రక్తహీనత.. కారణాలు.. లక్షణాలు.. నివారణ.. !

శరీరంలో తగినంత హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్య Anemia అంటారు.. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు

రక్తహీనత.. కారణాలు.. లక్షణాలు.. నివారణ.. !


శరీరంలో తగినంత హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్య Anemia అంటారు.. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా చిన్నపిల్లల్లో గర్భిణీల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది.. 

ఎంత ఉండాలి.. 

దేశంలో చాలావరకు మహిళలు చిన్నపిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారని తెలుస్తోంది నిజానికి 30% మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారని తాజా అధ్యయనాలు తెలిపాయి అయితే.. హిమోగ్లోబిన్ నార్మల్ లెవెల్ 14 నుంచి 15 జీ/డీఎల్‌గా నిర్దేశించారు. ఇది 12 కంటే తక్కువగా ఉన్నప్పుడు రక్తహీనతతో బాధపడుతున్నట్టు గుర్తిస్తారు. 10 కంటే తక్కువగా ఉంటే రక్తహీనత ఎక్కువగా ఉన్నట్టు, 7 జీ/డీఎల్ కంటే తక్కువగా ఉంటే రక్తహీనత తీవ్రంగా ఉన్నట్టు పరిగణిస్తారు నిపుణులు.. 

లక్షణాలు.. 

అయితే ఐరన్ లోపం వల్ల రక్తహీనత వస్తుంది దీని వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు సైతం చుట్టూ ముడతాయి ముఖ్యంగా ఏ పని పైన ఏకాగ్రత ఉండకపోవడం శారీరకంగా చాలా నీరసంగా ఉండటం జరుగుతుంది అలాగే ప్రతి విషయాన్ని తొందరగా మరిచిపోవడం, శరీరం రంగు మారడం వంటివి జరుగుతాయి శ్వాస తీసుకోవడంలో సైతం ఇబ్బందులు ఏర్పడతాయి.. అలాగే గర్భిణీ మహిళల్లో ఐరన్ లోపం ఉంటే పిండం ఎదుగుదలలో లోపాలు వస్తాయి అందుకే వీరికి ఐరన్ టాబ్లెట్లు ఇస్తూ ఉంటారు.. తక్కువ బరువుతో శిశువు జన్మించడం లేదా పుట్టే బిడ్డలో అనారోగ్య సమస్యలు తలెత్తడానికి ఐరన్ లోపం కారణమవుతుంది.. ముఖ్యంగా మహిళల్లో ప్రతి నెల వచ్చే నెలసరి కారణంగా ఐరన్ లోపం తలెత్తుతుంది

ఆహారం.. 

రక్తహీనత దరి చేరకుండా ఉండాలి అంటే..  దీనికి సంబంధించిన ఆహార పదార్థాలను తరచూ తీసుకోవాలి.. రాగులు, గోధుమలు, శనగ పప్పు, బఠానీ, తోటకూర, గొర్రె కాలేయం, మాంసం, పాలకూర మునగాకు బాదం పప్పులు వంటి ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటూ ఉండాలి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.