ప్యాంక్రియాటిక్ క్యాన్సర్.. లక్షణాలు

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్.. లక్షణాలు


ప్యాంక్రియాటిక్ క్యాన్సర్.. అయితే దీన్ని తొందరగా గుర్తించాలి అంటే శరీరంలో జరిగే కొన్ని మార్పుల్ని గుర్తించాల్సిన అవసరం ఉందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. 

పాంక్రియాస్ కడుపు వెనకభాగంలో ఉంటుంది. అందుకే ఇక్కడ వచ్చే నొప్పిని నిర్లక్ష్యం చేయరాదు. ఇది క్రమంగా పెరుగుతూ ఉంటుంది. తరచూ ఎవరైతే కడుపునొప్పితో బాధపడుతూ ఉంటారో వారిలో పాంక్రియాటిక్ క్యాన్సర్‌ ప్రారంభమవుతుందేమో తెలుసుకోవాలి.. అలాగే ఏ క్యాన్సర్ పాంక్రియాస్ చుట్టూ ఉన్న నరాలకు సోకినప్పుడు వెన్న నొప్పి ప్రారంభం అవుతుంది.. అలాగే ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు చర్మంలో  బైలురుబిన్ పెరిగి చర్మం మొత్తం దురద పెడుతుంది అలాగే జాండీస్ కారణంగా చర్మం మొత్తం పసుపు రంగులోకి మారుతూ ఉంటుంది.. 

అలాగే బరువు తగ్గడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి కానీ ఆకస్మాత్తుగా బరువు తగ్గి పై లక్షణాలు కనిపిస్తే మాత్రం ఈ క్యాన్సర్ ఉందేమో చెక్ చేయించుకోవడం మంచిది. అలాగే దీని వలన కడుపులో ట్యూమర్ ఏర్పడుతుంది కాబట్టి ఎప్పుడు ఒత్తిడిగా ఉండి పెద్దగా ఆకలి అనిపించదు.. 

అలాగే నీళ్లలా విరేచనాలు, మలంలో విపరీతమైన దుర్వాసన ఉండడం పాంక్రియాటిక్ క్యాన్సర్‌కు లక్షణాలు.  అలాగే చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారినట్లయితే అనుమానించల్సిందే.. అలాగే కాలేయ వ్యాధి, హెపటైటిస్ వంటి పరిస్థితులు కామెర్లను కలిగించవచ్చు. 
అలాగే కొన్ని సార్లు ముదురు రంగుంలో మూత్రం రావడం కామెర్లకు సంకేతంగా చాలా మంది అనుకుంటారు. కానీ బైలిరుబిన్ స్థాయి పెరగడం వల్ల మూత్రం రంగు బ్రౌన్ కలర్‌లోకి వెళుతుంది. అలాగే రక్తం గడ్డ కట్టడం వంటి లక్షణాలు ఉంటే కూడా ఈ క్యాన్సర్ ఉందేమో తెలుసుకోవాలి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.