Hair fall : మలి వయసులో జుట్టు రాలిపోతుందా.. కారణాలివే.. ఏ జాగ్రతలు పాటించాలంటే..!

Hair problems : వయసు పైబడుతున్న కొలది శరీరం ఎలా ముడుచుకుపోతుందో జుట్టు కూడా అలాగే బలాన్ని కోల్పోతుంది. అందుకే జుట్టు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే 30 ఏళ్లలోనే ముసలి వాళ్లు అయిపోవడం ఖాయం..

Hair fall : మలి వయసులో జుట్టు రాలిపోతుందా.. కారణాలివే.. ఏ జాగ్రతలు పాటించాలంటే..!
precautions to be taken for hair fall


 Hair problems in old age : వృద్ధాప్యం ఎలా వస్తుంది అనేది కచ్చితంగా చెప్పలేము. కానీ కొన్ని దశల్లో అది బయటపడుతూ ఉంటుంది. ముఖ్యంగా కొందరికి 30 ఏళ్లలో వస్తే మరి కొందరికి 60 దాటిన రాదు. కారణం వారి వారసత్వం, జీన్స్, జీవన విధానం. ఇవన్నీ మనిషిని వృద్ధాప్య లక్షణాల నుంచి దూరం చేస్తాయి. అయితే వయసు పైబడుతున్న కొలది శరీరం ఎలా ముడుచుకుపోతుందో జుట్టు కూడా అలాగే బలాన్ని కోల్పోతుంది. అందుకే జుట్టు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే 30 ఏళ్లలోనే ముసలి వాళ్లు అయిపోవడం ఖాయం..

60 ఏళ్లు దాటిన కొందరిలో జుట్టు నల్లగా నిగనగాలాడుతూ మెరుస్తుంది. మరికొందరిలో మాత్రం 40 ఏళ్లు దాటేటప్పడికి తెల్లబడిపోతుంది. ఈ రోజుల్లో ముఖ్యంగా టీనేజ్ పిల్లలకు సైతం జుట్టు నెరిసిపోతుంది. అందుకే జుట్టుని కాపాడుకోవాలి. ముఖ్యంగా తెల్లబడకుండా ఊడిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే నిత్యం యవ్వనంగా మెరిసిపోవచ్చు..

మనిషి మొహం, శరీరం, జుట్టు లో ఉన్న లోపాలు ఎదుటి మనిషిని కచ్చితంగా అంచనా వేస్తాయి. ముఖ్యంగా అతని శరీర తత్వాన్ని ఉండే వ్యాధులను కచ్చితంగా చూపిస్తాయి. అందుకే ఆలోచనలు, ఆహారం, తగిన జీవన శైలితో శరీరాన్ని కాపాడుకోవాలి..

టీనేజ్ లో ఉన్న పిల్లలు ఏ జాగ్రత్తలు తీసుకోకపోయినా చాలా అందంగా కనిపిస్తారు. కారణం ఆ సమయంలో శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులే. అలాగే ఈ సమయంలో శరీరం ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి చర్మాన్ని, జుట్టుని అందంగా ఉంచుతాయి. కానీ క్రమ క్రమంగా వయసు పెరుగుతున్న కొలది ప్రోటీన్ లో మార్పులు వస్తాయి. శరీరంలో హార్మోన్లు హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. శరీరం సామర్ధ్యాన్ని కోల్పోతుంది. ఈ సమయంలోనే జుట్టు ఊడిపోవడం, పలుచబడటం, నుదురు భాగంలో జుట్టు ఊడి ఇబ్బందిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే వయసు పై పడుతున్న కొలది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే..

వయసు పెరుగుతుంటే బిపి, షుగర్ వంటి వ్యాధులు వస్తాయి. ఇలాంటివారు రోజూ మందులు వాడాల్సి ఉంటుంది. ఇవి శరీరం పైన ప్రభావం చూపిస్తాయి. అందుకే తగిన పోషకాహారం సమతుల ఆహారం తీసుకోవాలి..

ఊపిరికి సంబంధించిన యోగాసనాలు చేయాలి..

వారానికి ఒక్కసారి అయినా ఆలివ్ ఆయిల్, మందార ఆయిల్ తో తలకి మర్దన చేసి గోరువెచ్చని నీళ్లతో తలంటూ పోసుకోవాలి..

35 ఏళ్లు దాటాక హార్మోన్ లో హెచ్చుతగ్గులు ఉన్నాయేమో తెలుసుకోవాలి. వాటికి తగినట్టు ఆహారం తీసుకోవడం జీవనశైలి మార్చుకోవడం చేయాలి.

ఒత్తిడిని దూరం చేసుకోవాలి..

తలకి రకరకాల రంగులు, ఘాడత ఎక్కువ ఉన్న షాంపూలు వాడటం తగ్గించుకోవాలి..

తలకు సంబంధించిన సౌందర్య సాధనాలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి..

ఆకుకూరలు, కాయగూరలు, బాదంపప్పు, డ్రై ఫ్రూట్స్, గుడ్లు, పాలు వంటి వాటిని తీసుకోవాలి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.