Doosara vine : దూసర తీగతో ఆయుర్వేదంలో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసా..?

Doosaravine గురించి ఊర్లల్లో ఉండే వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పంట పొల్లాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ తీగ గ్రామాల్లో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ క‌నిపిస్తుంది. పొద‌ల‌పై తీగ‌లు అల్లుకుంటాయి. చేలు, పొలాల గ‌ట్టుల

Doosara vine : దూసర తీగతో ఆయుర్వేదంలో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసా..?
Doosaravine


Doosara vine గురించి ఊర్లల్లో ఉండే వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పంట పొల్లాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ తీగ గ్రామాల్లో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ క‌నిపిస్తుంది. పొద‌ల‌పై తీగ‌లు అల్లుకుంటాయి. చేలు, పొలాల గ‌ట్టుల మీద పెరుగుతాయి. Doosara vine ల‌ను ఇంట్లోనూ పెంచుకోవ‌చ్చు. పెద్ద‌లు ఈ తీగ ఆకుల ర‌సాన్ని ప‌శువుల గాయాల‌కు రాసేవారు.. దీంతో అవి త్వ‌ర‌గా మానుతాయి. అయితే ఈ తీగ వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం. ఇంగ్లీష్‌ మందులు లేని కాలంలోనే జనాలు ఎక్కువ రోజులు బతికారు.. మరి అప్పుడు రోగాలను నయం చేసింది ప్రకృతి కాదంటారా..? సమస్యలే పెద్దవి..వాటికి పరిష్కారాలు చాలా చిన్నవి..!!
 
సాధార‌ణంగా చాలా మందికి క‌ళ్ల మంట‌, కళ్ల దుర‌ద‌, కంటి రెప్ప‌ల‌పై కురుపులు ఏర్ప‌డుతుంటాయి. అలాంటి వారు దూసర తీగ‌ను బాగా దంచి ర‌సం తీసి ఆ ర‌సాన్ని క‌ను రెప్ప‌ల‌పై రాయాలి. రాత్రి పూట ఇలా చేయాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే గోరు వెచ్చ‌ని నీటితో క‌ళ్ల‌ను శుభ్రం చేసుకోవాలి. ఇలా వారం పాటు చేస్తే అన్ని ర‌కాల కంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయట.

దూస‌ర తీగ ఆకుల ర‌సాన్ని తీసి రోజూ తాగుతుంటే స్త్రీ, పురుషుల్లో హార్మోన్ల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. సంతాన లోపం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.
చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించడంలో దూసర ఆకులు బాగా ప‌నిచేస్తాయి. చ‌ర్మంపై ద‌ద్దుర్లు, దుర‌ద‌, ఎరుపుగా మార‌డంతోపాటు గ‌జ్జి వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఈ ఆకుల ర‌సాన్ని రాయాలి. రోజూ ఇలా చేస్తుంటే సమ‌స్య‌లు త్వ‌ర‌గా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.
చాలా మందికి శ‌రీరంలో అధిక వేడి ఉంటుంది. అలాంటి వారు దూసర తీగ ఆకుల‌ను దంచి ప‌స‌రు తీయాలి. దాన్ని గ్లాసులో వేసి 5 గంట‌ల పాటు అలాగే ఉంచాలి. దీంతో జెల్ త‌యార‌వుతుంది. అందులో కొద్దిగా ప‌టిక‌బెల్లం క‌లిపి తినాలి. ఇలా రెండు రోజుల‌కు ఒక‌సారి చేస్తుంటే శ‌రీరంలోని వేడి బాగా త‌గ్గుతుంది. శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది.
షుగ‌ర్ ఉన్న‌వారికి దూసర ఆకులు బాగా ప‌నిచేస్తాయి. గుప్పెడు ఆకుల‌ను తీసుకుని ఒక పాత్ర‌లో వేసి అందులో కొద్దిగా నీరు పోసి బాగా మ‌రిగించాలి. ఆ తర్వాత ఫిల్టర్‌ చేసి నీళ్లు తాగాలి.. ఇలా రోజూ చేస్తుంటే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.