సైకిల్‌ తొక్కితే స్పెర్మ్‌ కౌంట్‌ పడిపోతుందా..?

ఆరోగ్యం మీద అవగాహన కంటే చాలా మంది అపోహలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అపోహలు వల్లే అబద్ధాలను బలంగా నమ్ముతున్నారు, మంచిని దూరం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పురుషుడు.. తమ జీవితంలో వినే కొన్ని అపోహలు వాటిలో నిజం ఎంత ఉందనేది

సైకిల్‌ తొక్కితే స్పెర్మ్‌ కౌంట్‌ పడిపోతుందా..?


ఆరోగ్యం మీద అవగాహన కంటే చాలా మంది అపోహలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అపోహలు వల్లే అబద్ధాలను బలంగా నమ్ముతున్నారు, మంచిని దూరం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పురుషుడు.. తమ జీవితంలో వినే కొన్ని అపోహలు వాటిలో నిజం ఎంత ఉందనేది ఈరోజు తెలుసుకుందాం. ఈ విషయాలు కచ్చితంగా పురుషులు తెలుసుకోవాలి.

అపోహ: ఒత్తిడి తగ్గించుకునేందుకు కాస్త తాగితే తప్పు లేదు

వీకెండ్ పార్టీల్లో వారంలో ఒకసారి తాగేవారిని ఎవర్ని అడిగినా.. వీకెండ్‌లో తాగితే తప్పు ఏం లేదు. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్‌ రీఫ్రెష్‌ అవుతుంది అంటారు. ఒత్తిడి నుంచి బయటపడేందుకు లేదా సంతోషాన్ని సెలబ్రేట్ చేసేందుకు అంటూ కారణాలు వెతికి తాగుతుంటే మాత్రం నిజంగా తాగాల్సిన అవసరం ఉందా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవడం అవసరమని వైద్యులు అంటున్నారు. వారానికి 14 యూనిట్లకు మించి తాగుతుంటే మాత్రం కచ్చితంగా మీరు మీ అలవాటు గురించి ఆలోచించాలి. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, లేదా మీ పని మీద కూడా ఆల్కహాల్ ప్రభావం చూపుతుంటే మాత్రం తప్పకుండా మీరు నిపుణుల సహాయం తీసుకోవాలట.

అపోహ : సైక్లింగ్‌తో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది

సైక్లింగ్‌ చాలా మంచి వ్యాయామం. కానీ దీనిపై అటు పురుషులకు, ఇటు స్త్రీలకు ఎన్నో అపోహలు ఉన్నాయి. సైక్లింగ్‌ చేయడం వల్ల వర్జైనా పొర చీలిపోతుంది, గర్భసంచికి ఇబ్బంది అవుతుందని స్త్రీలు అనుకుంటారు. పురుషులు అయితే సైక్లింగ్‌తో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని మిడిల్ ఏజ్ పురుషులు చాలామంది అనుకుంటారు. నిజానికి సైక్లింగ్ మంచి వ్యాయామం. దాని వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. సైక్లింగ్ వల్ల కౌంట్ తగ్గదు. కానీ బిగుతుగా ఉండే దుస్తులు ఎక్కువ సమయం పాటు ధరించి ఉండడం వల్ల వృషణాల్లో ఉష్ణోగ్రతలు పెరిగి కౌంట్ తగ్గవచ్చనేది వాస్తవం.

అపోహ: పురుషుల్లో ఆస్టియోపొరోసిప్ రాదు

సాధారణంగా 50 సంవత్సరాల పైబడిన వయసు మహిళల్లో ఆస్టియోపొరోసిస్ సమస్య కనిపిస్తుంటుంది. వారిలో ఎముకల్లో సాంద్రత తగ్గుతుంటుంది. ఎముకలు గుల్లబారుతాయి. అయితే పురుషులు మహిళల్లో అంత ఎక్కువగా ఈ వ్యాధి కనిపించదు. కానీసియోలియాక్ డిసీజ్‌కు చికిత్సగా చాలా కాలం పాటు స్టెరాయిడ్లు వాడడం, లేదా ఇమ్యూనోసెంప్రసెంట్స్ వాడడం వల్ల పురుషుల్లో ఆస్టియోపొరోసిస్ రావచ్చు. ఇలాంటి సందర్బాల్లో స్ట్రెంత్ ట్రెయినింగ్‌ను నిపుణులు సిఫారసు చేస్తున్నారు.  

అపోహ : రొమ్ము క్యాన్సర్ కేవలం స్త్రీలకే వస్తుంది

రొమ్ము క్యాన్సర్ కేవలం స్త్రీలకే వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. ఏడాదికి 400 మంది పురుషులు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారట. ఆల్కహాల్, స్థూలకాయం, కుటుంబ చరిత్ర వంటివన్నీ దీనికి కారణం అవుతున్నాయి. సాధారణంగా మహిళలకు తరచుగా రొమ్ములను స్వీయ పరీక్ష చేసుకోవాలని సూచిస్తారు అలాగే పురుషులకు వృషణాలను పరీక్షించుకోవాలని చెబుతారు. అలాగే పురుషులు కూడా తరచు రొమ్ములు కూడా పరీక్షించి చూసుకోవాలి. గడ్డలు లేదా ఏదైనా మార్పులు కనిపిస్తే తప్పకుండా డాక్టర్‌ను కలవాలి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.