కీళ్లనొప్పులను తగ్గించే ఆయింట్‌మెంట్‌ ఇంట్లోనే ఇలా చేయండి..!

ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే.. వాళ్లు తరచూ అనేమాట.. మోకాళ్ల నొప్పులతో నడవలేకపోతున్నాం అని.. ఏజ్‌ పెరిగేకొద్ది కీళ్లు అరిగిపోయి.. కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులు బాధిస్తాయి. ఇలా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి

కీళ్లనొప్పులను తగ్గించే ఆయింట్‌మెంట్‌ ఇంట్లోనే ఇలా చేయండి..!


ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే.. వాళ్లు తరచూ అనేమాట.. మోకాళ్ల నొప్పులతో నడవలేకపోతున్నాం అని.. ఏజ్‌ పెరిగేకొద్ది కీళ్లు అరిగిపోయి.. కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులు బాధిస్తాయి. ఇలా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి వాటి బారిన ప‌డ‌డానికి ముఖ్య కార‌ణం పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డ‌మే అని నిపుణులు చెబుతున్నారు. మ‌న ఇంట్లో స‌హ‌జ సిద్దంగా ఆయింట్ మెంట్‌ను త‌యారు చేసుకుని వాడ‌డంతో పాటు ఆహారంలో మార్పులు చేసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఈ కీళ్ల నొప్పుల స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.
Joint Pain: కీళ్ల నొప్పులకు అసలు కారణం అదేనంట.. సీజన్ మార్పులతో జాగ్రత్త  అంటోన్న నిపుణులు - Telugu News | Cause of Joint Pain: This Ways to Get  Relief from Arthritis Pain Naturally know ...

మోకాళ్ల నొప్పుల‌ను త‌గ్గించే ఆయింట్ మెంట్‌ను ఇంట్లోనే త‌యారు చేసుకోవచ్చు.. అది ఎలానో చూద్దామా..!

ఒక టీ స్పూన్ ప‌సుపును, అర టీ స్పూన్ ఉప్పును, ఒక టీ స్పూన్ ఆవ‌నూనెను, 2 లేదా 3 చుక్క‌ల లవంగం నూనె ఉప‌యోగించాల్సి ఉంటుంది. ల‌వంగం నూనె అందుబాటులో లేని వారు ల‌వంగాల‌ను పొడిగా చేసి వాడ‌వ‌చ్చు. కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు ముందుగా ఒక గిన్నెలో ప‌సుపు, ఉప్పును వేసి క‌ల‌పాలి. త‌రువాత ఆవ‌నూనెను వేసి అన్నీ క‌లిసేలా మిక్స్‌ చేయండి. ఇందులో ల‌వంగం నూనెను కూడా వేసి క‌ల‌పండి. ఇలా చేయ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించే ఆయింట్‌మెంట్ త‌యార‌వుతుంది. 
ఇలా త‌యారు చేసుకున్న ఆయింట్ మెంట్‌ను నొప్పులు ఉన్న చోట రాసి త‌రువాత దానిపై వేడి చేసిన కాట‌న్ వ‌స్త్రంతో కాప‌డం పెట్టుకోవాలి. లేదా ఆ వ‌స్త్రాన్ని నొప్పి ఉన్న భాగం చుట్టూ చుట్టుకోవాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా ఈ ఆయింట్ మెంట్‌ను వాడ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి.. కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల నొప్ప త్వరగా తగ్గుతుంది.

ఈ ఆహారాలను డైలీ తినండి..

కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో వాల్ నట్స్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిలో ఉండే పోష‌కాలు ఎముక‌ల‌ను దృఢంగా చేసి నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. ప్ర‌తీరోజూ 4 నుంచి 5 వాల్ న‌ట్స్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితం ఉంటుంది.
 
మ‌న ఆహారంలో బాదం ప‌ప్పు కూడా ఉండేలా చూసుకోవాలి. ప్ర‌తిరోజూ రాత్రి ప‌డుకునే ముందు 5 బాదం గింజ‌ల‌ను నాన‌బెట్టి ఉద‌యాన్నే వాటిపై ఉండే పొట్టును తీసి తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కీళ్ల‌నొప్పులు త‌గ్గ‌డంతో పాటు ఎముక‌లు దృఢంగా కూడా మారుతాయి.
రోజూ వారీ ఆహారంలో రాగులు, నువ్వులు ఉండేలా చూసుకోవాలి. వీటిని ఏదో ఒక రూపంలో తీసుకోవ‌డం వ‌ల్ల శరీరానికి త‌గినంత క్యాల్షియం ల‌భించి కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. ఈ ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కీళ్ల‌నొప్పులు, మోకాళ్ల నొప్పులు త‌గ్గ‌డంతో పాటు వీటిని ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు రాని వారికి కూడా భ‌విష్య‌త్తులో రాకుండా ఉంటాయి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.