Garlic : వెల్లుల్లి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే లాభాలు ఇవే..!

Garlic భారతీయ వంటింట్లో నిత్యం ఉండే garlic ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. ఆరోగ్య సమస్యలను దూరం చేయటంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది.

Garlic : వెల్లుల్లి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే లాభాలు ఇవే..!
benefits of making garlic a part of food


Garlic : పురాతన కాలం నుంచి భారతీయ వంటకాల్లో భాగం అయిపోయింది garlic.. రుచికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే garlic ని రోజు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో  garlic ను ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం..

వెల్లులి భారతీయ వంటింట్లో నిత్యం ఉండే వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. ఆరోగ్య సమస్యలను దూరం చేయటంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. అలాగే దీంట్లో ఉండే ఆంటీ వైరల్ గుణాలు వర్షాకాలం చలికాలంలో వచ్చే ఎన్నో రుగ్మతల నుండి కాపాడుతుంది.. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థం శరీరానికి ఔషదంగా పనిచేస్తుంది. అలాగే క్యాన్సర్, గుండె సంబంధ వ్యాధులను, మధుమేహాన్ని తగ్గించడంలోనూ వెల్లుల్లి ప్రముఖ పాత్ర వహిస్తుంది..  

అలాగే రోజు ఉదయాన్నే రెండు పచ్చి వెల్లుల్లి  తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. అలాగే శరీరానికి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా వెల్లుల్లి సహకరిస్తుంది.. బాలింతలు వెల్లుల్లి పొడిని అన్నంలో కడుక్కుని తినడం వల్ల డెలివరీ అనంతరం వచ్చే చాలా సమస్యలను ఎదుర్కోవచ్చు.. ఇందులో ఉండే యాంటీ క్లాటింగ్ గుణాలు శరీరం లోపల రక్తం గడ్డకట్టకుండా కాపాడుతాయి. ముఖ్యంగా గుండె జబ్బుతో బాధపడే వారు వెల్లుల్లిని రోజూ తినడం వల్ల గుండెకు రక్తప్రసరణ మెరుగుపడి..ఆరోగ్యంగా ఉంటారు.

అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు రోజు కచ్చితంగా వాటికి సంబంధించిన మందులు వాడాల్సి ఉంటుంది. అయితే వీటితో పాటు ఉడికించిన వెల్లుల్లి తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని తెలుస్తోంది. అలాగే చలికాలంలో వర్షాకాలంలో వచ్చే జలుబుని నియంత్రించడంలో, శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తనాళాల్లో ఏర్పడే సమస్యల్ని తగ్గిస్తుంది. క్యాన్సర్ని నియంత్రించడంలో కూడా వెల్లుల్లి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను తిని గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల రక్తం శుభ్రపడుతుంది. శరీరంలో ఏర్పడే ఎలాంటి అవాంతరాలనైనా నియంత్రించగల శక్తి వెల్లులికి ఉంటుంది. ముఖ్యంగా గుండె, గుండె సంబంధించిన రక్తనాళాలను వాటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే తరచూ ఆహారంలో భాగంగా వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తోంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.