ఈ మూడు ఆసనాలు వేయడం వల్ల.. గుండెజబ్బులు రావట..

ఈరోజుల్లో గుండె జబ్బులు గుబులు పుట్టిస్తున్నాయి.. అనేక కారణాల వల్ల మనిషి ఒత్తిడి గురై దాని ప్రభావం గుండె మీద పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాడు. యుక్త వయస్సులోనే హార్ట్‌ ఎటాక్‌ల బారిన పడుతున్నారు.

ఈ మూడు ఆసనాలు వేయడం వల్ల.. గుండెజబ్బులు రావట..


ఈరోజుల్లో గుండె జబ్బులు గుబులు పుట్టిస్తున్నాయి.. అనేక కారణాల వల్ల మనిషి ఒత్తిడి గురై దాని ప్రభావం గుండె మీద పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాడు. యుక్త వయస్సులోనే హార్ట్‌ ఎటాక్‌ల బారిన పడుతున్నారు. సమస్య వచ్చాక బాధపడటం కంటే.. రాకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. యోగా ఆసనాలను రోజూ వేస్తే దాంతో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఆ ఆసనాలను ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 3 యోగా ఆసనాలను రోజూ వేయండి..!

ఉత్థిత త్రికోణాసనం

నేలపై నిలబడి కాళ్లను దూరంగా చాపాలి. ఇప్పుడు కుడి కాలిని మరింత దూరంగా జరిపి దాని పాదాలను కుడి చేతితో అందుకోవాలి. అలాగే ఎడమ చేయిని నిట్ట నిలువుగా పైకి ఉంచాలి. ఈ భంగిమలో వీలైనంత సేపు ఉండి మళ్లీ సాధారణ స్థితికి రావాలి. ఇలా ఇంకో వైపు కూడా చేయాలి. ఈ ఆసనాన్ని 4-5 సార్లు వేయాలి.

పశ్చిమోత్తాసనం

నేలపై కూర్చోవాలి. కాళ్లను ముందుకు చాపి దగ్గరగా ఉంచాలి. తరువాత ముందుకు వంగి మోచేతులను పాదాల వద్దకు తేవాలి. అనంతరం చేతులతో పాదాలను చుట్టేయాలి. తలను పూర్తిగా కిందకు వంచి కాళ్లపై ఆనించాలి. ఇది చెప్పినంత సులభం కాదు.. మీరు ముందు కాళ్లను నిటారుగా ఉంచి చేతులతో కాలి వేళ్లను పట్టుకోవడానికే వారం పడుతుంది.. ఆ తర్వాత తలను కొద్దికొద్దిగా ఆనించాలి.. మొత్తం ఒక నెలరోజులు పడుతుంది.. పూర్తిగా ఈ ఆసనం వేయడానికి.. ఈ భంగిమలో వీలైనంత సేపు ఉండాలి. తరువాత సాధారణ స్థితికి రావాలి. దీన్ని కూడా రోజూ 4-5 సార్లు చేయాలి.దీనివల్ల వెన్నునొప్పి, బెల్లీ ఫ్యాట్‌ మొత్తం తగ్గుతుంది.

అర్ధ మత్య్సేంద్రాసనం

నేలపై కూర్చుని కాళ్లను ముందుకు చాపాలి. ఎడమకాలిని తీసి కుడికాలి మీదుగా వేయాలి. ఎడమ కాలి పాదం కుడి మోకాలికి అవతలి వైపు వచ్చేలా వేయాలి. తరువాత కుడి చేత్తో ఎడమ మోకాలిని కుడి వైపుకు వంచినట్లు చేయాలి. ఈ క్రమంలో తలను ఎడమ భుజం మీదుగా పక్కకు తిప్పి చూడాలి. ఎడమ చేతిని నేలపై ఆనించి వీపు నుంచి దూరంగా జరపాలి. ఈ భంగిమలో కొంత సేపు ఉండి సాధారణ స్థితికి వచ్చి ఇంకో వైపుకు కూడా అలాగే చేయాలి. దీన్ని రోజుకు 3-4 సార్లు వేయాలి. 

ఈ విధంగా మూడు యోగా ఆసనాలను రోజూ వేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె జబ్బులు.. ముఖ్యంగా హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. బీపీ తగ్గుతుంది. వీటిని వేయడం కూడా అంత కష్టమైన పని కాదు.. కాబట్టి కచ్చితంగా ట్రై చేయండి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.