అకస్మాత్తుగా చెమటలు పడుతున్నాయా..? గుండెజబ్బు ప్రధాన లక్షణం

కొంతమందికి చిన్న పని చేసినా సరే విపరీతంగా చెమట పడుతుంది. వంటగదిలో ఐదు నిమిషాలు ఉంటే చాలు చెమటలు పడతాయి. అకస్మాత్తుగా చెమటలు పట్టడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల వస్తాయని

అకస్మాత్తుగా చెమటలు పడుతున్నాయా..? గుండెజబ్బు ప్రధాన లక్షణం


కొంతమందికి చిన్న పని చేసినా సరే విపరీతంగా చెమట పడుతుంది. వంటగదిలో ఐదు నిమిషాలు ఉంటే చాలు చెమటలు పడతాయి. అకస్మాత్తుగా చెమటలు పట్టడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల వస్తాయని వైద్యులు అంటున్నారు. ఇలా తరచుగా చెమటలు పడితే గుండె పోటు ప్రధాన లక్షణాలని నిపుణులు చెబుతున్నారు. 
Pin on Maxim Antiperspirant
అకస్మాత్తుగా చెమటలు పట్టడం వల్ల అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీనిని గుండె జబ్బుల లక్షణాలుగా కూడా వైద్యులు భావిస్తారు. తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ముందు తరచుగా, ఆకస్మాత్తుగా చెమటలు పడతాయని నిపుణులు చెబుతున్నారు.  

అధిక చెమట ఈ వ్యాధులకు ప్రధాన లక్షణాలు:

అకస్మాత్తుగా చెమటలు పట్టడం వల్ల గుండెపోటు మొదటి లక్షణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
మహిళలకు రాత్రిపూట ఎక్కువగా చెమట పడడం వల్ల భవిష్యత్తులో తీవ్ర సమస్యలు వస్తాయట. 
తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా కూడా అధికంగా చెమట పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొంతమందిలో మధుమేహం పెరగడం కారణంగా కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. 

అకస్మాత్తుగా వచ్చే చెమటలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..

ఆహారంలో ఉప్పును తక్కువగా తీసుకోండి.
ఆల్కహాల్ ప్రతి రోజు తాగడం మానుకోవాలి. 
ఆకు కూరలు, ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోండి.
గ్రీన్‌ టీని ప్రతి రోజు తాగండి.
పుష్కలంగా నీరు త్రాగాలి.
నూనె పదార్థాలను తీసుకోవడం మానుకోవాలి.
ప్రతి రోజు వ్యాయామాలు చేయండి.
ఆహారాలు డైట్‌ పద్ధతిలో తీసుకోవాలి. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.