Linga Donda : స్త్రీలలో సంతానలేమి సమస్యకు లింగ దొండకాయ వరం లాంటిందే..

Linga Donda ను శివ‌లింగిని కాయ‌లు అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటి గింజ‌లు శివ లింగం ఆకారంలో ఉంటాయి. వీటిని శివ‌లింగాలు అని కూడా పిలుస్తారు..

Linga Donda : స్త్రీలలో సంతానలేమి సమస్యకు లింగ దొండకాయ వరం లాంటిందే..
Linga Donda


పొలాల్లోకి వెళ్తే ఎన్ని రకాల మొక్కలు మనకు కనిపిస్తాయి.. పిచ్చి పిచ్చి తీగలు చెట్లకు పాకి ఉంటాయి. కానీ వాటిలో ఎన్నో మంచి ఔషధగుణాలు ఉంటాయి.. మీరు. లింగ దొండకాయను ఊర్లల్లో చూసి ఉంటారు. దీన్ని మనం పిచ్చిదొండకాయ అని లైట్‌ తీసుకుంటాం.. ఇది ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? కానీ మన పెద్దోళ్లు ఈ పిచ్చిదొండకాయ తింటే పిచ్చి ఎక్కుతుంది.. తినకూడదని మనల్లి భయపెట్టేవాళ్లు.. కానీ అది అంతా అపోహ మాత్ర‌మేన‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 
 
లింగ దొండ‌కాయను శివ‌లింగిని కాయ‌లు అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటి గింజ‌లు శివ లింగం ఆకారంలో ఉంటాయి. వీటిని శివ‌లింగాలు అని కూడా పిలుస్తారు.. వీటికి బ‌హుపుత్రి అనే పేరు కూడా ఉంది. ఈ కాయ‌ల్లో ఉండే గింజ‌ల‌లో అధ్బుత‌మైన ఔష‌ధ‌ గుణాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. స‌రిగ్గా ఉప‌యోగించాలే కానీ లింగ దొండ వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. 

  • స్త్రీల‌లో వ‌చ్చే అన్ని ర‌కాల‌ సంతాన లేమి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో లింగ దొండ‌కాయ‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి.
  • స్త్రీల‌ల్లో నెల‌స‌రి స‌మ‌యంలో వ‌చ్చే నొప్పుల‌ను త‌గ్గించ‌డంతోపాటు, నెల‌స‌రి స‌రిగ్గా వ‌చ్చేలా చేయ‌డంలో కూడా ఈ తీగ ఉప‌యోగ‌ప‌డుతుంది.
  • స్త్రీల‌లోని లైంగిక అవ‌యావాల‌ను ఉత్తేజ‌ప‌రిచి, లైంగిక వాంఛను పెంచే శ‌క్తి కూడా లింగ దొండ‌కాయ‌ల‌కు ఉంటుంది.
  • లింగ దొండ కాయ విత్త‌నాల‌ను పుత్ర జీవ‌క్ విత్త‌నాల‌తో క‌లిపి తీసుకుంటే అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.
  • ఈ తీగ‌ వేర్లు, ఆకుల ర‌సం కారంగా ఉంటుంది. ఈ తీగ ఆకుల ర‌సాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే శ‌రీరంలో వేడి చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.
  • లింగ దొండ కాయ విత్తనాల చూర్ణం మనకు ఆయుర్వేద దుకాణాల‌లో ల‌భిస్తుంది. దీనిని స‌రైన మోతాదులో వాడ‌డం వ‌ల్ల గ‌ర్భాశ‌య దోషాల‌న్నీ తొల‌గి సంతానాన్ని పొంద‌వ‌చ్చ‌ని ఆయుర్వేద వైద్యులు తెలియ‌జేస్తున్నారు.
  • ఒక్క మాటలో చెప్పాలంటే.. లింగ దొండకాయ స్త్రీలకు చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా సంతానలేమి సమస్యఉన్న వాళ్లు ఇది వాడితే రిజల్ట్‌ ఉంటుంది. ఆయుర్వేద వైద్యంపై నమ్మకం ఉన్నవాళ్లు ట్రే చేయొచ్చు. అయితే..మీ దగ్గర ఉన్నాయి కదా అని ఎలా పడితే అలా వాడతా అంటే కుదరదు.. ఆయుర్వదే నిపుణుల సలహా మేరకు మాత్రమే వీటిని వాడాల్సి ఉంటుంది. సర్జికల్‌ షాపుల్లో అడిగితే వాళ్లే క్లియర్‌గా చెప్తారు. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.