రాత్రిపూట పెరుగు తింటున్నారా..! ఈ విషయాలు తెలుసుకోండి..

రోజు పెరుగన్నం తింటే ఎన్నో రకాల ఆనారోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు అంటున్నారు.. పెరుగులో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది.. నిజానికి ఒక వయసు వచ్చిన తర్వాత శరీరం..

రాత్రిపూట పెరుగు తింటున్నారా..! ఈ విషయాలు తెలుసుకోండి..


తెలుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా జీర్ణక్రియనే మెరుగుపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అయితే ఆరోగ్యానికి తినేటప్పుడు మాత్రం కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలని తెలుస్తోంది.. 

రోజు పెరుగన్నం తింటే ఎన్నో రకాల ఆనారోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు అంటున్నారు.. పెరుగులో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది.. నిజానికి ఒక వయసు వచ్చిన తర్వాత శరీరం పాలను అరిగించుకునే సామర్థ్యాన్ని కోల్పోతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది పాలను చిన్న పిల్లలు మాత్రమే జీర్ణం చేసుకోగలుగుతారు..  పెద్దవాళ్లలో పాలు పెరుగుగా మారిన తర్వాత మాత్రమే జీర్ణం అవుతుంది..

రోజూ కప్పు పెరుగు తింటే శరీరానికీ కావాల్సిన ప్రోటిన్స్ అందుతాయి.. అలాగే పెరుగు జీర్ణక్రియను మెరుగుపరిచి శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. అంతేకాకుండా అరుగుదల సమస్య నుంచి బయట పడేస్తుంది. రోగనిరోధక శక్తిని సైతం పెంచుతుంది. అలాగే పాల సంబంధిత పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో బి 12 లోపం లేకుండా ఉంటుంది.. అందుకే రోజు పెరుగును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి.. అయితే శరీరానికి ఎంతో మేలు చేసే పెరుగు విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా చలికాలంలో ఫ్రిజ్లో పెట్టిన పెరుగును తీసుకోకపోవడం మంచిది. అంతేకాకుండా రాత్రి సమయంలో పెరుగును తీసుకోవడం వల్ల పలు రకాల సమస్యలు వస్తాయని తెలుస్తోంది..

అయితే అలాగే పెరుగు కూడా జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావడానికి జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందటానికి పెరుగు ప్రముఖ పాత్ర పోషిస్తుంది.. నిత్యం పెరుగని తీసుకోవడం వల్ల శరీరంలో వేడి అదుపులో ఉండి జీర్ణాశయంలో మేలు చేసే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.. 

అయితే కొందరు రాత్రిపూట కూడా పెరుగని తీసుకుంటూ ఉంటారు..  అయితే అందరూ కాకపోయినా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగుని తీసుకోకపోవడమే మంచిది.. జలుబు దగ్గు వంటి సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగుని ఆహారంలో భాగం చేసుకోవద్దని తెలుస్తుంది అంతేకాకుండా అలర్జీతో బాధపడేవారు కూడా పెరుగును తీసుకోకపోవడం మంచిది.. అలాగే ఆస్తమా సైనస్ వంటి సమస్యలు ఉన్నవారు కూడా రాత్రిపూట పెరుగును తీసుకోకూడదు.. అలాగే తీరకకాలం వేధించే సమస్యలు ఉన్నవారు కూడా రాత్రి కూడా పెరుగుకు దూరంగా ఉండటం మంచిది..  అలాగే తప్పనిసరిగా పెరుగు తీసుకునే అలవాటు ఉన్నవారు పెరుగు ఒక బదులు మజ్జిగలో జీలకర్ర పొడి వేసుకొని తీసుకున్న మంచి ఫలితాలు ఉంటాయి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.