Soap Nuts Benefits : ఈ షాంపూ తో తలస్నానం చేస్తే జుట్టు తప్పక తప్పకుండా పెరుగుతుంది.. 

Soap Nuts Benefit : ఈ రోజుల్లో మారిపోతున్న ఆరోగ్య శైలి, పెరిగిపోతున్న కాలుష్యంతో ప్రతి ఒక్కరిని జుట్టు ఊడిపోయే సమస్య వేధిస్తుంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఎవరికి అర్థం

Soap Nuts Benefits : ఈ షాంపూ తో తలస్నానం చేస్తే జుట్టు తప్పక తప్పకుండా పెరుగుతుంది.. 
Soap Nuts Benefits


Soap Nuts Benefit : ఈ రోజుల్లో మారిపోతున్న ఆరోగ్య శైలి, పెరిగిపోతున్న కాలుష్యంతో ప్రతి ఒక్కరిని జుట్టు ఊడిపోయే సమస్య వేధిస్తుంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఎవరికి అర్థం కావడం లేదు ముఖ్యంగా ఎన్ని రకాల షాంపూలు వాడినా.. ఏం చేసినా ఈ సమస్య తగ్గటం లేదు. అయితే ఇందుకు సరైన చిట్కా అందరూ వెనక్కి పొమ్మంటున్నారు. అంటే.. పురాతన కాలంలో ఏం వాడేవారో వాటిని ఉపయోగించడం వల్ల ఫలితం ఉంటుందని గట్టిగా చెబుతున్నారు..

సహజ సిద్ధంగా లభించే పదార్థాలు ఉపయోగించడం వల్ల కొంతవరకు లాభం ఉంటుందని తెలుస్తోంది.. ఇందులో మొదటగా ఉండేది కలబంద. కలబంద జుట్టుకు చేసే మేలు అంతా ఇంతా కాదు. తరచూ జుట్టుకు కలబందను రాసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో కలబంద గుజ్జును వేసి దానిని మరిగించి ఆ నూనెను తలకు రాసుకున్న మంచి ఫలితాలు ఉంటాయి.. అలాగే ఎక్కువగా ఆడతా ఉన్నా షాంపూలను బయట దొరికే నూనెలను ఉపయోగించకపోవడం మంచిది.. పోషకాహారం తీసుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు ఊడటాన్ని నివారించవచ్చు.. 

కుంకుడుకాయలు కూడా జుట్టు పెరుగుదలకు మంచి మార్గం.. ఉసిరి, కుంకుడుకాయ, శీకకాయ ఈ మూడింటిని సమపాళ్ళలో తీసుకుని..  నీళ్లలో వేసి మరిగించండి. వీటితో జుట్టును రుద్దుకోవడం వల్ల బలంగా దృఢంగా తయారవుతుంది. సహజసిద్ధంగా లభించే ఈ పదార్థాలు వాడటం వల్ల జుట్టుకు ఎలాంటి హాని ఉండదు.. స్వచ్ఛమైన నూనెలో మందార పువ్వులను వేసి మరిగించిన నూనె తలకు రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. అలాగే జుట్టుకు నిద్ర కూడా సంబంధం ఉంటుంది తగినంత నిద్ర లేనప్పుడు జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది అలాగే రోజు తగనంత నీటిని తీసుకుంటూ సమయానికి నిద్రపోతే ఈ సమస్య అదుపులో ఉంటుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.