Himalayan garlic : హిమాలియన్‌ వెల్లుల్లితో షుగర్ కంట్రోల్‌ చేయొచ్చట.. ఇంకా ఎన్నో లాభాలు.. 

Himalayan garlic గురించి ఎప్పుడైనా విన్నారా.. ఇది కొలెస్ట్రాల్‌, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల‌ను త‌గ్గించ‌డంలో అద్భుతంగా ప‌నిచేస్తుంది. దీన్నే కాశ్మీరీ వెల్లుల్లి అని, జ‌మ్మూ వెల్లుల్లి అని పిలుస్తారు.

Himalayan garlic : హిమాలియన్‌ వెల్లుల్లితో షుగర్ కంట్రోల్‌ చేయొచ్చట.. ఇంకా ఎన్నో లాభాలు.. 
Control sugar with Himalayan garlic


Himalayan garlic : వెల్లుల్లి ఉండే పోషకాలు గురించి మన అందరికి తెలుసు..వంటల్లోనూ బానే వాడుకుంటాం.. కానీ మీరు Himalayan garlic గురించి ఎప్పుడైనా విన్నారా.. ఇది కొలెస్ట్రాల్‌, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల‌ను త‌గ్గించ‌డంలో అద్భుతంగా ప‌నిచేస్తుంది. దీన్నే కాశ్మీరీ వెల్లుల్లి అని, జ‌మ్మూ వెల్లుల్లి అని పిలుస్తారు. మ‌న శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఏ రోజు కారోజు పెరిగిపోతుంటాయి. కానీ ఆరోగ్య‌వంతుల్లో అవి స‌రైన స్థితిలోనే ఉంటాయి. అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారిలోనే వాటి లెవ‌ల్స్ పెరుగుతాయి. అలాంటి వారు హిమాల‌య‌న్ వెల్లుల్లిని తింటే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌, ట్రై గ్లిజ‌రైడ్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
వైద్య నిపుణులు చెబుతున్న ప్ర‌కారం.. హిమాల‌య‌న్ వెల్లుల్లిని తింటే ద‌గ్గు, జ‌లుబు న‌యం అవుతాయి. అలాగే ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చు. ఈ వెల్లుల్లిలో అలినేజ్‌, అలీన్ అనే స‌మ్మేళ‌నాలు ఉంటాయి. అలాగే మ‌రో శ‌క్తివంత‌మైన అల్లిసిన్ అనే స‌మ్మేళ‌నం కూడా ఉంటుంది. ఇది బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్ల‌ను త‌గ్గిస్తుంది.

వెల్లుల్లిలో డైఅలైల్ ట్రై స‌ల్ఫైడ్ అనే ఆర్గానో స‌ల్ఫ‌ర్ స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేస్తుంది. క్యాన్స‌ర్‌కు వ్య‌తిరేకంగా పోరాడుతుంది. అందువ‌ల్ల క్యాన్స‌ర్లు రాకుండా చూసుకోవ‌చ్చు.
ఈ వెలుల్లిపై ప‌రిశోధ‌నలు కూడా జరిగాయి.. రోజుకు 2-3 హిమాల‌య‌న్ వెల్లుల్లి రెబ్బ‌ల‌ను త‌ర‌చూ తింటుంటే షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ఈ వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే స‌మ్మేళం బి విట‌మిన్ల‌తో క‌లిసి క్లోమం ఎక్కువ ఇన్సులిన్‌ను ఉత్ప‌త్తి చేసేలా ప్రోత్స‌హిస్తుంది. దీంతో డ‌యాబెటిస్ అదుపులోకి వ‌స్తుంది.
హిమాలయన్ వెల్లుల్లి శరీరంలో ఫలకాలు, గడ్డలు ఏర్పడకుండా నిరోధించడంలో కూడా సహాయపడుతుంది. ఎందుకంటే ఇది రక్తం సాంద్రతను తగ్గించగలదు. ఈ వెల్లుల్లిలో హైడ్రోజన్ సల్ఫైడ్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది, ఇది కండరాలకు విశ్రాంతినిస్తుంది. వెల్లుల్లి అధిక రక్తపోటును నియంత్రించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది.
ఈ విధంగా హిమాల‌య‌న్ వెల్లుల్లిని రోజూ తింటుంటే అనేక వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.