Breastfeeding : తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయా.. !

బిడ్డకు breast milk తాగించడం అత్యవసరం. ముఖ్యంగా అప్పుడే పుట్టిన బిడ్డ ఆకలి తీర్చడానికి తల్లిపాలే ఆధారం. అయితే ఈ తల్లిపాలు లేనంత మాత్రాన అవి తాగని పిల్లలు పలు సమస్యలు ఎదుర్కొంటారు అనటంలో నిజం లేదని తెలుస్తోంది..

Breastfeeding : తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయా.. !
Are breastfed children more intelligent


Breast milk : అప్పుడే ప్రపంచాన్ని చూసిన బిడ్డకు ఈ లోకంలో దొరికిన వరం అమ్మ.. అమ్మ పాలు.. ఇవి అప్పుడే పుట్టిన బిడ్డకు గొప్ప వరమనే చెప్పాలి. నవజాత శిశువుకు లోకంలో ఎలాంటి ఆహారం సరిపోదు. తల్లిపాలు మాత్రమే బిడ్డ ఆకలిని తీర్చగలవు. అయితే కొన్ని సందర్భాల్లో తల్లి బిడ్డకు పాలు ఇవ్వలేదు. ఆపరేషన్ కావడం, తల్లికి సరిపడా పాలు పడకపోవడం, చాతి దగ్గర సమస్యలతో బిడ్డ ఆకలిని తల్లి తీర్చలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో బిడ్డకు బయట నుంచి పాలను తీసుకువచ్చి అందించాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు తల్లిపాలు తాగని పిల్లల్లో పలు రకాల సమస్యలు వస్తాయని వాదన వినిపిస్తూ వస్తుంది. అంతే కాకుండా తెలివితేటలు కూడా తక్కువగా ఉంటాయంటారు.  అయితే ఇందులో అసలు నిజం ఎంత అంటే.. 

నవజాత శిశువుకు తల్లిపాలు ఎంతో మేలు చేస్తాయి. అత్యవసరం కూడా.. ముఖ్యంగా పిల్లలకు వచ్చే చెవి, శ్వాస సంబంధిత సమస్యలు తల్లిపాలతో దూరం అవుతాయి. అలాగే ఎలాంటి అలర్జీలు, ఆరోగ్య సమస్యలతో పాటూ భవిష్యత్తులో క్యాన్సర్ వంటి వ్యాధులు సైతం దరిచేరకుండా కాపాడుతుంది. శిశువులో వ్యాధి నిరోధక శక్తిని పెంచి బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది..

ఇవన్నీ తల్లిపాలు తాగి పెరిగే పిల్లల్లో మెండుగా ఉంటాయని చెప్పవచ్చు కానీ తాగకపోతే మాత్రం సమస్యలు వస్తాయని ఇప్పటివరకు ఎలాంటి అధ్యయనాల్లో బయటపడలేదు. భవిష్యత్తులో వచ్చి అన్ని రకాల రోగాలను నివారించగలిగే శక్తి కేవలం తల్లి పాలలోనే ఉందని చెప్పలేమంటూ తేల్చేశాయి. అప్పటివరకు ఉన్న బిడ్డ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచడానికి తల్లిపాలు సహాయపడతాయి కానీ తెలివితేటల విషయంలో సైతం ఎలాంటి ప్రభావం చూపించమని తెలుస్తోంది..

పిల్లలందరూ ఒకే రకమైన తెలివితేటలతో పుడతారని పెరిగే క్రమంలో వారు చూసే పరిస్థితులను బట్టి వ్యక్తిత్వాన్ని మార్చుకుంటారనే విషయం తెలిసిందే. ఇదే విషయం పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తుంది తప్ప తల్లి పాలు ఎలాంటి తెలివితేటలను ఇచ్చి ప్రయోజకుడ్ని చేస్తాయని తేలలేదు. ఇంకా భవిష్యత్తులో వచ్చే రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలను అడ్డుకునే శక్తి తలపాలలో లేదని అందుకే పాలుపడని తల్లులు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదని సమాచారం. కానీ నవజాత శిశువుకు స్వచ్ఛమైన పాలను ఇచ్చి మెరుగైన ఆహారాన్ని అందించడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తోంది. అలాగే లేనిపోని అపోహలు పెట్టుకొని మనశాంతి దూరం చేసుకోవద్దని, అది శరీర స్థితిని బట్టి ఆధారపడి ఉంటుందని, పాలు పడకపోవడం అనేది పెద్ద సమస్యగా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.