ఉత్థాన పాదాస‌నంతో గ్యాస్‌, మలబద్ధకం మాయం..! ఈజీగా వేయొచ్చు..!

గ్యాస్‌, అసిడిటీ, అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం.. పేర్లు వేరైనా..వీటివల్ల వచ్చే సమస్య మాత్రం ఒక్కటే.. తిన్నది అరగక..ఆగం అవుతారు.. వీటిని తగ్గించుకోవడానికి ట్యాబ్లెట్లు, ఏవేవో డ్రింక్స్‌ తాగుతుంటారు

ఉత్థాన పాదాస‌నంతో గ్యాస్‌, మలబద్ధకం మాయం..! ఈజీగా వేయొచ్చు..!


గ్యాస్‌, అసిడిటీ, అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం.. పేర్లు వేరైనా..వీటివల్ల వచ్చే సమస్య మాత్రం ఒక్కటే.. తిన్నది అరగక..ఆగం అవుతారు.. వీటిని తగ్గించుకోవడానికి ట్యాబ్లెట్లు, ఏవేవో డ్రింక్స్‌ తాగుతుంటారు. ఇవి రావడానికి చాలా కారణాలు ఉంటాయి.. అలాగే పోవడానికి కూడా మార్గాలు చాలా ఉంటాయి. మనం ఏది ఎంచుకుంటున్నాం అనేది ముఖ్యం.. గ్యాస్‌ సమస్యను ఒక ఆసనం ద్వారా కూడా తరిమేయొచ్చు తెలుసా..? ఎలాంటి మందులు, చిట్కాలు లేకుండా.. ఈ మలబద్ధకం, గ్యాస్‌ లాంటి సమస్యలను సాగనంపే ఆ ఆసనం రోజుకు క‌నీసం 5 నిమిషాల పాటు వేయాలి. అల‌వాటు అయ్యాక రోజుకు స‌మ‌యం 10 నిమిషాల వ‌ర‌కు అయినా పెంచుకోవ‌చ్చు. ఈ ఆస‌నాన్ని వేయ‌డం వ‌ల్ల చ‌క్క‌ని ఫ‌లితం ఉంటుంది. దీన్ని ఎలా వేయాలి.. దీంతో ఇంకా ఏమేం ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గ్యాస్ స‌మ‌స్య‌ను త‌గ్గించి జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రిచే ఈ ఆస‌నాన్ని ఉత్థాన పాదాస‌నం అంటారు. దీన్ని సుల‌భంగానే ఎవ‌రైనా స‌రే వేయ‌వ‌చ్చు. కానీ ఆప‌రేష‌న్ అయిన వారు.. వెన్ను నొప్పి ఉన్న‌వారు మాత్రం వేయకూడదు.. ఈ ఆస‌నాన్ని ఎలా వేయాలంటే...

ఉత్థాన పాదాస‌నం ఎలా వేయాలంటే..

నేల‌పై వెల్ల‌కిలా ప‌డుకోవాలి. 
కాళ్ల‌ను రెండింటినీ ద‌గ్గ‌ర‌గా ఉంచాలి. 
త‌రువాత ఒక కాలుని నెమ్మ‌దిగా పైకి ఎత్తాలి. దాన్ని గాల్లో అలాగే ఉంచాలి. 
త‌రువాత ఇంకో కాలుని కూడా పైకి ఎత్తాలి. 
ఇలా రెండు కాళ్ల‌ను పైకి ఎత్తిన త‌రువాత ఈ భంగిమ‌లో వీలైనంత సేపు ఉండాలి. 
త‌రువాత ఒక్కో కాలుని నెమ్మ‌దిగా మ‌ళ్లీ కింద పెట్టాలి. ఇలా ఈ ఆస‌నాన్ని వేయాలి. 
5 నుంచి 10 నిమిషాల వ్య‌వ‌ధిలో ఎన్ని సార్లు అయినా ఈ ఆస‌నాన్ని వేయ‌వ‌చ్చు. 
సౌక‌ర్యాన్ని బ‌ట్టి స‌మ‌యం కూడా పెంచ‌వ‌చ్చు. 
ఈ ఆస‌నాన్ని వేయ‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డి గ్యాస్ స‌మ‌స్య త‌గ్గుతుంది. 
మ‌ల‌బ‌ద్ద‌కం అన్న‌ది ఉండ‌దు. 
క‌డుపులో మంట త‌గ్గిపోతుంది. 
పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు కూడా క‌రుగుతుంది. 
షుగ‌ర్ ఉన్న‌వారికి మేలు చేస్తుంది. 
పొట్ట‌, తొడ‌లు, కాళ్ల కండ‌రాలు దృఢంగా మారుతాయి. 
ఈ ఆస‌నాన్ని రోజూ వేసి.. ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.