీనిలో విటమిన్స్ ఫైబర్ అధికంగా ఉంటుంది బరువు పెరగాలి అనుకునే వారికి శరీరంలో నీరసం ఆవహించిన వారికి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది అయితే అరటి పండుతో పాటు అరటి పువ్వులో సైతం ఎన్నో రకాల పోషకాలు ఉంటాయని దీని సరస్సు తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని తెలుస్తోంది.
Arati Puvvu Archives - Chai Pakodi
అరటి పువ్వుతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.. అరటి పువ్వులో పుష్కలంగా ఉన్న పోషక విలువలు, ఔషధ గుణాలే ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. 
అరటి పువ్వులో కాల్షియం, పొటాషియం, రాగి, మెగ్నీషియం, ఐరన్‌ వంటివి ఉంటాయి. అందుకే ఈ పువ్వులను సలాడ్లు, సూప్‌గా తీసుకుంటుంటారు. ముఖ్యంగా దీన్ని తీసుకోవడం వల్ల ఏ ఏ వ్యాధులు అదుపులో ఉంటాయంటే.. 
 డయాబెటీస్: అరటిపువ్వులోని ఔషధ లక్షణాలు మధుమేహాన్ని నియంత్రిండంలో ఉపయోగకరంగా ఉంటాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. శరీరంలోని గ్లూకోజ్‌ను పెంచడంతో పాటు ఇది రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది.
క్యాన్సర్, గుండె జబ్బుల నివారిణి: అరటి పువ్వు క్యాన్సర్, గుండె జబ్బుల నివారణలో ఉపయోగపడుతుంది. అరటి పువ్వులలో ఉండే ఫినోలిక్ ఆమ్లాలు, టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, అనేక ఇతర యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఇంకా ఆక్సీకరణ నష్టాన్ని నివారించి.. గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
 రక్తహీనతకు చెక్: అరటి పువ్వులలో ఐరన్‌ సమృద్ధిగా దొరుకుతుంది. తద్వారా రక్తహీనత నుంచి ఉపశమనం పొందవచ్చు. అరటి పువ్వును రెగ్యులర్‌గా ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల స్థాయి పెరుగుతుంది.
రోగనిరోధక శక్తి: అరటి పువ్వులో పుష్కలంగా ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా  యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండడం వల్ల వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపచేస్తాయి.
 కిడ్నీల ఆరోగ్యం: అరటి పువ్వులో ఉండే అనేక పోషకాలు మూత్రపిండాల ఆరోగ్యకరమైన పనితీరును ప్రేరేపిస్తాయి. అంతేకాదు మూత్రపిండాల్లో రాళ్లను తొలగించి ఉబ్బరం, మూత్ర సమస్యల ప్రమాదాన్ని నివారిస్తుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.