ఎండాకాలంలో గర్భవతులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే..

గర్భధారణ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వాతావరణం మారుతున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి అయితే ఎండాకాలంలో గర్భిణీగా ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తప్పనిసరి.

ఎండాకాలంలో గర్భవతులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే..


గర్భధారణ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వాతావరణం మారుతున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి అయితే ఎండాకాలంలో గర్భిణీగా ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తప్పనిసరి.

ఎండాకాలంలో గర్భిణీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కచ్చితంగా రెట్టింపు అవుతాయని చెప్పాలి ఈ సమయంలో తల్లి బిడ్డ ఆరోగ్యం గా ఉండటానికి కొన్ని నియమాలు పాటించాలి.

ఎండాకాలం అయినప్పటికీ గర్భిణి మరీ చల్లగా ఉండే నీటితో స్నానం చేయడం తగదు శరీరానికి ఇబ్బంది కలిగించని మనసుకి ప్రశాంతంగా ఉండే విధంగా నీటి ఉష్ణోగ్రత ఉండే విధంగా చూసుకోవాలి.

వేసవికాలంలో చెమట ఎండ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అందుకే ఈ సమయంలో రోజు కచ్చితంగా రెండు పుట్ల స్నానం చేసే నీటిలో సువాసన వెదజల్లే తేలికపాటి నూనె రెండు చుక్కలు వాడటం వల్ల మనసుకి ఉపశమనంగా అనిపిస్తుంది.

ఈ సమయంలో మెడ చుట్టూ చర్మం నల్లగా తలసరిగా మారి చెమటతో ఇబ్బంది పెడుతుంది అందుకే కూలింగ్ తో వస్తున్న వ్రేప్ లను ఉపయోగించటం ఉత్తమం.

శరీరానికి ఇబ్బంది పెట్టని తేలికపాటి నులు వస్త్రాలు ధరించడం అన్నిటికన్నా ఉత్తమం.

ఈ సమయంలో తేలికపాటి వ్యాయామాలు చేయాలని వైద్యులు సూచిస్తారు అందుకే ఎండ తగలకముందే ఉదయాన్నే కొంత వ్యాయామం చేసుకోవడం మంచిది.

ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి అన్ని రకాల పండ్ల రసాలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

వీలైతే మధ్యాహ్నం సమయంలో కాస్త నిద్రపోవాలి ఈ సమయంలో మరి ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయటకు వెళ్లకపోవడమే ఉత్తమం.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.