Beauty Tips : దాల్చిన చెక్క, అల్లం తురము చేసే అద్భుతం.. ముఖంపై మొటిమలు, మచ్చలు మాయం..!

Beauty Tips : దాల్చిన చెక్కను వంటల్లో ఉపయోగించవచ్చు, బరువు తగ్గేందుకు, షుగర్‌ లెవల్స్ తగ్గించుకునేందుకు వాడొచ్చు అని తెలుసు.. కానీ అందానికి కూడా దాల్చిన చెక్కను వాడొచ్చని మీకు తెలుసా..? అందంగా కనబడాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి.

Beauty Tips  : దాల్చిన చెక్క, అల్లం తురము చేసే అద్భుతం.. ముఖంపై మొటిమలు, మచ్చలు మాయం..!


Beauty Tips  : దాల్చిన చెక్కను వంటల్లో ఉపయోగించవచ్చు, బరువు తగ్గేందుకు, షుగర్‌ లెవల్స్ తగ్గించుకునేందుకు వాడొచ్చు అని తెలుసు.. కానీ అందానికి కూడా దాల్చిన చెక్కను వాడొచ్చని మీకు తెలుసా..? అందంగా కనబడాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి..కానీ వాటికోసం..పార్లర్స్‌ చుట్టు తిరిగే టైమ్‌, ఓపిక మన దగ్గర ఉండదు.. అన్నింటికంటే..ముఖ్యం.. డబ్బు.. చిన్న ఫేస్‌ ప్యాక్‌ వేసి 500 అడుగుతారు.. పోనీ. దానివల్ల అప్పుడే రిజల్ట్‌ వస్తుందా అంటే..అబ్బే ఏం ఉండదు. ఇంకో నాలుగు సిట్టింగ్‌లు అయితేకానీ తేడా కనిపించదంటారు.. ఈలోపు మన శాలరీ సగం అటేపోతుంది.. ఇవన్నీ కాకుండా..టైమ్‌ ఉన్నప్పుడు వంటగదిలో ఉండేవాటితోనే మీ ముఖానికి ఏం సమస్యలున్నా..తగ్గించుకోవచ్చు. వీటివల్ల పైసలు వేస్ట్‌ కావు, సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఏం రావు.

 
ఒక గిన్నెలో తేనె తీసుకుని.. అందులో అంతే ప‌రిమాణంలో పెరుగును వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకోవాలి. ఆరిన త‌రువాత నీటితో క‌డిగి వేయాలి. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ఉండే మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గిపోతాయి. 
ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల కొబ్బ‌రి నూనెను తీసుకోవాలి. త‌రువాత అందులో ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టీ స్పూన్ అల్లం తురుము, ఒక టీ స్పూన్ పంచ‌దార వేసి క‌ల‌పండి.. ఈ మిశ్ర‌మం స‌హ‌జ సిద్ద స్క్ర‌బ‌ర్‌గా ప‌ని చేస్తుంది. ఈ మిశ్ర‌మాన్ని తీసుకుని ముఖానికి రాసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ఉండే మృత‌క‌ణాలు తొల‌గిపోతాయి. 
బేకింగ్ సోడాను ఉప‌యోగించి కూడా మ‌నం ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు. ఒక గిన్నెలో బేకింగ్ సోడాను, కొద్దిగా ఆలివ్ నూనెను వేసి పేస్ట్‌గా క‌లుపుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకుంటూ స్క్ర‌బ్ చేస్తూ మ‌ర్ద‌నా చేస్తూ శుభ్ర‌ప‌రుచుకోవాలి. ఇలా ముఖాన్ని శుభ్ర‌ప‌రిచిన వెంట‌నే మ‌నం ముఖం మృదువుగా మార‌డాన్ని, ముఖంలో మార్పు రావ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. 
మొటిమ‌లు ఉన్నాయా..? అయితే ఇలా చేయండి.. ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక అందులో తుల‌సి ఆకులు వేసి మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ తుల‌సి ఆకుల నీటిని టోన‌ర్ గా వాడ‌డం వ‌ల్ల మొటిమ‌లు తగ్గుతాయి. అదేవిధంగా రోజ్ వాట‌ర్ మ‌న ముఖానికి మంచి టోన‌ర్‌గా పని చేస్తుంది. దీనిలో విట‌మిన్స్, ఖ‌నిజ ల‌వ‌ణాలు అధికంగా ఉంటాయి. ఒక గిన్నెలో రోజ్ వాట‌ర్‌ను తీసుకుని దానిలో దూదిని ముంచి ముఖానికి రాసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం యొక్క రంగు పెరుగుతుంది. 
మ‌నం ఆహారంగా తీసుకునే క‌ర్జూరాల‌ను ఉప‌యోగించి కూడా మ‌నం మ‌న చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంచుకోవచ్చు.. ఒక గిన్నెలో పాలు, కొద్దిగా ప‌సుపు, ఒక టేబుల్ స్పూన్ క‌ర్జూరం పేస్ట్ వేసి క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ఫ్యాక్‌ల వేసుకోవాలి. 20 నిమిషాల త‌రువాత ముఖాన్ని శుభ్ర‌ప‌రుచుకోవాలి. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల వృద్ధాప్య ఛాయ‌లు త్వ‌ర‌గా మ‌న దరి చేర‌కుండా ఉంటాయి. చ‌ర్మం పై ఉండే ముడ‌త‌లు, స‌న్న‌ని చార‌లు కూడా తొల‌గిపోతాయి. 
ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా చాలా త‌క్కువ ఖ‌ర్చులో ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చ‌ని సౌంద‌ర్య నిపుణులు చెబుతున్నారు. ఇంకెందులు ఆలస్యం ట్రై చేయండి..!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.