healthy kidneys ఆరోగ్య‌క‌ర‌మైన కిడ్నీల కోసం తీసుకోవాల్సిన‌ ఆహారం, జాగ్ర‌త్త‌లు

రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపుతాయి కిడ్నీలు ( Kidneys ). కిడ్నీలు అత్యంత సున్నితమైన అవయవం.కిడ్నీ ఆరోగ్యానికి  సమస్యలు రాకుండా పాటించాల్సినవి, కిడ్నీకి మేలు చేసే  ఆహార పదార్ధాలు

healthy kidneys ఆరోగ్య‌క‌ర‌మైన కిడ్నీల కోసం తీసుకోవాల్సిన‌  ఆహారం, జాగ్ర‌త్త‌లు


రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపుతాయి కిడ్నీలు ( Kidneys ). కిడ్నీలు శరీరం యొక్క అత్యంత సున్నితమైన అవయవం. పైగా ఇది చాలా ముఖ్యమైన అవయవం కూడా. కిడ్నీ ( kidneys ) సమస్యలు రాకుండా జాగ్రత్త పడటం చాలా మంచిది. కిడ్నీలు మెరుగ్గా పని చేయడం అత్యవసరం. మనం తీసుకునే ఆహార పదార్థాలు, జీవనశైలి కిడ్నీ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. 

ఇక కిడ్నీ ఆరోగ్యానికి  సమస్యలు రాకుండా జాగ్రత్త గా ఉండాలంటే పాటించాల్సినవి, కిడ్నీకి మేలు చేసే  ఆహార పదార్ధాలు గురించి చూసేద్దాం.

కూరగాయలు, పండ్లు

ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా కిడ్న  సమస్యలు ఉన్న వాళ్ళు పొటాషియమ్ తక్కువగా ఉండేట్టు చూసుకోండి. ముఖ్యంగా ఆపిల్, బొప్పాయి బాగా సహాయం చేస్తాయి.


వెల్లుల్లి

వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కనుక వంటల్లో ఎక్కువగా వెల్లుల్లి వాడితే మంచిది. ఇవి రక్తాన్ని శుద్ది చేస్తాయి. కిడ్నీల నుంచి అనవసర వ్యర్థాలు బయటకు పంపించేయడానికి కూడా తోడ్పడుతుంది. అలానే వెల్లుల్లి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

ఆపిల్

ఆపిల్ పండ్ల వలన కూడా మనకి చక్కటి పోషకాలు అందుతాయి. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు దీనిలో సమృద్ధిగా ఉంటాయి. ఆపిల్ పండ్లను తినడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బు, కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించడం ఇలా ఎన్నో లాభాలు పొందచ్చు.


పుట్టగొడుగులు

పుట్టగొడుగుల్లో విటమిన్-బి, విటమిన్ డి సమృద్ధిగా వున్నాయి. ఇవి కిడ్నీ జబ్బులను దూరం చేస్తాయి. రోగ నిరోధక శక్తి తో పాటు ఎన్నో ప్రయోజనాలు పుట్టగొడుగులుతో మనం పొందొచ్చు. ( ఇలా ఈజీగా మష్రూమ్ బ్రౌన్ రైస్ తయారుచేసుకోండి..! )

ఓట్స్‌

ఓట్స్ లో పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. ఇందులో బీటా గ్లూకాన్ అనే నీటిలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఓట్స్ వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ముప్పు తగ్గుతుంది. కనుక రెగ్యులర్ గా ఓట్స్ తీసుకున్నా చక్కటి లాభాలు పొందొచ్చు. కిడ్నీ సమస్యల నుండి దూరంగా ఉండచ్చు.

జాగ్రత్తలు

బీపీ ఉన్నవాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలి

మీకు బీపీ ఉంటే రెగ్యులర్ గా బీపీని చెక్ చేయించుకోవాలి. అదేవిధంగా డాక్టర్ సలహాలు తీసుకుని మందులు వాడండి. దీనితో కిడ్నీ సమస్యలు రాకుండా ముందు నుండి జాగ్రత్త పడొచ్చు. అదే విధంగా డయాబెటిస్ ఉన్న రోగులకు ఈ మూత్రపిండాల సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్లు కూడా జాగ్రత్త పడటం మంచిది.

రెగ్యులర్ గా వ్యాయామం

వ్యాయామం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు. కిడ్నీ సమస్యలు రాకుండా కూడా వ్యాయామం సహాయపడుతుంది.

ఎక్కువ నీళ్ళు తీసుకోవడం

ప్రతి రోజూ ఎక్కువ నీళ్ళు, పండ్లరసాలు తీసుకోవడం వల్ల కిడ్నీలకు చాలా మేలు కలుగుతుంది ఎక్కువగా మూత్ర విసర్జన చేయడం వల్ల కిడ్నీలో సోడియం, యూరియా కంటెంట్ తగ్గుతుంది దీనితో కిడ్నీలో రాళ్లు కూడా ఏర్పడకుండా చూసుకోవచ్చు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి ఎక్కువ నీరు తాగాలి. శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురవద్దు. రోజూ 7-8 గ్లాసుల నీళ్లు తాగాలి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.