వెనుక నడక వల్ల లాభాలు తెలిస్తే షాక్ అవుతారు.. 

ఉద్యోగాలు చేసే చాలామంది గంటలు తరబడి కాలు కిందకి పెట్టుకొని కుర్చీల పైన కూర్చుంటూ ఉంటారు. ప్రయాణాల్లో సైతం ఇదే సమస్య తలెత్తుతుంది. దీని వలన తెలియవుండానే రక్తప్రసరణ వ్యవస్థలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కండరాలకు సంబంధించిన సమస్యలు సైతం వచ్చే అవకాశం ఉంది. ఇలా జరగటం వల్ల అక్కడ ఉన్న రక్తనాళాలు

వెనుక నడక వల్ల లాభాలు తెలిస్తే షాక్ అవుతారు.. 


ఉద్యోగాలు చేసే చాలామంది గంటలు తరబడి కాలు కిందకి పెట్టుకొని కుర్చీల పైన కూర్చుంటూ ఉంటారు. ప్రయాణాల్లో సైతం ఇదే సమస్య తలెత్తుతుంది. దీని వలన తెలియవుండానే రక్తప్రసరణ వ్యవస్థలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కండరాలకు సంబంధించిన సమస్యలు సైతం వచ్చే అవకాశం ఉంది. ఇలా జరగటం వల్ల అక్కడ ఉన్న రక్తనాళాలు అన్ని బలహీనంగా మారిపోతాయి. వెరికోస్ వైన్స్ సమస్య దీని వల్లనే తలెత్తుతాయి. కండరాల నొప్పులు, అక్కడ ఉండే పిక్కలు గట్టిగా పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. తగినంత వ్యాయామం లేకపోవడం వల్ల భవిష్యత్తులో ఎన్నో అనారోగ్యాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యను తేలిగ్గా ఎదుర్కోవాలంటే నడక ఉత్తమమైన మార్గం అందులో వెనక్కి నడవడం మరిన్ని ఫలితాలను ఇస్తుంది.
The Benefits of Walking Backward
 
నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం తెలిసిందే అయితే రోజు కాస్త సమయం వెనక్కి నడవటం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ముందుకి గంట నడిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వెనక్కి పావుగంట నడిస్తే వచ్చేస్తాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. 
వెనక్కి నడిచినప్పుడు కండరాల పైన ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. దీని వలన రక్తం పైకి ప్రసరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆడవారిలో సైతం వెరికోస్ వైన్స్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారికి వెనక్కి నడక చక్కని పరిష్కారం.
కండరాలు, పిరుదుల వద్ద కొవ్వు ఎక్కువగా పట్టి ఉన్నవారు సైతం వెనక్కి నడవడం వల్ల కొవ్వు తొందరగా కరిగే అవకాశం ఉంటుంది. మధుమేహం సమస్యతో బాధపడే వారికి తిమ్మిర్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎలాంటి వారు వెనక్కి నడవడం వల్ల ఆ సమస్య అదుపులో ఉంటుంది.
మగవారు 90, 100 కేజీలు దాటి ఉంటే వెరికోస్ వైన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆడవారు 70 కేజీలు దాటి ఉంటే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కొంచెం ఎత్తు తక్కువగా ఉన్నవారు బరువు ఎక్కువగా ఉంటే వారిలో కండరాలు దగ్గర విపరీతంగా కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి వారిలో ఎక్కడకక్కడ కొవ్వు పేరుకుపోయి రక్తనాళాలు మూసుకుపోతూ ఉంటాయి. దీనివలన రక్తం ముందుకి కాకుండా వెనక్కి ప్రవహించే అవకాశం ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలి అంటే వెనక్కి నడవడం ఎంతో మంచిది.
రక్తప్రసరణ సక్రమంగా లేనప్పుడు కొవ్వు పేరుకుపోయినప్పుడు ఏవైనా కొన్ని సందర్భాల్లో రక్తనాళాలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. అయితే శరీరం మళ్ళీ కొత్త రక్తనాళాల్ని పక్క నుంచి పుట్టించే అవకాశం ఇలాంటి వ్యాయామాలు ఎక్కువగా ఉంటుంది.
వెరికోస్ వైన్స్ ఉన్న వారిలో రక్తప్రసరణ సక్రమంగా ఉండక ఆ రక్తనాళాల్లో కార్బన్డయాక్సైడ్ స్థాయిలు పెరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉండటం వల్ల చర్మం సైతం రంగు మారే అవకాశం ఉంటుంది. వెనక్కి నడిచినప్పుడు ఆ భాగంలో పేరుకుపోయిన చెడ్డ రక్తమంతా పైకి వేగంగా సరఫరా అవడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రదేశంలో దురద వాపు తగ్గటానికి ఈ వెనక్కినడక ఎంత సహాయం చేస్తుంది.
కొందరికి కాళ్ల భాగంలో విపరీతంగా నీరు చేరిపోతూ ఉంటుంది. రక్తనాళాలు కండరాలు మధ్య నీరు పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణ తగ్గిపోతుంది.
సాధారణంగా ఈ వ్యాయమం ప్రారంభించే మొదట్లో కండరాల నొప్పులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నెమ్మది నెమ్మదిగా సమయాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. వేరికోస్ వైన్స్ సమస్యతో బాధపడేవారు రోజు కాసేపు మంచం మీద పడుకొని పైకి కాళ్లు పెట్టి ఒక పది నిమిషాల్లో ఉంచడం వల్ల రక్తప్రసరణ వెనక్కి సక్రమంగా జరుగుతుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.