ప్రయాణాల్లో వాంతులా? అయితే ఇలా చేయండి

చాలామంది ప్రయాణమంటే బెంబేలెత్తిపోతారు. కొందరిలో తెలియని భయం ఉంటుంది. ఎందుకంటే బస్సో, కారో ఎక్కగానే వికారం, వాంతులు ఇబ్బంది పెట్టేస్తాయి. అలాగే రైలు ఎక్కినా కూడా కొందరికి వాంతులు అయిపోతాయి. కారులో ఉన్న

ప్రయాణాల్లో వాంతులా? అయితే ఇలా చేయండి


చాలామంది ప్రయాణమంటే బెంబేలెత్తిపోతారు. కొందరిలో తెలియని భయం ఉంటుంది. ఎందుకంటే బస్సో, కారో ఎక్కగానే వికారం, వాంతులు ఇబ్బంది పెట్టేస్తాయి. అలాగే రైలు ఎక్కినా కూడా కొందరికి వాంతులు అయిపోతాయి. కారులో ఉన్న ఏసీ పడక చాలామందికి తలనొప్పి వచ్చేస్తుంది. దాంతోపాటే చికాకు, వికారంగా అనిపిస్తుంది. ఇంకా వాంతులు అవస్థను కలిగిస్తాయి.

Motion sickness: The right position to sit and ways you can control it -  Times of India

ఒక్కోసారి మన మైండ్‌....ఒకదానికి అలవాటు పడిపోతే అదే చేస్తుంది. ప్రయాణాలు మొదలు పెట్టేటప్పుడే వాంతులు అయిపోతాయేమోననే భయంతో స్టార్ట్‌ చేస్తాం. దానివల్ల వాహనం ప్రారంభం కాగానే ఆటోమేటిక్‌గా అయిపోతాయి. అంతేకాకుండా ఎవరైనా పక్కన వాంతులు చేసుకున్నా....ఆ వాసన తట్టుకోలేక కొందరికి వాంతులు అవుతుంటాయి.

ఇంకా సైంటిఫిక్‌గా ఆలోచిస్తే..కళ్ల నుంచి, లోపలి చెవి నుంచి మెదడుకు అందే సమాచారం మధ్య తేడా ఉండటమే వాంతులకు ప్రధాన కారణం. కాళ్లు, చేతులు నుంచి వచ్చే సంకేతాలతో మన శరీరం కదులుతుందా? లేదా? అనేది మెదడు తెలుసుకుంటుంది. మరోవైపు లోపలి చెవిలోని ఎండోలింపు అనే ద్రవం శరీరం కదులుతున్న విషయాన్ని గ్రహించి, మెదడుకు చేరవేస్తుంటుంది. మనం ప్రయాణిస్తున్నా కదలటం లేదని కళ్ల నుంచి సమాచారం మెదడుకు అందితే.. తికమకపడుతుంది. దీంతో వాంతులు, వికారం వంటి లక్షణాలు శరీరంలో తలెత్తుతాయి.

కాబట్టి ప్రయాణంలో వాంతులు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాంతులు అవుతాయనే భయం ఉంటే....చేతిలో ఒక నిమ్మకాయ పట్టుకోవాలి. ఆ వాసన వికారం నుంచి దూరం చేస్తాయి. అందుకే పాత రోజుల్లో బయటకు వెళ్తే దిష్టి కోసం నిమ్మకాయ ఉంచుకోవాలి అంటారు. దానికి ఇది ఒక కారణం అయిఉండొచ్చు కదా. అందుకే పాత రోజుల్లో పెద్దలు పెట్టిన ప్రతీ ఆచారం వెనుక ఒక సైంటిఫిక్‌ రీజన్‌ ఉండనే ఉంటుంది.

అంతేకాకుండా తినగానే ప్రయాణం మొదలెట్టకూడదు. ఎందుకంటే బయట వచ్చే కాలుష్యం నోట్లోకి వెళ్లి ఆహారాన్ని పొల్యూట్‌ చేసి ఇబ్బంది పెట్టేలా చేస్తాయి. కడుపు మెలిపెట్టేసి వాంతులు అయ్యేలా చేస్తాయి. శరీరంలో ఆందోళన, ఒత్తిడి, నిస్సత్తువతో ఇవి మరింత తీవ్రమవుతాయని ఓ అధ్యయనంలో తేలింది. అలాగే ఘాట్‌ రోడ్లు, ఎక్కువసేపు ప్రయాణం, ఎగుడుదిగుడు రోడ్లు వల్ల వాంతులు అవుతాయి.

కారు, బస్సు ప్రయాణం అనుకున్నప్పుడు ముందు సీటులో కూర్చోవాలి. దృష్టిని  ఒకే వైపు కేంద్రీకరిస్తే మంచిది. లేకపోతే మెదడును మైమరిపించే పాటలు వింటూ ఉంటే....ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. వీలైతే కళ్లు మూసుకోవాలి లేదా నిద్రపోవాలి. దూర ప్రాంతాలకు వెళుతున్నప్పుడు ఎక్కువగా నీరు తాగాలి. ఉప్పు లేదా పంచదార కలిపిన నీళ్ల వెంటపట్టుకోవాలి. బయటదొరికే ఫుడ్‌ తినకూడదు. లేకపోతే జీలకర్ర గానీ, సోంపు గానీ నోట్లో వేసుకోవాలి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.