Heart Attacks : ఈ మధ్య బాగా వింటున్న మాట..... గుండెపోటు. పునీత్ రాజ్ కుమార్ నుంచి నేడు తారకరత్న వరకు ఈ గుండెపోటుకు గురైనవాళ్లే. .

సాధారణంగా Heart Attack వయసు మళ్లినవాళ్లకే వస్తుందనుకుంటాం. మనం ఈ మధ్యన వార్తల్లో చూస్తునే ఉన్నాం. 27 ఏళ్ల యువకుడు అస్వస్థతకు గురయ్యాడని. 30 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడని. మరి దానికి కారణం...?

Heart Attacks : ఈ మధ్య బాగా వింటున్న మాట..... గుండెపోటు. పునీత్ రాజ్ కుమార్ నుంచి నేడు తారకరత్న వరకు ఈ గుండెపోటుకు గురైనవాళ్లే. .
Heart Attacks


Heart Attacks : గుండె ఉండేది పిడికడంతే. పిడికడే కదా అని ఊరుకుంటే రావలసిన అనర్థాలు రాకుండా ఉండవు. కాస్త మైమరచినా ఆ గుండె ప్రాణం నిలవదు. అలాంటి గుండెకు ఏం జరుగుతుందో అని నిరంతరం భయపడుతుంటాం. మన శరీరంలో ఏ అవయవమైనా దాని పని అది చేసుకుంటేనే మనం సుఖంగా ఉండగలం. ఏ మాత్రం గాడి తప్పినా..... ఇక అంతే.
అలానే గుండె కూడా తన పని తాను చేసుకుంటేనే మనం హాయిగా ఉంటాం. కానీ మనమే  అశ్రద్ధ చేసేస్తున్నాం. అయితే ఈ గుండెనొప్పి వచ్చేప్పుడు కొన్ని సంకేతాలు వస్తాయి. వాటిని గుర్తించగలిగితే మన ప్రాణాలు నిలుపుకోవచ్చు. అసలు గుండెనొప్పి ఎప్పుడొస్తుందో ఎవరికీ వస్తుందో తెలీదు. 
సాధారణంగా గుండెనొప్పి వయసు మళ్లినవాళ్లకే వస్తుందనుకుంటాం. కానీ అది ఆ రోజులు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఇప్పుడు యువకులను కూడా ఈ గుండెనొప్పి చీడపీడలా పట్టుకుంది. మనం ఈ మధ్యన వార్తల్లో చూస్తునే ఉన్నాం. 27 ఏళ్ల యువకుడు అస్వస్థతకు గురయ్యాడని. 30 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడని. మరి దానికి కారణం...?
ఈ మధ్య కరోనా నుంచి బయటపడటానికి జీవనశైలిలో పూర్తిగా మార్పులు వచ్చాయి. అందులో వ్యాయామాలు, కసరత్తులు చేయడం కూడా చేర్చుకున్నారు, రోజంతా జిమ్ లో సమయం గడిపేస్తున్నారు. దేనికైనా అతి పనికిరాదనే సంగతి మర్చిపోతున్నారు. ఉదయం లేవగానే జిమ్ సెంటర్లలో అదే పనిగా చేస్తూనే ఉండిపోతున్నారు. సరైన పద్ధతిలో వ్యాయామం చేయకపోతే లేనిపోని అనర్థాలను కోరి తెచ్చుకున్నట్లే. వయసు, శరీర తత్వం బట్టి కసరత్తులు చేయడం మంచిది. అన్ని రకాల వ్యాయామాలు అందరూ చేయడం సబబు కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇటీవల కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కూడా జిమ్ లో కసరత్తులు చేస్తూనే కుప్పకూలిపోయారు. మాజీ ఏపీ ఐటీ మంత్రి గౌతంరెడ్డి కూడా ఛాతీలో నొప్పితోనే ప్రాణాలు  కోల్పోయారు. నేడు నందమూరి తారకరత్న కూడా నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో పాల్గొన్నాక స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తీరా 23 రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స తీసుకున్నాక నిన్న తుది శ్వాస విడిచారు. కరోనా సమయంలోనూ ఆయనకు కరోనా సోకింది. దానివల్ల ఆయన చాలా అవస్థ పడ్డారు. 
ఎలాంటి వ్యాయామం చేసినా దాని ప్రభావం గుండెపై కచ్చితంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వాకింగ్, రన్నింగ్ చేసేప్పుడు గుండె స్పందన పెరుగుతుంది. వ్యాయామాలు ఎక్కువగా చేయడం వల్ల గుండె వేగం పెరిగి.....దాని సిస్టమ్ దెబ్బతింటుంది. వ్యాయామం చేశాక గుండె స్పందన 140 దాటితే  ఆ వ్యక్తికి గుండె సమస్యలున్నట్టు  అనుమానించాలి. అయితే దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశం లేకపోలేదు. అసలు గుండె సమస్యలు ఉన్న వాళ్లు వ్యాయామాలు చేయకపోవడమే మంచిది, రక్తపోటు, మధుమేహం ఉన్నవాళ్లు వైద్యుల్ని సంప్రదించి చేయడమే మంచిది. 

వ్యాయామం ఎలా చేయాలి

మొదట వామ్ అప్ ఎక్సర్ సైజ్ లు చేయాలి, తరవాత చిన్న చిన్న కసరత్తులు అలవాటు చేయాలి
లేదంటే ఓకేసారి వ్యాయామాలు చేస్తే శరీరంలో వేడి పెరిగి గుండెపోటు వస్తుంది
సమయం అయిపోయింది కదా అని వ్యాయామాలు చేసిన వెంటనే బయటకు వచ్చేయకూడదు. నెమ్మదిగా శరీరం వేడి తగ్గించేందుకు చిన్న చిన్న ఎక్సర్ సైజ్ లు చేస్తే ఉపశమనంగా ఉంటుంది
ఆటగాళ్లు, పోటీల కోసం జిమ్ కు వచ్చేవాళ్లు వైద్యులను సంప్రదించి చేస్తే ప్రయోజనముంటుంది.

గుండెపోటు రావడానికి కారణాలు

  • అతి వ్యాయామాలు చేయడం
  • సరైన ఆహార పద్ధతులు లేకపోవడం
  • ఒత్తిడి, ఆందోళనకు గురైనా గుండెపోటు వస్తుంది
  • వారసత్వంగా కూడా గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉంది
  • పొగ, మద్యం తాగడం వలన కూడా గుండెపోటు వస్తుంది
  • కొవ్వు సమస్యలు ఉన్నా గుండెపోటు వస్తుంది
  • జ్వరం, దగ్గు, జలుబు వచ్చినా అనుమానించాలి

గుండెపోటు లక్షణాలు

  • రక్తపు వాంతులు, వాంతులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఇవి పురుషుల్లో కంటే స్ర్తీలలో వచ్చే అవకాశం ఉంది.
  • విపరీతమైన దగ్గు, ఛాతీ మధ్యలో గుండెకు ఎడమవైపు అసౌకర్యంగా ఉంటుంది.
  • ఎడమవైపు భాగాలో నొప్పిగా ఉంటుంది.
  • ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. ఒకేసారి ఆందోళన పెరిగిపోయి కండరాలు పిండేసినట్లుగా అనిపిస్తుంది.
  • ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు తాగకూడదు. తలతిరుగుతున్నట్లుగా ఉంటుంది.
  • చిన్న పనులకే విపరీతంగా అలసిపోవడం
  • విపరీతమైన దగ్గు ఉన్నవాళ్ల శ్లేష్మం గులాబీ రంగులో ఉన్నా అనుమానించాల్సిందే.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.