Blackheads on nose : ముక్కుపై నల్లమచ్చలా..? ఇలా చేస్తే ఈజీగా పోతాయి..!

Blackheads on nose : ముఖంపైన నల్ల మచ్చలు, మొటిమలు ఉండటం కామన్‌. కానీ కొంతమందికి ఎక్కడా ప్లేస్‌ లేనట్టు ముక్కుపైన వస్తాయి చెంపలపైన నల్ల మచ్చలు ఉన్నా చూసేందుకు అంత అగ్లీగా కనిపించదు కానీ

Blackheads on nose : ముక్కుపై నల్లమచ్చలా..? ఇలా చేస్తే ఈజీగా పోతాయి..!
Blackheads on nose


Blackheads on nose : ముఖంపైన నల్ల మచ్చలు, మొటిమలు ఉండటం కామన్‌.. కానీ కొంతమందికి ఎక్కడా ప్లేస్‌ లేనట్టు..ముక్కుపైన వస్తాయి.. చెంపలపైన నల్ల మచ్చలు ఉన్నా చూసేందుకు అంత అగ్లీగా కనిపించదు కానీ.. ఈ ముక్కమీద ఉండే మచ్చలు చూస్తే.. ఏంటోలా ఉంటుంది. వాటి నుంచి తెల్లగా ఏదో వస్తుంది. అబ్బో చికాకుగా ఉంటుంది కదా.. ముఖం అంద‌విహీనంగా క‌న‌బ‌డుతుంది. ముక్కు మీద ఉండే ఈ న‌ల్ల మ‌చ్చ‌ల‌ని ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి కూడా తొల‌గించుకోవ‌చ్చు. న‌ల్ల మ‌చ్చ‌ల‌ను తొల‌గించి ముఖాన్ని అందంగా మార్చే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 
How to get rid of blackheads on your nose.
ఇందుకోసం మ‌నం కీరదోస జ్యూస్ ను, పెరుగును, రోజ్ వాట‌ర్ ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ కీర‌దోస జ్యూస్‌ను, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాట‌ర్‌ను, ఒక‌టేబుల్ స్పూన్ పెరుగును వేసి బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని ముక్కుపై బాగా రుద్దుతూ మ‌ర్ద‌నా చేయాలి. ప‌ది నిమిషాల త‌రువాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల ముక్కుపై మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి. 
ఇంకో చిట్కా ఏంటంటే.. ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మ‌ర‌సాన్ని, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాట‌ర్‌ను వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిలో దూదిని ముంచి దానితో ముక్కుపై బాగా రుద్దాలి. ప‌ది నిమిషాల త‌రువాత చ‌ల్ల‌టి నీటితో క‌డ‌గాలి. ఇలా రోజూ చేయ‌డం వ‌ల్ల ముక్కుపై ఉండే న‌ల్ల మ‌చ్చలు పూర్తిగా తొల‌గిపోతాయి. 
క‌ల‌బంద జెల్‌ను ఉప‌యోగించి కూడా మ‌నం ముక్కుపై ఉండే మ‌చ్చ‌ల‌ను తొల‌గించుకోవ‌చ్చు. ఈ జెల్‌ను కొద్దిగా తీసుకుని ముక్కుపై రాయాలి. 30 నిమిషాల త‌రువాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన రీతిలో ముక్కుపై ఉండే మ‌చ్చ‌ల‌న్నీ పోతాయి.
ముక్కుపై న‌ల్ల మ‌చ్చ‌ల‌తో బాధ‌ప‌డే వారు గ్లిస‌రిన్‌ను ఉప‌యోగించి కూడా స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాట‌ర్‌ను, అర టేబుల్ స్పూన్ గ్లిస‌రిన్‌ను వేసి బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని ముక్కుపై రుద్దుతూ మ‌ర్ద‌నా చేయాలి. ఇలా చేసిన ప‌ది నిమిషాల త‌రువాత నీటితో క‌డ‌గాలి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.