World Environment Day 2023: ఈ ఏదాడి థీమ్‌ #BeatPlasticPollution

ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఏటా జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం. ఇది 50వ దినోత్సవం. పర్యావరణం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ప్రజలు పర్యావరణంపై అవగాహన కల్పించేందుకే ఈరోజును ఇలా సెలబ్రేట్‌ చేసుకుంటారు. అనేక స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ సంస్థలు పర్యావరణం గురించి అవగాహన కల్పించడానికి

World Environment Day 2023: ఈ ఏదాడి థీమ్‌ #BeatPlasticPollution


ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఏటా జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం. ఇది 50వ దినోత్సవం. పర్యావరణం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ప్రజలు పర్యావరణంపై అవగాహన కల్పించేందుకే ఈరోజును ఇలా సెలబ్రేట్‌ చేసుకుంటారు. అనేక స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ సంస్థలు పర్యావరణం గురించి అవగాహన కల్పించడానికి ముందుకొస్తాయి. ఈ రోజు ప్రాముఖ్యత గురించి మనం కొంచెం తెలుసుకుందాం.!
World Environment Day: Protect our Environment and Health

ఈ ఏడాది థీమ్‌..

ప్రపంచ పర్యావరణ దినోత్సవం అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. జూన్ 5, 2023 థీమ్ #BeatPlasticPollution అనే నినాదంతో ప్లాస్టిక్ కాలుష్యానికి సంబంధించిన పరిష్కారాలపై దృష్టి పెడుతుంది. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి నెదర్లాండ్స్ ప్రభుత్వం మద్దతునిస్తోంది. ప్లాస్టిక్ రీసైక్లింగ్ గురించి ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకుంటున్న దేశాల్లో ఇదీ కూడా ఒకటి.

అలా మొదలైంది..

ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) నేతృత్వంలో, ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5, 1973 న మొదటిసారిగా జరుపుకున్నాం. ఒకే భూమి అనే థీమ్ తో ఇది మొదలుపెట్టారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ఒకచోట చేర్చి, భూమిని రక్షించే, పునరుద్ధరించే ప్రయత్నంలో వారిని భాగస్వామ్యుల్ని చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
“ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 400 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది, అందులో సగం ఒక్కసారి మాత్రమే ఉపయోగించడానికి వీలుగా రూపొందించబడిందని ఐక్యరాజ్య సమితి చెప్తుంది. అందులో 10 శాతం కంటే తక్కువ రీసైకిల్ చేయబడుతోంది. 19-23 మిలియన్ టన్నుల దాకా ప్లాస్టిక్ సరస్సులు, నదులు, సముద్రాలలో పేరుకుపోతోంది. మైక్రోప్లాస్టిక్‌లు ఆహారం, నీరు, గాలిలోకి చేరుతున్నాయి. ఈ గ్రహం మీద ఉన్న ప్రతి వ్యక్తి సంవత్సరానికి 50,000 కంటే ఎక్కువ ప్లాస్టిక్ కణాలను వినియోగిస్తారని అంచనా.
గ్లోబల్ వార్మింగ్‌ను అదుపులో ఉంచడానికి 2030 నాటికి గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను సగానికి తగ్గించాలి. ఎలాంటి చర్యలు లేకుండా, సురక్షితమైన మార్గదర్శకాలకు మించి వాయు కాలుష్యం పెరగడం ఈ పదేండ్లలో యాభై శాతం పెరుగుతుంది. 2040 నాటికి నీటి పర్యావరణ వ్యవస్థల్లోకి ప్రవహించే ప్లాస్టిక్ వ్యర్థాలు మూడు రెట్లు పెరుగుతాయనేది అంచనా.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.